Breast milk: తల్లి పాలలో ఉండే ఈ బ్యాక్టీరియా గురించి తెలుసా? బిడ్డకు అదే సంజీవని

ప్రతీకాత్మక చిత్రం

Breast Milk: తల్లిపాలల్లో తాము గమనించిన బ్యాక్టీరియా జాతులు తెలియని పరాన్న జీవులను నాశనం చేస్తాయని, అంతే కాకుండా ట్యాక్సిన్స్, కాలుష్య కారకాల నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని మెక్ గిల్ బయో ఇన్ఫార్మెటిక్ వర్సిటీ ఆచార్యులు ఇమ్మాన్యూయెల్ గొంజాలెజ్ తెలిపారు. శిశువుల రోగనిరోధక శక్తికి పెంచడానికి తల్లులకు ఏ విధంగా సహాయపడాలనే విషయానికి ఈ ఆవిష్కరణ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది.

  • Share this:
శిశువులకు తల్లి పాలకు మించిన పోషకాహారం లేదనేది జగమెరిగిన సత్యం. రోగ నిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా వీటి ద్వారా శిశువులు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే తల్లిపాలల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంతేకాకుండా ఇది రోజురోజుకు గణనీయంగా మారుతూ శిశువుకు మేలు చేకూరుస్తుంది. నూతన పరిశోధన ప్రకారం తల్లి పాలలోని మంచి బ్యాక్టీరియా శిశువుల్లో రోగనిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా ఓ వ్యాక్సీన్ లా పనిచేస్తుందని, జీవక్రియలో డైలీ బూస్టర్ షాట్ గా పనిచేస్తుందని తేలింది. మాంట్రియల్, గ్వాటిమాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు.

ఈ అధ్యయనం ప్రకారం ఈ మంచి బ్యాక్టీరియా వల్ల శిశువులో పెరుగుదల, ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపింది. తల్లిపాలల్లో ఇంతకుముందెన్నడూ గుర్తించని సూక్ష్మజీవుల జాతులను పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటి వరకు తల్లిపాలల్లో మైక్రోబయామ్ బ్యాక్టీరియా పాత్ర గురించి చాలా తక్కువ తెలుసు. ఈ బ్యాక్టీరియా శిశు జీర్ణాశయం, పేగులను కాపాడుతుందని, అలెర్జీ నివారణ, దీర్ఘకాలిక ఆరోగ్యం లాంటి అంశాలను మెరుగుపరుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

తల్లిపాలల్లో తాము గమనించిన బ్యాక్టీరియా జాతులు తెలియని పరాన్న జీవులను నాశనం చేస్తాయని, అంతే కాకుండా ట్యాక్సిన్స్, కాలుష్య కారకాల నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని మెక్ గిల్ బయో ఇన్ఫార్మెటిక్ వర్సిటీ ఆచార్యులు ఇమ్మాన్యూయెల్ గొంజాలెజ్ తెలిపారు. శిశువుల రోగనిరోధక శక్తికి పెంచడానికి తల్లులకు ఏ విధంగా సహాయపడాలనే విషయానికి ఈ ఆవిష్కరణ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇందుకోసం పరిశోధకులు హై రిజల్యూషన్ ఇమేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తల్లి పాల నమునాలను విశ్లేషించారు. గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బ్యాక్టీరియాను గుర్తించడానికి మెక్ గిల్, మాంట్రియల్ వర్సిటీలు ముందుకొచ్చాయి.

గ్వాటెమాల పశ్చిమ హైలాండ్స్ లో ఎనిమిది మారుమూల గ్రామీణ వర్గాల్లో నివసిస్తున్న మామ్ మయాన్ తల్లుల పాలను వారు విశ్లేషించారు. ఇది కాలం గడుస్తున్న కొద్దీ ఈ సూక్ష్మ జీవుల్లో వచ్చే మార్పులను గమనించడానికి వారికి ఓ ప్రత్యేకమైన మార్గాన్ని సుగమం చేసింది. ఇందులో భాగంగా ప్రారంభ(6-46 రోజులు), చివర(109-184 రోజులు) రోజుల చనుబాలను పరిశీలించారు. ఉత్తర అమెరికాలోని చాలా మంది తల్లుల మాదిరిగా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిన ఆరు నెలల కాలం పాటు దాదాపు అన్ని మామ్-మాయన్ తల్లులు పాలిచ్చారు.

శాస్త్రవేత్తలు ఉపయోగించిన జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మామ్-మాయన్ తల్లులు ఇచ్చిన పాలల్లోని బ్యాక్టీరియా జాతుల శ్రేణిని వెల్లడించింది. ఇది శిశువులకు వివిధ రకాలైన బ్యాక్టీరియాల ప్రయోజనాన్ని అందిస్తుంది. మానవుల్లో ఉన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి విభిన్న వర్గాల సూక్ష్మజీవులను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం అని మెక్ గిల్ స్కూల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ లో అసొసియేట్ ప్రొఫెసర్ సహరచయిత క్రిస్టిన్ కోస్కి చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published: