Hair Straighteners: హెయిర్ చాలా స్టైల్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించాలని మగువలు రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. చాలామందికి హెయిర్ స్ట్రెయిట్‌నెర్ (Hair straighteners) వాడే అలవాటు కూడా ఉంటుంది. అయితే కెమికల్ హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను తరచుగా ఉపయోగించే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Uterine cancer) వచ్చే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించని మహిళలతో పోలిస్తే వీరిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
ఫ్లిప్‌కార్ట్ లో దీవాళీ సేల్ షురూ.. ఆఫర్లే ఆఫర్లు.. ఈ 5G ఫోన్ పై ఏకంగా 40 వేల డిస్కౌంట్..
యునైటెడ్ స్టేట్స్‌లో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో తెల్లజాతి మహిళల కంటే నల్లజాతి మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కెమికల్ స్ట్రెయిట్‌నెర్లు కొంతవరకు క్యాన్సర్‌కు కారణమవుతాయని తెలిపింది.
* సర్వే వివరాలు
దాదాపు 11 ఏళ్లుగా యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ (NIEHS) పరిశోధకులు 33,947 మంది మహిళల హెల్త్ ట్రాక్ చేశారు. ఈ అధ్యయన కాలంలో ఆ మహిళలలో 378 గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారు. సర్వే చేయడానికి ముందు 12 నెలల్లో కెమికల్ స్ట్రెయిటనింగ్ ప్రొడక్ట్‌ని నాలుగు సార్లు వాడిన వారు ఎప్పుడూ వాడని వారితో పోలిస్తే 155% క్యాన్సర్ బారినపడే అవకాశం ఎక్కువ అని అధ్యయనంలో తేలింది.
సింపుల్‌గా చెప్పుకుంటే.. హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను ఎప్పుడూ ఉపయోగించని మహిళలకు 70 ఏళ్ల వయస్సులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1.64 శాతంగా ఉండగా స్ట్రెయిట్‌నెర్లను తరచుగా ఉపయోగించే వారికి 4.05 శాతంగా ఉంది. అంటే రెట్టింపు కంటే ఎక్కువగా ముప్పు వీరికి ఉందని నేషనల్ స్టడీ ప్రకారం తెలుస్తోంది.
* వారికి ప్రమాదం ఎక్కువ
ఈ అధ్యయనం నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ జర్నల్‌లో సోమవారం పబ్లిష్ అయ్యింది. అన్ని జాతి, జాతి నేపథ్యాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రమాదం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అయితే మహిళలందరిలో నల్లజాతి మహిళలపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని తెలుసుకున్నారు. రీసెర్చర్ల ప్రకారం, హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను ఉపయోగించినట్లు చెప్పిన పార్టిసిపెంట్లలో 60 శాతం మంది నల్లజాతీయులు ఉన్నారు. పారాబెన్లు, బిస్ఫినాల్ ఎ, లోహాలు, ఫార్మాల్డిహైడ్ వంటి స్ట్రెయిట్‌నెర్లలోని అనేక రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో పాత్ర పోషిస్తాయని.. ఆ రసాయనాలలో కొన్నిటికి ఎండోక్రైన్-డిస్రప్టింగ్ కలిగించే లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
కెమికల్ హెయిర్ స్ట్రెయిట్‌నెర్లతో గర్భాశయ క్యాన్సర్‌కి లింక్ ఉన్నట్లు పేర్కొన్న తొలి ఎపిడెమియోలాజికల్ అధ్యయనంగా ఈ పరిశోధన నిలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధనలు పేర్కొన్నారు. హెయిర్ స్ట్రెయిట్‌నెర్ వాడకం మునుపటి అధ్యయనాలలో అండాశయ, రొమ్ము క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Health, Life Style, Lifestyle