• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH HEALTH TIPS FEELING LONELY TALK TO YOU DEAR AND NEAR ON PHONE LINE FOR 10 MINUTES SK GH

Loneliness: ఒంటరిగా ఫీలవుతున్నారా? ఒక్క10 నిమిషాలు ఇలా చేస్తే ఫుల్ హ్యాపీ

Loneliness: ఒంటరిగా ఫీలవుతున్నారా? ఒక్క10 నిమిషాలు ఇలా చేస్తే ఫుల్ హ్యాపీ

ప్రతీకాత్మక చిత్రం

Loneliness: లోన్లీనెస్​ స్కేల్‌లో ఫోన్ కాల్ పాల్గొనేవారు పారంభంలో 6.5 ఒంతరితనం ఫీలవ్వగా, చివర్లో 5.2 ఒంతరితనం ఫీలయ్యారు. దీన్ని బట్టి వారు ఫోన్​ కాల్​ మాట్లాడటం ద్వారా ఒంటరితనం తగ్గిందని చెప్పవచ్చు.

  • Share this:
ఈ రోజుల్లో ఫోన్​ లేని వారు ఎవరూ ఉండటం లేదు. చిన్న, పెద్ద, పేద, ధనిక ఇలా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సెల్​ ఫోన్​ ముఖ్య భాగమైపోయింది. తిండి, నిద్ర లేకుండా ఉండగలరేమో కాని ఫోన్​ లేకుండా సరిగ్గా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఎదురైంది. అయితే, ఇలా నిత్యం ఫోన్​లో గడపడం అనేక అనర్థాలకు దారితీస్తుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. కానీ, తాజా అధ్యయనం దీనికి భిన్నమైన విషయాలను వెల్లడించింది. సెల్​ఫోన్​ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో.. అన్ని లాభాలు కూడా ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. రోజులో ఒక్క 1‌‌0 నిమిషాల పాటు ఫోన్​లో మాట్లాడితే చాలు మీ ఒంటరితనం దూరమవుతుందని అధ్యయనం చెబుతోంది.

మొత్తం 240 మందిపై నెల రోజుల పాటు జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మంది ఫోన్ కాల్స్ స్వీకరించడానికి ఎంపిక చేయబడ్డారు. వారిలో సగటున 20% తక్కువ ఒంటరితాన్ని అనుభవించారని తేలింది. అధ్యయనంలో భాగంగా పార్టిసిపెంట్స్​ చురుకుగా వినడం, మాట్లాడటం, ప్రశ్నలు అడగడం వంటి వాటిని వాలంటీర్లు పరిశీలించారని అధ్యయన ప్రధాన రచయిత, టెక్సాస్ విశ్వవిద్యాలయం హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీందర్ మినీ కహ్లోన్ అన్నారు. అధ్యయనంలో భాగంగా మొదటి వారం, ఐదు రోజుల పాటు వాలంటీర్స్ పార్టిసిపెంట్స్​తో ఫోన్​ కాల్స్​ మాట్లాడేవారు. తరువాతి వారాల్లో రెండు నుండి ఐదు కాల్స్ మాట్లాడేవారు.

అయితే, మొదటి వారంలో 10 నిమిషాలకు పైగా మాట్లాడగా, మిగిలిన నెల రోజుల పాటు 10 నిమిషాల పాటు మాట్లాడేవారని ఆమె అన్నారు. పార్టిసిపెంట్స్ వారి రోజువారీ జీవితంలో పలు విషయాలతో పాటు వాలంటీర్ల జీవితాల గురించి అడిగేవారని ఆమె పేర్కొన్నారు. కాగా, 1‌0 నిమిషాల పాటు ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడిన పార్టిసిపెంట్స్​లోని ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటిని కొలిచారు. ఆసక్తికరంగా వారిలో ఒంటరితనం, ఆందోళన, నిరాశ వంటివి కంట్రోల్ అయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఫోన్​ కాల్స్ మాట్లాడటం వల్ల కూడా ఈ రుగ్మతలు తగ్గుతాయని తమ అధ్యయనంలో తేలిందని కహ్లాన్ చెప్పారు. కాగా ఈ అధ్యయన ఫలితాలు JAMA సైకియాట్రీ జర్నల్​లో ప్రచురించబడ్డాయి.

మీ ప్రియమైన వారితో ఫోన్​లో మాట్లాడండి..
UCLA లోన్లీనెస్​ స్కేల్‌లో ఫోన్ కాల్ పాల్గొనేవారు పారంభంలో 6.5 ఒంతరితనం ఫీలవ్వగా, చివర్లో 5.2 ఒంతరితనం ఫీలయ్యారు. దీన్ని బట్టి వారు ఫోన్​ కాల్​ మాట్లాడటం ద్వారా ఒంటరితనం తగ్గిందని చెప్పవచ్చు. అధ్యయన ఫలితాలపై కహ్లాన్​ మాట్లాడుతూ..“ఫోన్​ కాల్​ మాట్లాడటం ద్వారా ఆందోళన, నిరాశలో ఎక్కువ తగ్గుదల కనిపించింది. GAD-7 స్కేల్‌పై వారి ఆందోళన 30% పైగా తగ్గినట్లు నమోదైంది. PHQ-8 స్కేల్‌పై 24% తగ్గుదల కనిపించింది. ఈ ఫలితాలను విశ్లేషించగా ఒంటరితనంపై మా అధ్యయనం అద్భుతమైన ఫలితాలనిచ్చినట్లు చెప్పవచ్చు. మేము ఈ స్థాయి ఫలితాలను ఊహించలేదు" అని కహ్లాన్ చెప్పారు.


కాగా, ఈ అధ్యయనం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని బ్రిఘం యంగ్ విశ్వవిద్యాలయం సైకాలజీ, న్యూరోసైన్స్ ప్రొఫెసర్ జూలియాన్ హోల్ట్-లున్స్టాడ్ అన్నారు. అయితే, ఫోన్ కాల్​లో సంభాషణ కారణంగా పార్టిసిపెంట్స్‌తో పాటు వాలంటీర్లలో ఆందోళన స్థాయిలు ఏ మేరకు తగ్గాయనే విషయం కూడా కొలవాలని ఆమె కోరారు. మీరు కూడా ఒంటరిగా ఉన్నట్లయితే, మీ కుటుంబం, స్నేహితులతో, ప్రియమైన వారితో వీలైనప్పుడల్లా ఫోన్ లో మాట్లాడాలని కహ్లాన్ సిఫార్సు చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు