Home /News /life-style /

HEALTH HEALTH NEWS BENEFITS OF MANGO FLOWER MAMIDI PUVVU LABHALU IN TELUGU YOU CAN GET RID OFF SO MANY HEALTH ISSUES SK

Health Tips: మామిడి పూత తింటే మందులే అవసరం లేదు.. షుగర్ సహా ఈ అనారోగ్య సమస్యలన్నీ ఫసక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mango Flowers Benefits: మామిడి పూతతో షుగర్ సహా అనే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మరి మామిడిపూతను ఎలా వాడాలి? దాని వల్ల ఎలాంటి అరోగ్య ప్రయోజనలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  ఇది మామిడి పండ్లు (Mango Fruits) తినే కాలం. వేసవిలో మామిడి కాయలు, పండ్లు విరివిగా లభిస్తాయి. ఫలాల రాజుగా పేరున్న మామడి పండును అందరూ ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు..దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మామిడితో పాటు దాని టెంక, మామిడి ఆకులు, బెరడు, పువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఇవాళ మామిడి పూత గురించి తెలుసుకుందాం. మామిడి కాత దశకు వచ్చే ముందు పెద్ద మొత్తంలో పువ్వులు కనిపిస్తాయి. ఇందులో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. అందువల్ల మామిడి పువ్వులకు అనేక వ్యాధులను దూరం చేసే సామర్థ్యముంది. మరి మామిడి పూత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Mango Flowers Health benefits) గురించి ఇక్కడ తెలుసుకుందాం.

  మామిడి పూత ప్రయోజనాలు:
  Afrolet.com ప్రచురించిన కథనం ప్రకారం.. దీర్ఘకాలిక విరేచనాల సమస్యను వెంటనే నయం చేసే శక్తి మామిడికి ఉంది. మామిడి పువ్వుల నుంచి తయారుచేసిన సూప్ లేదా డికాషన్ తాగడం వల్ల విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పువ్వులను ఎండబెట్టి పొడిని తయారు చేసి నీటితో పాటు తీసుకోవాలి.

  వేసవిలో చాలా మందికి ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు మసాలా ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా వేసవిలో ముక్కు నుంచి రక్తం కారుతుంది. ముక్కు నుంచి రక్తస్రావం సమస్యను తొలగించేందుకు మామిడి పువ్వులు సాయం చేస్తాయి. మీరు మామిడి పువ్వుల వాసన చూస్తే కూడా ముక్కు నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. ఐతే మరీ ఎక్కువ రక్తస్రావం ఉంటే మాత్రం డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది.

  సీజన్​ మార్పు చర్మంపై ప్రభావం చూపిస్తోందా? అయితే ఈ టిప్స్​తో అందాన్ని కాపాడుకోండి

  కొందరికి మూత్రంలో మంటగా అనిపిస్తుంది. మరికొందరికి అతిగా మూత్రం వస్తుంది. మరికొందరికి తక్కువగా ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో పడే వారు కూడా చాలా మందే ఉంటారు. ఈ అన్ని సమస్యలకు మామిడి పువ్వు పరిష్కారం చూపుతుంది. మామిడి పూత కషాయాన్ని తయారు చేసి.. క్రమం తప్పకుండా తాగితే.. మూత్ర సమస్యలు నివారించవచ్చు.

  మహిళలు తరచుగా వైట్ డిశ్చార్జ్ సమస్యను ఎదుర్కొంటారు. కొంతమంది మహిళల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు అనేక కారణాలున్నాయి. అపరిశుభ్రత, ప్రధాన అవయవాల్లో బాక్టీరియా ఉండడం వల్ల వైట్ డిశ్చార్జ్ వస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు మామిడి పువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

  విరేచనాలు, తామర, చర్మ రోగాలు, రక్త సంబంధిత వ్యాధులు మొదలైన అనేక రకాల శారీరక సమస్యలను నయం చేయడానికి మామిడి పూతకు ఉపయోగించవచ్చు. మామిడి పువ్వులను కషాయం, టీ లేదా ఏదైనా పానీయం రూపంలో కూడా స్వీకరించవచ్చు.

  మీరు డయాబెటిస్ (Diabetes) సమస్యతో బాధపడుతున్నట్లయితే.. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మామిడి పువ్వులను తినవచ్చు. పరిశోధనల ప్రకారం.. మామిడి పువ్వులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని నీటిలో ఉడకబెట్టి దానిని తాగితే.. డయాబెటిస్ ముప్పు నుంచి బయటపడవచ్చు.

  కొలెస్ట్రాల్ స్థాయి (Cholesterol levels)ఎక్కువగా ఉన్న వారు మామిడి పువ్వులను తింటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే అలాంటి వారు మామిడి పూత నుంచి చేసిన కషాయాన్ని తాగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ బాడీలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

  Nail biting: మీ పిల్లలు అదే పనిగా గోర్లు కొరుతున్నారా? ఇలా చేస్తే..మళ్లీ వాటి జోలికి వెళ్ల

  వేసవిలో అతిసారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు అలసట, వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయి. అలాంటి సమయంలో మామిడి పువ్వుల నుంచి తయారుచేసిన రసాన్ని తీసుకోవాలి, తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  మామిడి పూత ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ ఒకసారి మీ డాక్టర్‌ని సంప్రదించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health benefits, Life Style, Lifestyle, Mango

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు