• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH HEALTH IMMUNITY DIET 5 WINTER RECIPES FOR IMMUNITY NS GH

Immunity Diet: ఈ శీతాకాలంలో కరోనా విజృంభించే ప్రమాదం.. రోగ నిరోధక శక్తి కోసం ఈ ఐదు ఆహారాలు తీసుకోండి..

Immunity Diet: ఈ శీతాకాలంలో కరోనా విజృంభించే ప్రమాదం.. రోగ నిరోధక శక్తి కోసం ఈ ఐదు ఆహారాలు తీసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వేడిగా, సౌకర్యవంతంగా ఉండే ఆహారాన్ని భుజించాలి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు, వాటి తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
ఈ ఏడాది శీతాకాలం ఊహించిన దాని కంటే ముందుగానే వచ్చింది. కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అసలే గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రభావంతో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు ప్రజలు. వాతావరణం మారినప్పుడుల్లా తీవ్రంగా విజృంభిస్తూ జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి రోగాలతో ప్రజలను మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వేడిగా, సౌకర్యవంతంగా ఉండే ఆహారాన్ని భుజించాలి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు, వాటి తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా టీ..
యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు లాంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో ఈ ప్రసిద్ధ టీని రుచిగా తయారు చేస్తారు. యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధులను అరికట్టవచ్చు. దీన్ని తయారు చేసుకునేందుకు యాలకులు, దాల్చిన చెక్క, సోంపును సమాన పరిమాణంలో పెనంలో వేసి వేయించాలి. అనంతరం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోని పౌడర్ మాదిరి తయారు చేసుకోవాలి. తర్వాత ఓ పాత్రలో నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. ఈ వేడి నీటిలో పొడి చేసుకున్న మిశ్రమాన్ని కలిపి సన్నని మంటపై మరి కాసేపు వేడి చేస్తే రుచికరమైన మసాలా టీ సిద్ధమవుతుంది.

క్యారెట్-అల్లం సూప్..
ఈ తేలిక పాటి రుచికరమైన సూప్ ను సుగంధ ద్రవ్యాలు, మూలికలతో తయారు చేస్తారు. భోజనానికి ముందు ఈ వెచ్చని సూప్ తీసుకుంటే గొంతు మంటకు ఉపశమనం కలుగుతుంది. దీని తయారీ కోసం క్యారెట్లు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, అల్లం, వెజిటెబుల్ స్టాక్, వామ్, వెల్లుల్లి, నల్ల మిరియాలు లవంగాలు కావాలి.
ముందుగా క్యారెట్లను అర అంగుళం పరిమాణంలో రౌండుగా కట్ చేసుకోవాలి. అనంతరం రెండు స్పూన్ల ఆలివ్ నూనేను వేసి ఉప్పు వేసుకోవాలి. మంటకు ఆరు నుంచి 8 అంగుళాలపైకి ఉంచి క్యారెట్లు గోధుమ రంగుకు వచ్చే వరకు వేడిచేయాలి. అనంతరం ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి తిప్పాలి. ఇందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది.

అనంతరం వెజిటేబుల్ స్టాక్ ను పాత్రలో వేసి అల్లం కలపాలి. 15 నిమిషాల పాటు ఉడికించాలి. మిగిలిన ఆలివ్ నూనేతో స్టాక్ పాట్ లో ఉంచండి. మీడియం మంటపై ఉల్లిపాయను వేయించాలి. అనంతరం వెల్లుల్లి, క్యారెట్లు మిశ్రమాన్ని జోడించాలి. స్టాక్ నుంచి అల్లం, థైమ్ ను తొలగించి క్యారెట్లతో కుండలో ఉన్న స్టాక్ జోడించండి. అనంతరం 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ మిశ్రమం మృదువుగా అయ్యేందుకు ఇమ్మర్షన్ బ్లెండర్ వాడండి. సూప్ చాలా మందంగా అనిపిస్తే కొంచెం నీరు పోసుకోండి. అనంతరం రుచికి తగినంత ఉప్పు, మిరియాలు జోడించండి. అనంతరం సర్వ్ చేయండి.

మసలా గర్..
మసాలా గర్ లేదా బెల్లం అనేది శీతాకాలంలో మాత్రమే దొరికే ప్రధాన వంటకం. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జింక్, సెలినియం లాంటి ఖనిజాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయి. మసాలా గర్ అనేది ఓ ఆసక్తికరమైన వంటకం. ఇది బెల్లం, నెయ్యి, అల్లం మొదలైన సూపర్ ఫుడ్స్ వల్లే పనిచేస్తుంది.

పంజిరి..
భారతీయ స్వీట్లలో గుర్తింపు ఉన్న మిఠాయి ఈ పంజిరి. ముఖ్యంగా పండగ సీజన్లలో దీన్ని విరివిగా తయారు చేస్తారు. దీని తయారీ కోసం వేయించిన బాదం, తామర గింజలు, గోండ్, కొబ్బరి, పొడి చక్కెర, నెయ్యితో తయారు చేస్తారు. రుచికరమైన ఈ వంటకాన్ని కృష్ణ జన్మాష్టమి, దసరా లాంటి పర్వదినాల సందర్భంగా తయారు చేస్తారు. పూజ చేసే సమయంలో నైవేద్యంగా ఈ వంటకాన్ని సమర్పిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తారు.

మేథీ తెప్లా..
మెంతు ఆకులు, అల్లం, మిరపకాయలు, మూలికలు తయారు చేసే ఈ వంటకం క్రిస్పీగా ఉండి రుచికంగా ఉంటుంది. వీటితో పాటు గొధుమ పిండి,నూనె, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర పొడి, చక్కెర, పెరుగు, నీరుతో ఈ మేథీ తెప్లాను తయారు చేస్తారు. ముందుగా అన్ని పదార్థాలకు ఓ పాత్రలో తీసుకోవాలి. అనంతరం వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి పెరుగు, నీటిని వేసి పిండిని బాగా పిసికి కలపాలి. వీటిని చపాతీల మాదిరి తయారు చేసుకోవాలి. పెనంపై ఆ చపాతీలను రెండు వైపులా కాలేలా వేయించుకోవాలి. దీంతో రుచికరమైన మేథీ తెప్లా సిద్ధమవుతుంది.
Published by:Nikhil Kumar S
First published: