హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Home Made Drinks: ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఇంట్లోనే తయారు చేసుకోగల ఈ డ్రింక్స్​ ట్రై చేయండి

Home Made Drinks: ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఇంట్లోనే తయారు చేసుకోగల ఈ డ్రింక్స్​ ట్రై చేయండి

పసుపు టీ(Image: Shutterstock)

పసుపు టీ(Image: Shutterstock)

శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే కరోనా వంటి అంటువ్యాధులను సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వాలు లాక్​డౌన్​, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నాయి. ఈ విపత్కర సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే కరోనా వంటి అంటువ్యాధులను సులభంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. అయితే, మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎక్కడో బయటికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల కొన్ని పానీయాలతో దీన్ని పెంచుకోవచ్చు. ఈ పానీయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ ఇమ్యూనిటీని మరింత బలోపేతం చేస్తాయి. మీ వంటగదిలో తరుచూ ఉపయోగించే పదార్థాలతోనే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వాటిపై ఓలుక్కేద్దాం.

పసుపు టీ

పేరులో ఉన్నట్లు దీన్ని పసుపు, తేనె, నిమ్మకాయలతో తయారు చేస్తారు. పసుపులో కర్కుమిన్ అనే ప్రోటీన్​ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని బలమైన వ్యాధి నిరోధక లక్షణాలు మంట, నొప్పి తట్టుకునేలా మీ శరీరాన్ని తయారు చేస్తాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా పసుపు నీటిలో కలిపి 15- నుండి 20 నిమిషాల పాటు వేడిచేయాలి. రుచి కోసం దానిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి.

మసాలా టీ

రోగనిరోధక శక్తిని పెంచే మసాలా టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన అన్ని పదార్థాలు మీ వంటగదిలోనే లభిస్తాయి. టీ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లను నివారించే శక్తి ఉంటుంది. దీనిలో తేనె కలపడం వల్ల రుచితో పాటు మరింత శక్తి వస్తుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మసాలా టీ కోసం ముందుగా తురిమిన అల్లం, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, ఏలకులు, తులసి ఆకులను అర కప్పు నీటిలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టండి. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసి తీసుకోండి.

గ్రీన్ స్మూతీ

ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం వేసవిలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి మీ కడుపులో మంటను నివారిస్తాయి. అంతేకాక, శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తినిస్తాయి. దీని తయారీ కూడా చాలా సులభం. ముందుగా కొంచెం బచ్చలికూర, మామిడి లేదా పైనాపిల్, నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం, బాదం పాలు లేదా పెరుగు తీసుకొని మిక్సర్‌లో కలపండి. ఆ మిశ్రమాన్ని తాగండి.

తేనె నిమ్మరసం

గొంతు నొప్పి, దగ్గుకు చెక్​ పెట్టేందుకు తేనె నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇది అనేక వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండా, శ్వాసకోశాన్ని హైడ్రేట్​గా ఉంచుతుంది. దీని తయారీ కూడా చాలా సులభం. ముందుగా, ఒక లోతైన గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకొని, దానిలో తురిమిన అల్లం, ఒక అంగుళం దాల్చిన చెక్క, తరిగిన మూడు వెల్లుల్లి లవంగాలు, ఒక టీస్పూన్ పుదీనా రసం, నిమ్మరసాన్ని కలపండి. కొన్ని నిమిషాల వేచి చూసి అది చల్లబడిన తర్వాత.. దానిలో తేనె వేసి తాగండి.

కధాస్​ పానీయం

సాధారణ వంటగదిలో ఉపయోగించే పదార్ధాలతో సులభంగా తయారు చేసుకోగలిగే కధాస్ పానీయం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గుతో పోరాడటంలో బాగా పనిచేస్తుంది. అంతేకాక, శ్వాసకోశ వ్యాధులకు కూడా చికిత్స చేస్తుంది. వంట గదిలో లభించే తులసి, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, క్యారమ్ విత్తనాలు, పసుపు, నల్ల మిరియాలను ఒక గిన్నెలో వేసి వేడి చేయండి. మంచి రుచి కోసం ఆ మిశ్రమంలో తేనె లేదా బెల్లం కలిపి తీసుకోండి.

First published:

Tags: Health Tips, Life Style

ఉత్తమ కథలు