• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH HEALTH TIPS IN TELUGU SUMMER IMMUNITY BOOSTING DRINKS DETAILS HERE SU GH

Immunity Boosting Drinks: ఈ వేసవి డ్రింక్స్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయట.. మీరూ ట్రై చేయండి.

Immunity Boosting Drinks: ఈ వేసవి డ్రింక్స్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయట.. మీరూ ట్రై చేయండి.

ప్రతీకాత్మక చిత్రం

ఎండాకాలం బయట ఎండలు మండిపోతుంటే చల్లచల్లగా డ్రింక్స్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు.

  • Last Updated:
  • Share this:
ఎండాకాలం బయట ఎండలు మండిపోతుంటే చల్లచల్లగా డ్రింక్స్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. అందుకే ఈ కాలంలో చాలామంది నిమ్మరసం, ఫ్రూట్ జ్యూసుల వంటివి ఎక్కువగా తాగుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో చల్లదనంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే డ్రింకులపై ఆసక్తి చూపించాల్సి ఉంటుంది. ఐస్ కోల్డ్ డ్రింక్స్ తాగడం సరైనదే కానీ వాటి నుంచి మన శరీరానికి ఎంతో కొంత పోషకాలు కూడా వచ్చేలా చూసుకోవాలి. రోజూ పోషకాలు నిండిన ఆహారం తినడంతో పాటు ఇలాంటి డ్రింక్స్ లో కూడా ఇమ్యునిటీ పెరిగేవి ఉండేలా చూసుకోవాలి.


1. మింట్ లస్సీ
పేరులో ఉన్నట్లుగానే అద్భుతంగా ఈ డ్రింక్ పుదీనాతో తయారుచేసేదన్నమాట. దీనికోసం ఒక చిన్న కంటెయినర్ లో పెరుగు వేసి చక్కెర, పుదీనా ముద్ద లేదా ఎండబెట్టిన పుదీనా పొడి వేసి బాగా షేక్ చేసుకోవాలి. కావాలంటే కొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవచ్చు. పుదీనాలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఎ, సి, ఇ విటమిన్లు కూడా ఉంటాయి కాబట్టి ఇది మంచి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది.

2. కోకమ్ షర్బత్
ఇందుకోసం కోకమ్ పండ్లు, ఫిగ్స్, జీలకర్ర పొడి తీసుకోవాలి. అందులో కాస్త నల్ల ఉప్పు కూడా వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. చల్లని నీటిలో దీన్ని కలిపి సర్వ్ చేసుకోవచ్చు. పుల్లపుల్లగా తియ్యతియ్యగా అద్భుతంగా ఉంటుంది. కోకమ్ లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

3. బొప్పాయి జ్యూస్
చాలామంది వేసవిలో బొప్పాయి తింటే వేడి అనుకుంటారు. కానీ ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల మీ జీర్ణ క్రియ సక్రమంగా సాగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ డ్రింక్ తయారు చేయడానికి ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇందుకోసం బొప్పాయి పండును తొక్క తీసి మిక్సీ పట్టుకోవాలి. అందులో హలీమ్ గింజలు వేసి ఫ్రెష్ గా సర్వ్ చేసుకోవాలి.

4. ఆమ్ పన్నా
ఎండాకాలంలో వచ్చే పుల్లపుల్లని మామిడి కాయలతో చేసే ఈ డ్రింక్ అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇమ్యునిటీని పెంచేందుకు ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. ఇందులో పచ్చి మామిడి ముక్కల రసంతో పాటు జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, బెల్లం కలిపి తయారుచేసుకోవాలి. ఇందులో చల్లని నీళ్లు కూడా పోసి సర్వ్ చేసుకోవచ్చు.

5. శాండల్ వుడ్ ఐస్డ్ టీ
చందనం శరీరానికి చాలా చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఎండాకాలంలో వేడిని తగ్గించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దీని ఫ్లేవర్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కావాలంటే దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.

6. బెలా పనా
బేల్ లేదా వెలగ పండుతో చేసే జ్యూస్ దేశమంతటా ఫేమస్. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జీర్ణ శక్తికి కూడా తోడ్పడుతుంది. బెలా పనా చక్కటి వేసవి డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఇది మీ కడుపుని కూల్ గా ఉంచుతూ ఎండ వేడి నుంచి రక్షిస్తుంది.

7. సుగంధి పాల
సర్సపరిల్లా అనేది ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే మొక్క. దీన్ని తెలుగులో సుగంధి పాల అని పిలుస్తారు. దీనితో చేసే సిరప్ లో నిమ్మరసం ఐస్ వేసి ఈ డ్రింక్ తయారుచేసుకోవచ్చు.

Published by:Sumanth Kanukula
First published: