హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Buransh Flower: హిమాలయాల్లో దొరికే బురాన్ష్ పూల గురించి తెలుసా? దీని రసం నిజంగా అమృతం

Buransh Flower: హిమాలయాల్లో దొరికే బురాన్ష్ పూల గురించి తెలుసా? దీని రసం నిజంగా అమృతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Buransh Flowers: బురాన్ష్‌లో ఔషధ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బురాన్ష్ పువ్వుల నుంచి రసం తీసి తాగుతారు. ఈ పువ్వుల రేకుల్లో క్వినిక్ యాసిడ్ ఉంటుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హిమాలయ పర్వతాలను (Himalayas) మూలికల నిధిగా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఉంటాయి. వాటి గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ హిమాలయ పర్వతాల్లో ఉండే ఎన్నో మూలికలను ఆయుర్వేదంలో విస్తృతంగా వినియోగిస్తారు. వాటితో తయారు చేసిన మందులను అనేక వ్యాధులతో పోరాడుతాయి. అందులో బురాన్ష్ మొక్క కూడా ఒకటి. బురాన్ష్ పువ్వులు (Buransh Flowers) చాలా అందంగా ఉంటాయి. లేత గులాబీ రంగులో ఆకర్షణియంగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కొండ ప్రాంతాలలో కనిపిస్తుంది. బురాన్ష్‌లో ఔషధ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బురాన్ష్ పువ్వుల నుంచి రసం తీసి తాగుతారు. ఈ పువ్వుల రేకుల్లో క్వినిక్ యాసిడ్  (Quinic acid) ఉంటుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బురాన్ష్ పూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.


  Best Weight loss tips: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..


  బురాన్ష్ పూలతో ప్రయోజనాలు:


  సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత కనిపిస్తుంది. దీని వల్ల రక్తహీనత వంటి వ్యాధులు మొదలవుతాయి. అయితే, బురాన్ష్ తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త కొరతను తీర్చవచ్చు. బురాన్ష్ పువ్వులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు దూరమవుతాయి.


  వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడి కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, బురాన్ష్ చాలా సహాయకారిగా ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను దూరం చేయడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుతుంది.


  చాలా సార్లు ఏదైనా తప్పుగా తినడం వల్ల, డైట్ అసమతుల్యత కారణంగా.... చర్మం, గొంతు, పొట్టపై మంటగా ఉంటుంది. అలాంటప్పడు బురాన్ష్ పువ్వుల జూస్‌ని తాగితే ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.


  Kitchen tips: ఇంట్లో చీమల బెడద పోవాలంటే ఈ 7 చాలు.. మీరు చేయాల్సిందల్లా...


  బురాన్ష్ యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంతా పనిచేస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు బురాన్ష్ పువ్వుల రసాన్ని తాగమని నిపుణులు సలహా ఇస్తారు.  బురాన్ష్‌ను ఆయుర్వేదంలో పోషకాల నిధిగా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, జింక్, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. బురాన్ష్ పువ్వుల జూస్‌ని క్రమం తప్పకుండా తాగితే శరీరంలోని పోషకాహార లోపం తొలగిపోతుంది. శరీరాన్ని బలంగా మార్చడంలో సహాయపడుతుంది.


  బురాన్ష్ పుష్పాలు ఎక్కువగా హిమాలయాల్లోనే ఉండడం వల్ల మనకు దొరకకపోవచ్చు. కానీ బురాన్షన్ పువ్వులతో చేసిన జ్యూస్‌లో సూపర్ మార్కెట్లలో లభ్యమవుతాయి. ఈకామర్స్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.


  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health benefits, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు