ఫిట్‌గా ఉండడం ఇప్పటి యూత్ టాప్ ప్రయారిటీ. బాగా జిమ్ చేయాలన్నా, ఎక్సర్‌సైజులతో కండలు పెంచాలన్నా డైటీషియన్లు ప్రొటీన్ పౌడర్లను సజెస్ట్ చేస్తున్నారు. మరికొందరు స్టెరాయిడ్లనూ వాడేస్తున్నారు. గతవారం నటుడు సిద్దాంత్ సూర్యవంశీ జిమ్ చేశాక హార్ట్ ఎటాక్‌తో మృతి చెందడంతో ఫిట్నెస్ లవర్స్ ఆలోచనలో పడ్డారు. సూర్యవంశీ లాగానే స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ, టీవీ స్టార్ సిద్ధార్థ్ శుక్లా లాంటి కొంతమంది జిమ్ (Gym) చేసిన తర్వాత హార్ట్ ఎటాక్‌లతో మరణించారు. దీంతో జిమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరికీ అవగాహన తప్పనిసరని డాక్టర్లు చెబుతున్నారు.
అతి అనర్థం అన్నట్లు, ఎక్కువ సేపు వర్కవుట్లు చేస్తే మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఈ విషయంపై ఢిల్లోలోని పట్పర్గంజ్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ డైరెక్టర్, డాక్టర్ వైభవ్ మిశ్రా మాట్లాడారు. ఎక్కువ మంది ఇప్పడు కండలు పెంచడానికి జిమ్(Gym)లకు వెళ్లి, సప్లిమెంట్స్ తీసుకుంటున్నారని, అందుకే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిదని అయితే ఓవర్ ఎక్సర్సైజ్లు పనికిరావన్నారు.
* స్టెరాయిడ్స్ వద్దు
అనాబాలిక్ స్టెరాయిడ్స్(Anabolic steroids) మన బాడీ ఫ్యాట్ తగ్గించి మజిల్ మాస్‌ని పెంచుతాయి. వీటి వల్ల నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని ఉదయపూర్‌లోని పరాస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్, హెడ్, డాక్టర్ అమిత్ ఖండేల్వాల్ అన్నారు. డాక్టర్ పర్యవేక్షణ, ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని కొందరు వాడుతుంటారని, ఇలా వాడటం వల్ల కొందరు నిద్ర సమస్యలు, నరాలు దెబ్బతినడం, చిరాకు, మూడ్ స్వింగ్స్, స్కిన్ ఛేంజెస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటారని ఖండేల్వాల్ చెప్పారు. బోన్ గ్రోత్‌ని కూడా ఇవి పెంచుతాయన్నారు.
చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఓవర్ ఎక్సర్సైజ్ల వల్ల సడెన్‌గా చనిపోతుండటం షాక్‌కి గురిచేస్తోందన్నారు నోయిడాలోని ఫోర్టిస్‌లో కార్డియాలజీ విభాగ హెడ్, డైరెక్టర్ సంజీవ్ గేరా. పోస్ట్ కోవిడ్ తర్వాత ఇవి పెరుగుతున్నాయని చెప్పారు. గుండె ధమనుల్లో తెలియకుండా ఉన్న బ్లాకేజ్‌లు వీరిలో గుండెపోటుకు కారణం కావచ్చన్నారు. హార్ట్ రేట్లో హెచ్చు తగ్గులూ ఇందుకు కారణం అయి ఉండొచ్చని చెప్పారు. టోన్డ్ బాడీ కోసం వాడే స్టెరాయిడ్ల వల్ల దుష్ర్పభాలు ఎక్కువని చెప్పారు. అలాగే కెఫిన్ కలిగి ఉండే "ప్రీ-వర్కౌట్ ప్రోటీన్ పౌడర్" ఎక్కువగా వాడటం హానికరమని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ మిశ్రా వివరించారు. ఇది అలసటను తగ్గించి వర్కవుట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల హార్ట్ రేట్లో హెచ్చుతగ్గులు వస్తాయి.
* జిమ్ కోసం స్టెరాయిడ్లు వాడొచ్చా?
