హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: నానబెట్టిన బాదం ఆరోగ్యనికి నిజంగానే మంచిదా? ఉదయాన్నే తింటే ఏమవుతుంది?

Health Tips: నానబెట్టిన బాదం ఆరోగ్యనికి నిజంగానే మంచిదా? ఉదయాన్నే తింటే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: చాలా మంది నానబెట్టిన బాదం తినేందుకు ఇష్టపడతారు. రాత్రంతా నానబెట్టి.. ఉదయం వాటిని తీసుకుంటారు. ఐతే ఉదయాన్నే ఖాళీ కడుపుతోనే నానబెట్టిన బాదం తింటే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  బాదం పప్పు ఆరోగ్యానికి  (Almond Health Benefits) ఎంతో మంచిది. బాదం పప్పు తింటే మనసు చురుగ్గా తయారవుతుందని మన పెద్ద వారు చెబుతారు. మంచి బలవర్దక ఆహారమని.. తింటే శరీరానికి బలం వస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది బాదంను ఇష్టంగా తింటారు. కాస్త రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ మొత్తంలోనైనా వంటకాల్లో చేర్చుకుంటారు. కూరల్లో వేయడంతో పాటు స్వీట్లు చేసుకుంటారు. కొందరైతే నేరుగా తింటారు. బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఐతే చాలా మంది నానబెట్టిన బాదం తినేందుకు ఇష్టపడతారు. రాత్రంతా నానబెట్టి.. ఉదయం వాటిని తీసుకుంటారు. ఐతే ఉదయాన్నే ఖాళీ కడుపుతోనే నానబెట్టిన బాదం తింటే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.  బాదం పప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు:


  బాదంపప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి.ఇది పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది. అనేక చర్మ సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల మీ ముఖంలో మెరుపు పెరుగుతుంది. అందంగా తయారవుతారు.


  జీర్ణవ్యవస్థను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఖాళీ కడుపుతో బాదంపప్పును తినవచ్చు. బాదంపప్పును తీసుకోవడం ద్వారా ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా కదలిక మెరుగుపడుతుంది.


  బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.బాదంపప్పును శక్తి వనరుగా కూడా పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాలు నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి.


  ఇంట్లో చీమల బెడద పోవాలంటే ఈ 7 చాలు.. మీరు చేయాల్సిందల్లా


  శరీరంలో శక్తి కోసం క్రమం తప్పకుండా నానబెట్టిన నాలుగైదు బాదంపప్పులను ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. బాదంపప్పును నానబెట్టకుండా కూడా తినవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.


  ఖాళీ కడుపుతో బాదంపప్పు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:


  బాదం పప్పును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. అదే విధంగా కూడా కొన్ని నష్టాలు ఉంటాయి.  ఖాళీ కడుపుతో బాదంపప్పును తీసుకోవడం వల్ల ఫుడ్ అలర్జీ వస్తుంది. ఇది ఎవరికీ అర్థం కాదు. దాని వల్లే ఇలా జరుగుతుందా? అని కన్‌ప్యూజ్ అవుతారు. కానీ నానబెట్టిన బాదం తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుందట. దీని వల్ల వికారం వంటి సమస్య రావచ్చు.


  గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో బాదంపప్పు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.


  బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బాదంలో ఉండే పీచు కారణంగా శరీరంలో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.


  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Almonds, Health, Health Tips, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు