హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dengue cases: దేశంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఈ చిట్కాలతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి..

Dengue cases: దేశంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఈ చిట్కాలతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dengue cases: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రతి ఏడాది 400 మిలియన్లకు పైగా ప్రజలు డెంగ్యూ వైరస్ బారిన పడుతున్నారు. డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా ఆడ ఈడిస్ ఈజిప్టి దోమ వల్ల డెంగ్యూ వైరస్‌ను వ్యాపిస్తుంది.

ఇంకా చదవండి ...

చలికాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల చుట్టుముడుతుంటాయి. అందుకే, ఈ సీజన్​లో ఆరోగ్యం, ఆహారం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్​ వంటి వ్యాధుల భారీన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రతి ఏడాది 400 మిలియన్లకు పైగా ప్రజలు డెంగ్యూ వైరస్ బారిన పడుతున్నారు. డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా ఆడ ఈడిస్ ఈజిప్టి దోమ వల్ల డెంగ్యూ వైరస్‌ను వ్యాపిస్తుంది. అయితే, డెంగ్యూ మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, సరైన చికిత్స, సకాలంలో రోగ నిర్ధారణ లేకపోవడం మరణించే ప్రమాదం కూడా ఉంది. అందుకే, ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెరుగుతున్న డెంగ్యూ కేసుల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

లక్షణాలను గుర్తించండి

ప్రతి ఒక్కరు డెంగీ లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. కంటి నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు, ఎముకల నొప్పి, దద్దుర్లు, కండరాల నొప్పి, అసాధారణ రక్తస్రావం, కీళ్ల నొప్పి, అలసట లేదా విశ్రాంతి లేకపోవడం వంటివి డెంగ్యూ లక్షణాల కిందికి వస్తాయి. ఈ లక్షణాలు బయటపడ్డ వెంటనే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

మీ పరిసరాలను క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. మురికి, తడి, తేమతో కూడిన ప్రాంతాల్లో దోమలు, సూక్ష్మక్రిములకు అడ్డాలు. మీరు ఆయా ప్రదేశాల్లో సంచరించడం వల్ల సూక్ష్మక్రిములు శరీరంలోకి చేరి హాని కలుగజేస్తాయి. అందువల్ల, ఎల్లప్పుడూ మీ పరిసరాలను శుభ్రంగా, పొడిగా ఉండేటా చూసుకోండి.

ఉతికిన బట్టలనే ధరించండి

బయటికి వెళ్లేటప్పుడు, శరీరం మొత్తం కవర్​ అయ్యేలా ఫుల్ స్లీవ్‌లను ధరించండి. ఇది దోమల బెడదను నివారించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు క్రిమి సంహారక స్ప్రే, లోషన్లు, దోమ తెరలు ఉపయోగించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి.

తడి ప్రదేశాలకు దూరంగా ఉండండి

తడిగా ఉన్న ప్రదేశాల్లో దోమలు, బాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర హానికరమైన సూక్ష్మక్రిములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అందుకే, ఎప్పటికప్పుడు డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రం చేయండి. నీరు ఎక్కువగా చేరితే వాటిని తోడెయ్యండి. మీ పరిసరాలను పొడిగా ఉంచుకోండి.

ఇది కూడా చదవండి : ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కావాలా? అయితే, వీటిని మీ ఆహారంలో చేర్చండి..

రోగనిరోధక శక్తిని పెంచుకోండి

బలమైన రోగనిరోధక శక్తి అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. అందుకే, మీ ఆహారంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చండి. సిట్రస్ పండ్లు, పైనాపిల్, బెర్రీలు, చికెన్, గుడ్లు, సాల్మన్, ట్యూనా వంటివి ఎక్కువగా తీసుకోండి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Dengue fever, Health care, Health Tips, Life Style, Mosquito

ఉత్తమ కథలు