హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Heart Deseases Types: సాధారణ గుండె జబ్బుల్లో ఇన్ని రకాలుంటాయ్.. తప్పకుండా తెలుసుకోవాలి

Heart Deseases Types: సాధారణ గుండె జబ్బుల్లో ఇన్ని రకాలుంటాయ్.. తప్పకుండా తెలుసుకోవాలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుండెలోని వేర్వేరు భాగాలను ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులు గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. అనేక రకాల హార్ట్ కండీషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్‌ను సమిష్టిగా గుండె జబ్బులు (Heart disease) అంటారు. ఇలాంటి సాధారణ గుండె జబ్బులు ఏవో చూద్దాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Guntur

ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. మానవ శరీరంలో గుండె చాలా సంక్లిష్టమైన అవయవం. మనల్ని సజీవంగా ఉంచడానికి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే ఈ అవయవానికి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. గుండెలోని వేర్వేరు భాగాలను ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులు గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. అనేక రకాల హార్ట్ కండీషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్‌ను సమిష్టిగా గుండె జబ్బులు (Heart disease) అంటారు. ఇలాంటి సాధారణ గుండె జబ్బులు ఏవో చూద్దాం. 

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు (Congenital Heart Disease)

కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు ఉండవచ్చు. గుండెకు చిన్న రంధ్రం ఉండటం నుంచి తీవ్రమైన గుండె వ్యాధులు అన్నీ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కిందకు వస్తాయి. ఈ వ్యాధులను చాలా వరకు శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. గర్భధారణ సమయంలో వైద్యులు తరచుగా ఈ సమస్యలను నిర్ధారిస్తారు. కానీ కొందరిలో యుక్తవయసు వచ్చే వరకు ఎలాంటి లక్షణాలు బయట పడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.

Health Tips: ఉదయాన్నే బెల్లం నీటిని తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే


పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవేంటంటే..


  • గుండె కవాటాల్లో సమస్యలు: కవాటాలు చాలా ఇరుకుగా మారతాయి లేదా కుంచించుకుపోతాయి.

  • రక్త నాళాల సమస్యలు: ఇవి శరీరంలోని కుడి భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్లడంలో సమస్యలకు కారణమవుతాయి.

  • గుండె కండరాల సమస్యలు: అవసరమైనంత సమర్ధవంతంగా గుండె రక్తాన్ని పంప్ చేయలేదు.


కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)

కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ధమనులు పూడుకుపోయినప్పుడు ఏర్పడే పరిస్థితి. ధమని గోడలపై కొలెస్ట్రాల్, కణాల నుంచి పోగయ్యే ఇతర వ్యర్థ పదార్థాలు ఏర్పడటం వల్ల CAD అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ధమనుల్లో ఫలకాలు ఏర్పడతాయి. ఈ ఫలకం రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. లేదా రక్త ప్రసరణ ప్రక్రియపై ప్రభావం చూపి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఫలకం విరిగిపోయినా లేదా చీలిపోయినా, రక్తనాళాన్ని సరిచేయడానికి ప్లేట్‌లెట్‌లు ఆ ప్రాంతం చుట్టూ క్లస్టర్‌గా ఏర్పడతాయి. దీంతో ధమని ఎక్కువగా పూడుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది గుండెపోటుకు (Heart attack) దారితీస్తుంది.

Curry Leaves Health Benefits: కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు? తింటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్.. తెలుసుకోండి


హార్ట్ అరిథ్మియా (Heart Arrhythmia)

హార్ట్ బీట్స్‌ను సమన్వయం చేసే విద్యుత్ ప్రేరణలను (Electrical impulses) గుండె నియంత్రించలేనప్పుడు హార్ట్ అరిథ్మియా అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల గుండె చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో హార్ట్ అరిథ్మియా అనేది ప్రమాదకరంగా మారదు. ఇది కేవలం చిన్న అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే రోగికి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ఇతర వ్యాధులు ఉంటే.. హార్ట్ అరిథ్మియాకు తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు.

డైలేటెడ్ కార్డియోమయోపతి (Dilated Cardiomyopathy)

ఎడమ జఠరిక చాలా పెద్దదిగా మారి రక్తం ప్రవహించనప్పుడు ఈ ప్రాణాంతక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, గుండె కండరాల గోడలు క్రమంగా బలహీనపడతాయి. రక్తాన్ని శరీర భాగాలకు సరిగా పంప్ చేయలేవు. దీనివల్ల మూత్రపిండాలు మరింత సోడియంను స్టోర్ చేసుకుంటాయి. దీంతోపాటు చీలమండలు, కాళ్లు, ఊపిరితిత్తులు, పాదాలు, ఇతర అవయవాలలో ఏర్పడే ద్రవాలు కూడా కిడ్నీల్లో పోగవుతాయి. 

