హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Heart Health: వృద్ధుల్లో గుండెపోటు లక్షణాలు ఇవే.. సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..

Heart Health: వృద్ధుల్లో గుండెపోటు లక్షణాలు ఇవే.. సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..

Heart Health: వృద్ధుల్లో గుండెపోటు లక్షణాలు ఇవే.. సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..

Heart Health: వృద్ధుల్లో గుండెపోటు లక్షణాలు ఇవే.. సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..

శరీరంలో కలిగే మార్పుల వల్ల 60 ఏళ్ల తర్వాత గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అయితే రోజూ కొన్ని నియమాలు పాటిస్తే, గుండెను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చని కార్డియాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

మలి వయసులో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు చుట్టు ముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కలిగే మార్పుల వల్ల 60 ఏళ్ల తర్వాత గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అయితే రోజూ కొన్ని నియమాలు పాటిస్తే, గుండెను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చని కార్డియాలజీ నిపుణులు సూచిస్తున్నారు. మరి వృద్ధుల్లో గుండె జబ్బుల ముప్పునకు కారణాలేంటి? గుండెపోటుకు దారితీసే పరిస్థితులేంటి? వీటి నుంచి ఎలా బయటపడాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లో ఎక్కువగా అరిథ్మియాస్ సమస్య ఏర్పడుతుంది. అంటే గుండె వేగం ఉన్నట్టుండి పడిపోవడం, అప్పటికప్పుడే ఎక్కువ కావడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు అసాధారణంగా గుండె కొట్టుకుంటుంది. వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. దీంతో గుండె పనిచేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అంతేగాకుండా హార్ట్ బీట్ మందగిస్తుంది. వయసు పెరగడం వల్ల రక్తనాళాల్లో కూడా మార్పు సంభవిస్తుంది. తద్వారా హార్ట్ బీట్ రేటుపై ప్రభావం చూపుతుంది. వృద్ధాప్యం సమీపిస్తున్న తరుణంలో శరీరం ఉప్పుకు చురుకుగా స్పందిస్తుంటుంది. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్(బీపీ) పెరగడం, తక్కువైతే అరికాళ్లు, అరిచేతుల్లో చెమటలు రావడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ గుండె సమస్యలకు దారితీస్తాయి.

వృద్ధుల్లో గుండెపోటు లక్షణాలు

ఛాతీలో నొప్పిగా ఉంటోందని వృద్ధులు చెబితే దానిని తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే గుండెపోటుకు ఇదొక సంకేతం. ఛాతీకి ఎడమవైపు భాగంలో తెలియని అసౌకర్యం ఏర్పడుతుంది. ఏదో పట్టి లాగుతున్న భావన కలుగుతుంది. ఛాతీలో మంట పెట్టినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ గుండెపోటుకు సంకేతాలే.

ఛాతీతో పాటు భుజాలపై నొప్పిగా ఉన్నట్లు అనిపించినా అది హార్ట్ ఎటాక్‌కి సంకేతమే. పొత్తి కడుపు, వెన్ను భాగం, మెడ భాగాల్లో నొప్పి పుట్టినా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చే ముందు శరీర పైభాగంలో అసౌకర్యం కలుగుతుంది.

గుండె సంబంధిత వ్యాధుల వల్ల సదరు వ్యక్తి పూర్తిగా శక్తిని కోల్పోతారు. చికాకు కలుగుతుంది. ఏ కారణం లేకుండానే తలతిరిగినట్లు అనిపిస్తుంది. ఊపిరి సరిగా ఆడదు. ఎంతో కష్టం చేసి అలసిపోయామన్న భావన కలుగుతుంది. స్తబ్దుగా ఐపోతారు. ఇలా అనిపించినా అది గుండెపోటుకు సంకేతమేనని నిపుణులు చెబుతున్నారు.

కారణాలు ఏంటి?

గుండెనాళాల్లో కొవ్వు, ఇతర అవశేషాలు పేరుకు పోవడం వల్ల గుండెపోటు సంభవించే అవకాశం ఉంటుంది. నాళాల్లో పూడికల వల్ల రక్తప్రసరణ సాఫీగా జరగదు. ధమనులు సన్నబడినా, గట్టిగా మారినా పూడికకు దారితీస్తుంది. అత్యధిక శాతం మంది వృద్ధులు ఈ కారణం వల్లనే గుండెపోటుకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఎక్కడైనా రక్తం గడ్డ కడితే రక్త ప్రసరణ చేయడంలో గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది.

CSIR UGC NET : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. దరఖాస్తు ఇలా..

ఎలా నివారించాలి?

గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. జాగింగ్, వాకింగ్ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. ఇలా వ్యాయామం చేయడంతో పాటు బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. డైట్‌ని పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లేటు వయసులో ఉన్నవారు ఆల్కహాల్, సిగరెట్లు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

First published:

Tags: Best health benefits, Health alert, Heart Attack

ఉత్తమ కథలు