జిమ్(Gym)కోసం స్టెరాయిడ్స్ వాడితే దీర్ఘకాలిక పరిణామాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వాడకంతో గుండె, లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో శారీరక, మానసిక మార్పులొస్తాయి. బాడీబిల్డింగ్ కోసం అగ్రసివ్‌గా ట్రైనింగ్, స్టెరాయిడ్లు తీసుకోవడం చాలా హానికరమని లక్నోలోని మెదాంత హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహిమ్ సరన్ అన్నారు. అనాబాలిక్ స్టెరాయిడ్స్‌కు అడిక్ట్ అయినవారు సైడ్ ఎఫెక్స్ ఉంటాయని తెలిసినా వాటిని వాడేందుకు ఇష్టపడతారని చెప్పారు. అవి చెడ్డవి కాదు కానీ, వ్యక్తి అవసరాన్ని బట్టి సిఫార్సు చేయాలి. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏదీ తీసుకోకూడదు. జిమ్, మందులు, ఎక్సర్సైజ్లు ఏవైనా ఎక్స్‌పర్ట్‌ల పర్యవేక్షణ తప్పనిసరి అని పారాస్ ఆసుపత్రి డాక్టర్ ఖండేల్వాల్ హెచ్చరించారు.
* హైపర్ జిమ్మింగ్ (Hyper-Gymming)వద్దు..
హైపర్ జిమ్మింగ్, హెవీ ఎక్సర్సైజ్ల వల్ల శరీరంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు శరీరానికి రక్తం, ఆక్సిజన్లు ఎక్కువగా అవసరం అవుతాయి. అందుకు గుండె రక్తాన్ని మరింత వేగంగా పంప్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండె అయితే ఫర్వాలేదు. కానీ ఏమైనా బ్లాకేజ్‌లు ఉంటే మాత్రం గుండె పోటు ప్రమాదాలు పెరుగుతాయి.
ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్సిటల్(ఢిల్లీ)లోని డాక్టర్ సందీప్ సింగ్ ఈ విషయాన్నే ధృవీకరించారు. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ తర్వాత చాలా సార్లు హార్ట్ ఎటాక్‌లు(Heart Attacks) వస్తున్నాయన్నారు. ‘టూ మచ్, టూ క్విక్లీ’ విధానం వద్దని ఆయన సూచిస్తున్నారు. ఎక్కువ పరుగు, బరువులు మోయడం, ఎక్కువ రెప్స్ ఇలా ఏవైనా ప్రమాదమేనన్నారు. ఇలాంటప్పుడు ఎక్సర్సైజ్ హెల్తీ ప్రాక్టీస్ కానే కాదని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవారు రెగ్యులర్ రొటీన్‌కి తగినట్లుగా జిమ్ చేసుకోవాలని సూచించారు.
Piles in Winter: చలికాలంలో పైల్స్ సమస్యలు పెరుగుతాయా ?.. నివారణకు తీసుకొవాల్సిన జాగ్రత్తలు..
Kidney Health: ఈ 10 అలవాట్లను వెంటనే మార్చుకోండి.. లేకపోతే మీ కిడ్నీలకు ప్రమాదం..
* ఏం చేయాలి?
గత కొన్నేళ్లుగా 40 ఏళ్లలోపు వారిలో హార్ట్ ఎటాక్ల సంఖ్య బాగా పెరుగుతోంది. కోవిడ్19(Covid-19 ) తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్లు మానవ శరీరంపై చాలా ఉంటున్నాయి. అవి దీర్ఘకాలికంగానూ పని చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా పరిశోధనలు ధ్రువీకరించాయి. మన భారతీయుల జన్యుపరమైన అంశాలు, గుండె జబ్బులు, జీవ క్రియ, లైఫ్స్టైల్ల వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నాయి. మెదాంత హాస్పిటల్ డాక్టర్ మహిమ్ సరన్ దీనిపై కొన్ని సూచనలు చేశారు. ఒత్తిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని, యువకుల్లో పేషెంట్లు ఉంటే తప్పక ఫుల్ బాడీ చెకప్‌లు (Full Body Check-Ups) చేయించుకోవాలని చెప్పారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్టింగ్ తప్పనిసరి అన్నారు.
స్త్రీ పురుషులు ఎవరైనా జిమ్‌లో జోయిన్ అవ్వదలుచుకుంటే ముందు కరోనరీ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేయించుకోవాలని మహిమ్ తెలిపారు. 35 ఏళ్లు దాటినవారు ఎవరైనా సరే అగ్రెసివ్‌గా జిమ్ చేయాలని అనుకుంటుంటే ఈ చెకప్‌లు తప్పక చేయించుకోవాలని, హెల్దీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ వేడి, ఎక్కువ చలి వాతావరణాల్లో ఎక్కువ జిమ్ చేయడం గుండెపై మరింత ఒత్తిడి కలిగిస్తుందని, బీపీ, షుగర్లను కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exercises