Pimples: అక్కడ మొటిమలు వచ్చాయంటే.. మీలో ఈ వ్యాధి ఉన్నట్లే.. జాగ్రత్త పడండి

ప్రతీకాత్మక చిత్రం

Beauty Tips: మీరు శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తినకపోయినా, మలబద్ధకం ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, పీరియడ్స్‌కు ముందు, సరిగ్గా నిద్ర లేకపోయినా మొటిమల బారిన పడతారు. వీటికి విరుగుడు ఆయా కారణాలపై దృష్టి పెట్టడమే.

  • Share this:
సాధారణంగా మొటిమలు అంటే అవి టీనేజర్లకే వస్తాయని కొట్టిపడేస్తాం. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా మొటిమలు రావచ్చు. కేవలం ముఖంపై మాత్రమే కాదు మెడ, వీపు, భుజాల కింది భాగమైన చేతుల పైన, పొట్ట పైన ఇలా శరీరంలోని పలు చోట్ల మొటిమలు రావచ్చు. గుల్లల్లా కనిపించే మొటిమలు కొన్ని చీముతో నిండి మెరుస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా నొప్పి పెట్టి ఇబ్బంది పెడుతుంటాయి. ఇక ముఖంపై వచ్చే దద్దుల్లాంటి మొటిమలు చూసేందుకు వికారంగా కనిపిస్తాయి. నున్నగా, మెరిసే చర్మం ఉంటే అదే అందాన్ని తెస్తుంది కనుక మొటిమలు నివారించే మార్గాలను ఫాలో అవటం బెస్ట్ అని డెర్మిటాలజిస్టులు సలహా ఇస్తున్నారు. ఇందుకు ఏం చేయాలంటారా అసలు మీ చర్మ తత్వమేంటో తెలుసుకోండి. ఆ తరువాత మీ వయసును బట్టి మీకు మొటిమలు ఏ స్పాట్లలో వస్తున్నాయో గుర్తించండి. చివరిగా ఇవి తగ్గేందుకు, మళ్లీ రాకుండా ఉండేందుకు నివారణలను పాటించండి.

ఇక ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే వాటిని గిల్లటం, మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగించి, శాశ్వతంగా మచ్చలు కొనితెచ్చుకోకండి. కొందరు పదేపదే ఇలాంటి మొటిమలపై వేళ్లతో రుద్దుకోవటం, గిల్లటం చేస్తుంటారు. అవన్నీ తక్షణం మానేయాలి లేదంటే మీకు ఒక్క మొటిమ ఉన్నా దాన్ని ఇలా ముట్టుకోవటంతో మిగతా చర్మంపై కూడా అవి పాకే ప్రమాదం ఉంటుంది. మీది పొడి చర్మం అయినా, మీకు ఎటువంటి అనారోగ్యాలు లేకపోయినా, మీకు మొటిమలు వచ్చేందుకు మరో కారణం బ్యూటీ పార్లర్ ద్వారా లేదా మొటిమలు ఉన్నవారి వస్తువులు.. వారు వాడిన ముఖ్యంగా టవళ్లు వంటివి వాడితే మీకు వస్తాయి.

మొటిమలు చెప్పే విషయాలేంటి?

మీ ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువైతే మొటిమలు వస్తాయి. మీరు శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తినకపోయినా, మలబద్ధకం ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, పీరియడ్స్‌కు ముందు, సరిగ్గా నిద్ర లేకపోయినా మొటిమల బారిన పడతారు. వీటికి విరుగుడు ఆయా కారణాలపై దృష్టి పెట్టడమే. మరీ అతిగా మొటిమలు వచ్చేస్తుంటే మాత్రం డెర్మటాలజిస్టును సంప్రదించాల్సిందే. నీరు ఎక్కువగా తాగుతూ, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలి. నూనె, బేకరీ, స్వీట్లు వంటి పదార్థాలను మితంగా తినాలి.

మీ గడ్డంపై మొటిమలు వస్తే అది హార్మోన్ల మార్పులకు గుర్తన్నమాట. ముఖ్యంగా పీరియడ్స్‌కు ముందు ఇలా వస్తాయి కాబట్టి మంచి పోషకాహారాన్ని తీసుకుని, ప్రశాంతంగా ఉండటం మంచిది. దీనికోసం యోగా, ధ్యానం చేయాలి. సాధారణంగా ఎవరికైనా బుగ్గలపై యాక్నే ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు కాలుష్యానికి బాగా ఎక్స్ పోజ్ అవుతున్నారని అర్థం. వాయు కాలుష్యం నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే సరి. మీ బుగ్గలపై కొత్త యాక్నే రాదు. శుభ్రమైన మంచి మాస్కు, స్కార్ఫులను ధరిస్తే చాలు. నుదిటిపై మొటిమలు వచ్చాయంటే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారని అర్థం. లివర్ సమస్యలు, నిద్రలేమి, తీవ్ర మానసిక ఒత్తిడి కూడా నుదుటిపై యాక్నేకు కారణం అవుతుంది. చుండ్రు ఉన్నా ఇలా మొటిమలు రావచ్చు. ముక్కు వద్ద పింపుల్ వస్తే మీరు హైజీనిక్‌‌గా లేరని, బీపీ ఎక్కువ ఉందని హెచ్చరించినట్టే.

రక్తంలో టాక్సిన్లు ఎక్కువగా ఉన్నా కూడా పింపుల్స్ వస్తాయి. మొటిమలను బాగా అధ్యయనం చేయండి మీ శరీర తత్వం మీకు బాగా అర్థమవుతుంది. విపరీతమైన బ్లడ్ ప్రెజర్ తో కూడా యాక్నే వస్తుంది. డీహైడ్రేషన్, గుండె జబ్బులు ఉన్నా, శ్వాసకోస సమస్యలున్నా, మానసిక ప్రశాంతత లోపించినా చర్మం నుంచి పొడుచుకుని వచ్చే పింపుల్స్ పై ఫోకస్ పెట్టండి, ఆరోగ్యకరమైన జీవితానికి స్వాగతం పలకండి. రోజుకు ఒకే ఒక్కసారి ముఖం కడుక్కునేవారు చల్లని నీటితో కనీసం 4-5 సార్లు ముఖం కడిగి, చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి.
Published by:Shiva Kumar Addula
First published: