హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Immunity Boosters: రోగనిరోధక శక్తిని పెంచే ఐదు హెల్తీ డ్రింక్స్.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Immunity Boosters: రోగనిరోధక శక్తిని పెంచే ఐదు హెల్తీ డ్రింక్స్.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాతావరణంలోని మార్పుల వల్ల సోకే ఇన్‌ఫెక్షన్స్‌ను ఎదుర్కొనే శక్తిని కొన్ని రకాల డ్రింక్స్ ద్వారా పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను వ్యాధుల సీజన్‌గా చెబుతుంటారు. ఈ సమయంలో వ్యాధి కారకాలు వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. దీంతో సులభంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే మన శరీరంపై దాడిచేసే బాక్టీరియా, వైరస్‌లను తట్టుకోవడానికి రోగనిరోధక శక్తి అత్యవసరం. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మంచి పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. వాతావరణంలోని మార్పుల వల్ల సోకే ఇన్‌ఫెక్షన్స్‌ను ఎదుర్కొనే శక్తిని కొన్ని రకాల డ్రింక్స్ ద్వారా పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

* యష్టిమధు టీ

పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో వాడే మూలిక అయిన ములేతి లేదా యష్టిమధుతో ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలున్నాయి. ఈ వేరుతో చేసిన టీ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ సమ్మేళనాలు సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ అయిన దగ్గు, జలుబు ఇతర వ్యాధులు రాకుండా కాపాడతాయి.

* నారింజ, అల్లం మిశ్రమం

సిట్రస్ ఫ్రూట్ అయిన నారింజ పండు(కమలాలు)లో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. నారింజ రసం, అల్లం మిశ్రమాన్ని పానీయంగా తీసుకుంటే శరీరానికి మంచిది. వీలైతే ఈ డ్రింక్‌లో పచ్చి పసుపు, నిమ్మరసం, క్యారెట్ జ్యూస్‌ కలిపి తీసుకోవచ్చు. అల్లం, పసుపు, నిమ్మరసంలోని సమ్మేళనాలు ఈ సీజన్‌లో వేధించే జలుబు, దగ్గు ఇతర వ్యాధులకు చెక్ పెడతాయి.

* నల్ల మిరియాలు, పసుపు డ్రింక్

నల్ల మిరియాలు మనిషి వ్యాధి నిరోధక శక్తిని పెంచే చక్కటి ఔషధం. దీనికి మేలిమి పసుపు కలిపి ప్రతి రోజు టీ‌ చేసుకొని తాగితే.. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇందులో తేనె కూడా కలుపుకుని తీసుకోవచ్చు. పసుపులోని కర్కుమిన్ యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్‌ను కలిగి ఉంటుంది. తేనెకు ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటుంది.

* సూప్స్

భారతీయులు ఆహార అలవాట్లలో భాగంగా వేడి సూప్స్ తీసుకోవడం మనం చూస్తుంటాం. అయితే అల్లం, పసుపు, నిమ్మరసం, మిరియాలతో చేసే హాట్ సూప్‌ను ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ సూప్ మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. వీలైతే కూరగాయాల సూప్ కూడా తీసుకోవాలి. వాటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్‌తో డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి.

మీ గుండె ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే..? మీకోసం డైట్ చిట్కాలు..!

Pillow benefits: కాళ్ల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఈ నొప్పి వెంటనే మాయమవుతుంది.. ఇతర ప్రయోజనాలు తెలుసుకోండి..

* బాదం కా కహ్వా

బాదంపప్పు, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కుంకుమ పువ్వు అన్నీ కలిపి చేసే బాదం కా కహ్వా డ్రింక్.. బెస్ట్ ఎనర్జీ బూస్టర్. బాదంలో ఉండే ఒమేగా-6 ప్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ వంటివి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శక్తిమంతమైన సుగంధ ద్రవ్యాలైన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ డ్రింక్‌లో గ్రీన్ టీ ఆకులు కూడా వేసుకోవచ్చు. అలాగే వెంట్రుకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

First published:

Tags: Immunity