Green tea: గ్రీన్‌టీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా బరువు తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కొందరు ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ(Green Tea) తాగితే.. మరికొందరు ఐదారు కప్పుల గ్రీన్‌టీ తాగుతారు. అయితే, ఏ వేళలో..ఎంత మొత్తంలో గ్రీన్ టీ తాగితేఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

  • Share this:
కాల్చని (unoxidized) ఆకులతో తయారుచేసే గ్రీన్‌టీ(Green Tea)లో అనేక పోషకాలుంటాయి. సాధారణంగా బరువు తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కొందరు ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ(Green Tea) తాగితే.. మరికొందరు ఐదారు కప్పుల గ్రీన్‌టీ తాగుతారు. అయితే, ఏ వేళలో..ఎంత మొత్తంలో గ్రీన్ టీ తాగితేఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఎప్పుడు, ఎంత మొత్తంలో గ్రీన్ టీ తాగాలి..?
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ తో సహా కెఫిన్ కూడా ఉంటుంది. అందువల్ల, రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు గ్రీన్ టీ తాగకూడదు. ఎక్కువసార్లు గ్రీన్ టీ పుచ్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలోని పోషక విలువలున్న అన్ని ద్రవాలు బయటకుపోతాయి. భోజన సమయాల్లో గ్రీన్ టీ తాగడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..


అంటే భోజనానికి రెండు గంటలకు ముందుగా లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగవచ్చు. కానీ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. భోజన వేళల్లో గ్రీన్ టీ తాగడం వల్ల క్యాటెచిన్స్ (యాంటీ ఆక్సిడెంట్లు).. యానిమల్ ప్రోటీన్ లేదా పాలలో ఉండే కేసిన్‌లతో రియాక్ట్ కాకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలోనే గ్రీన్ టీ తాగితే.. పోషకాలు సేకరణ తగ్గుతుంది. అలాగే శరీరం ఐరన్, మినరల్స్ గ్రహించలేదు. రోజుకు 1-2 కప్పులు తాగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీ ఆకలిని తగ్గిస్తుందని తద్వారా కేలరీల నియంత్రణతో బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అజీర్తి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ చాలా తక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..


గ్రీన్ టీ తయారీ విధానం..
గ్రీన్ టీ తయారు చేసుకోవడానికి గ్రీన్ టీ ఆకులు లేదా టీ బ్యాగ్, నీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేయాలి. లేదా ఒక కప్పు హాట్ వాటర్ కి.. ఒక టీ బ్యాగ్ వాడితే సరిపోతుంది. టీ ఆకులను 2-3 నిమిషాలు వేడి నీటిలో ఉంచాలి. ఎక్కువసేపు వేడి చేస్తేటీ రుచి చేదుగా మారుతుందని గమనించాలి. ఇప్పుడు తయారుచేసిన టీని ఒక కప్పులో వడకట్టండి. రుచి కోసం కొన్ని చుక్కల తేనె, నిమ్మ లేదా అల్లం ముక్క వేసుకొండి. అంతే క్షణాల్లో గ్రీన్​ టీ రెడీ అవుతోంది.
Published by:Veera Babu
First published: