హోమ్ /వార్తలు /life-style /

Goat Milk: మీరు మేక పాలు ఎందుకు తాగాలో 10 కారణాలు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..

Goat Milk: మీరు మేక పాలు ఎందుకు తాగాలో 10 కారణాలు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..

Goat Milk: ఘాటైన వాసన ఉండే మేక పాలు (Goat Milk) తాగడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కొన్ని ప్రాంతాల్లో మేక పాలను అలవాటుగా తాగుతారు. మేక పాలలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  భారతీయుల ఇళ్లలో పాలు లేదా పాల ఉత్పత్తుల వాడకం ఒక నిత్యావసరంగా ఉంటుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఆవు పాలు (Cow Milk), గేదె పాలనే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఘాటైన వాసన ఉండే మేక పాలు (Goat Milk) తాగడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కొన్ని ప్రాంతాల్లో మేక పాలను అలవాటుగా తాగుతారు. మేక పాలలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

  శరీరానికి పూర్తి పోషణ అందించే అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో మేక పాలు ఒకటి. కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు మేకపాలను అందిస్తుంటారు. దీనివల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుందని నమ్ముతారు. తల్లి పాల ద్వారా శిశువులకు తగినంత ఐరన్‌ అందదు. ఎముకల నిర్మాణానికి ఐరన్‌ చాలా అవసరం. అందుకే ఈ పోషకం లభించే మేక పాలను తాగిస్తే శిశువుల శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి.

  * రోజూ మేక పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఇవే..

  - మేక పాలలో ప్రోటీన్ (Protein), లాక్టోస్ (Lactose) అధికంగా ఉంటాయి. ఇవి గ్రోత్ హార్మోన్ ఉత్పత్తికి ముఖ్యమైనవి.

  - మేక పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి(Immune System) పెరుగుతుంది.

  - మేక పాలలో శరీరానికి అవసరమైన విటమిన్లు చాలా ఉన్నాయి. విటమిన్ ఎ, డి, బి12, ఐరన్, జింక్, కాపర్, పాంతోతేనిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మేక పాలలో చాలా తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది.

  - అధిక ప్రోటీన్లు ఉన్న కారణంగా ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా మేక పాలను ఉపయోగించవచ్చు.

  - మేక పాలు శరీరంలో యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా డెంగ్యూ నివారణలో కీలకంగా పనిచేస్తాయి. డెంగ్యూతో బాధపడేవారు వీటిని తాగితే త్వరగా కోలుకుంటారు.

  - ఈ పాలలో ఎలాంటి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉండవు. అందుకే మేకపాలు శరీర జీవక్రియలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు.

  - మేక పాలలో లాక్టోట్రాన్స్‌ఫెర్రిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణశయాంతర పేగు రోగనిరోధక కణాలలో ఉండే ఐరన్-బైండింగ్ ప్రోటీన్. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడకుండా చూస్తూ, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

  ఇది కూడా చదవండి : గాడిదలు కాస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? ఆ పాలతో ఉపయోగాలెన్నో..?

  - మేక పాలతో తయారు చేసిన సబ్బులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

  - ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ఇతర పాల కంటే మేక పాలు తాగడం మంచిది.

  First published:

  ఉత్తమ కథలు