సైనస్ ఇన్ఫెక్షన్ల (Sinus Pressure) తో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా వరకు ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడకుండానే తగ్గిపోతాయి. సైనసిటిస్ అనేది మీ బుగ్గలు, నుదిటి వెనుక, ముక్కుకు ఇరువైపులా వచ్చే వాపు. ఇది గొంతు నుంచి పొట్ట వరకు శ్లేష్మ ప్రవాహాన్ని ఆపుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వ్యాపించవచ్చు. దీర్ఘకాలిక అలర్జీలు, నాసల్ పోలిప్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. ఇంటి చిట్కాలతో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
సైనస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు
దీని ప్రభావంతో నుదురు, కళ్లు, ముక్కు, బుగ్గల చుట్టూ నొప్పి ఉంటుంది. రుచి సరిగ్గా తెలియకపోవడం లాంటి తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. కంటి వాపు, వికారం, వాంతులు ఉంటే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి.
లక్షణాలు తీవ్రంగా లేకుంటే ఈ నివారణ మార్గాలను పాటించవచ్చు
* ఆవిరి పట్టడం
ఆవిరి పట్టడం ద్వారా నాసికా భాగాలు తెరచుకుంటాయి. నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పసుపు, తులసి, యూకలిప్టస్, మరికొన్ని మూలికలను నీటిలో మరిగించి ఆవిరిపట్టవచ్చు.
* వెచ్చని వస్త్రంతో మర్దన
సైనస్ లక్షణాలు ఉన్నవారు ముక్కు, బుగ్గలు, కళ్లపై ఆవిరి పట్టిన టవల్ లేదా క్లాత్‌తో మర్దన చేయాలి. దీనివల్ల నాసిక రంధ్రాలు తెరచుకొని శ్లేష్మం వదులుతుంది. అవసరాన్ని బట్టి ఈ పద్ధతిని అనుసరించాలి.
* హ్యూమిడిప్లైయర్ వాడకం
హ్యూమిడిప్లైయర్ గాలిలో తేమను పెంచుతుంది. మంటను తగ్గించడానికి, ముక్కు రంధ్రాలు తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్యూమిడిప్లైయర్ సమర్థంగా పనిచేయాలంటే వీలైనంత దగ్గరగా పెట్టుకోవాలి. ఊపిరితిత్తుల్లో వైరస్, బ్యాక్టీరియాలను హ్యూమిడిప్లైయర్ నిరోధిస్తుంది. అయితే దీన్ని వినియోగించేవారు తయారీదారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
* నీరు- విశ్రాంతి
సైనస్ బాధితులు తరచుగా నీరు తాగడం వల్ల శ్లేష్మం తొలగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు నీరు తాగుతూ సైనస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
* నెట్ పాట్
ముక్కు రంధ్రాలు శుభ్రం కోసుకోవడానికి నెట్ పాట్ ఉపయోగపడుతుంది. శ్లేష్మం, దుమ్ము, పుప్పొడి, ఇతర వ్యర్థాలను నెట్ పాట్ తొలగిస్తుంది. ప్రతి రోజూ నాసికా రంధ్రాలను శుభ్రం చేసుకునే ఈ పద్ధతి ఆవిరి పట్టడం కంటే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల సైనస్ సమస్య ఉన్నవారు ఆరు నెలల పాటు ఈ విధానాన్ని పాటించి మార్పు గమనించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cold remedies, Health problem, Health Tips, Life Style