పల్మనరీ స్టెనోసిస్ (Pulmonary Stenosis)

పల్మనరీ స్టెనోసిస్ అనేది సాధారణ రక్త ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు పల్మనరీ వాల్వ్ ఇరుకుగా, దృఢంగా మారినప్పుడు అభివృద్ధి చెందే పరిస్థితి. ఇలా జరిగినప్పుడు పుపుస ధమని(Pulmonary artery) లోకి రక్తాన్ని పంపడానికి కుడి జఠరిక ఎక్కువ కష్టపడుతుంది. అదనపు పనిభారాన్ని భర్తీ చేయడానికి ఇది మరింత మందంగా మారుతుంది. ఇది హైపర్ట్రోఫీ అనే కండీషన్‌కు దారి తీస్తుంది. ఈ సమస్య దానికదే ఎక్కువ ప్రమాదాన్ని కలిగించదు. కానీ ఇది వైద్య సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి అని నిపుణులు సూచిస్తున్నారు. కామన్ హార్ట్ కండీషన్స్‌కు చెక్ పెట్టడంలో రెగ్యులర్ చెకప్‌లు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Health Tips: తిన్న ఆహారం జీర్ణం కావడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే అజీర్తి నుంచి విముక్తి


ఆంజినా (Angina)

ఆంజినా అనేది కరోనరీ హార్ట్ డిసీజ్ లక్షణం. ఇది ఒక అనారోగ్యం కాదు. బాధితులు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు గుండెకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని చెప్పే కండీషన్. ఛాతీ, చేయి, మెడ, కడుపు లేదా దవడలో నొప్పి లేదా అసౌకర్యం కలగడాన్ని ఆంజినా అంటారు. వ్యక్తుల గుండె ధమనులు ఇరుకుగా మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇలా రక్త సరఫరాకు ఆటకం కలగడాన్ని అథెరోమా అంటారు. సమస్య తీవ్రతను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ఛాతీ నొప్పి చాలా తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్య సహాయం అందించాలి.  

అస్థిర ఆంజినా (Unstable angina)

ఇప్పటికే ఉన్న ఆంజినా ఆకస్మికంగా తీవ్రతరం అయినా, ఇంతకు ముందెన్నడూ గుర్తించని ఛాతీ నొప్పి వచ్చినా ఆ కండీషన్‌ను అన్ స్టెబుల్ ఆంజినా అంటారు. గుండెకు రక్త సరఫరా చాలా వరకు తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఎలాంటి శారీరక శ్రమ చేయనప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఇలా జరగవచ్చు. ఈ లక్షణాలు 10 నిమిషాల వరకు ఉండవచ్చు. ఇలాంటప్పుడు బాధితులకు అత్యవసరంగా వైద్య సహాయం అందించాలి. దీన్ని ఒక రకమైన అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ (ACS)గా కూడా వర్గీకరిస్తారు. 

Parenting Tips: ఈ 5 చేస్తే.. మీ పిల్లల IQ లెవల్ అమాంతం పెరిగిపోతుందట..


గుండెపోటు (Heart attack)

గుండెపోటును వైద్య పరంగా మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ లేదా MI అని కూడా పిలుస్తారు. గుండె కండరాలకు రక్త సరఫరాలో ఆటంకం ఎదురైనప్పుడు హార్ట్ ఎటాక్ రావచ్చు. కరోనరీ ఆర్టరీలో కొవ్వు పదార్ధం విశ్చిన్నం కావడం, రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి సంభవిస్తుంది. ఇది నిర్దిష్ట కరోనరీ ఆర్టరీ సరఫరా చేసే గుండె కండరాల భాగానికి నష్టం కలిగించవచ్చు. ఫలితంగా బాధితులకు ప్రాణాపాయం కలగవచ్చు. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి, సాధ్యమైనంత త్వరగా అత్యవసర చికిత్స అందిస్తేనే బాధితుల ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంటుంది. గుండెపోటుకు ట్రీట్‌మెంట్ ఎంత ఆలస్యమైతే, ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది.

First published:

Tags: Health Tips, Heart Attack

ఉత్తమ కథలు