Goat Milk Health Benefits: పాలు శ్రేష్టమైన ఆహారం. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బలంగా మారుతుంది. ఐతే మనలో చాలా మంది ఆవు లేదా గేదె పాలు తాగడానికే ఇష్టపడతాం. మార్కెట్లో కూడా వీటి పాలే దొరుకుతాయి. కానీ ఆవు, గేదె కంటే శ్రేష్టమైన పాలు ఏవో తెలుసా..? మేక పాలు (Goat Milk) ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాల ఉత్పత్తులలో ఒకటి. భారత్తో పాటు కొన్ని దేశాల్లోనే ఆవు, గేదె పాలు తాగుతారు. కానీ చాలా దేశాల్లో మేక పాలనే ఎక్కువగా వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 65-72% మంది పాల వినియోగదారులు మేక పాలనే ఉపయోగిస్తున్నారు.
Vitamin B12: విటమిన్ బి 12 మన శరీరానికి ఎంత ముఖ్యమైనది
ఆవులు, గేదెలను పెంచడం కంటే.. మేకలను పెంచడం సులభం. పాడి పరిశ్రమ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దేశాలలో మేకలను ఎక్కువగా పెంచుతున్నారు. ఇతర జంతువులతో పోల్చితే వీటి పెంపకానికి తక్కువ ఖర్చవుతుంది. అంతేకాదు మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కేలరీలు, ప్రోటీన్లు, లిపిడ్లు ఉంటాయి.
శనగలు నానబెట్టిన నీటితో బరువు తగ్గడంతోపాటు ఈ వ్యాధులు నయమవుతాయట..
ఆవు, గేదెలతో పోల్చితే మేక పాలు చాలా చిక్కగా ఉంటాయి. క్రీమ్ కూడా భిన్నంగా ఉంటుంది. గుండెకు సంబంధించిన వ్యాధులలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మేక పాలు చర్మ అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పాలు చర్మానికి మరింత మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మానవ చర్మం, మేక పాల pH దాదాపు సమానంగా ఉంటుంది.
మేక పాలను తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తొలగిపోతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు (Heart Diseases), పక్షవాతం (Paralysis), మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High Blood Pressure) ప్రమాదాలు తగ్గుతాయి.
మేక పాలు (Goat Milk) క్యాన్సర్ ముప్పును తొలగిస్తుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల (cancer) పెరుగుదలను నిరోధిస్తుంది. మేక పాలని తాగని వారితో పోల్చితే.. మేక పాలని తాగే వారిలో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవు, గేదె పాల కంటే మేక పాలు శ్రేష్ఠమైనవని.. వీటితో అధిక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Lifestyle