మన దేశంలోని ప్రతి ప్రాంతంలో సాంప్రదాయ వంటకాలను తయారు చేయడానికి నెయ్యిని విరివిగా వాడుతున్నారు. లడ్డు, బాదుషా, మైసూర్ పాక్ వంటి స్వీట్లతో పాటు రోజువారీ ఆహారంలో కూడా నెయ్యిని వాడేవారు ఉన్నారు. అనేక అనారోగ్యాలను నయం చేయగల ఔషధ గుణాలు ఉండే నెయ్యిని చాలా ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే నెయ్యిలో గుండెకి కీడు చేసే శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుందనే వాస్తవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. అనవసరపు కొవ్వు లేదా చెడు కొవ్వుగా పిలిచే ఈ శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల లావైపోతారని చాలామంది నమ్ముతుంటారు. మరి శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న నెయ్యిని మీరు వాడొచ్చా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
శతాబ్దాలుగా భారతీయ వంటల్లో నెయ్యి ఒక అంతర్భాగమైంది. మన పూర్వీకులు అన్ని రకాల వంటకాలను తయారు చేయడానికి దీన్ని ఉపయోగించారు. అయినప్పటికీ ఎలాంటి గుండెజబ్బుల బారిన పడకుండా, లావెక్కకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించారు. ఇదే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ నెయ్యిని రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలని చాలామంది సలహా ఇస్తుంటారు.
పోషకాహార నిపుణుల ప్రకారం, ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. శరీరంలో పచ్చదనాన్ని పెంచడంలో నెయ్యి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో నెయ్యి సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఇ, ఎ, సి, డి, కె తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ కొందరికి ఇబ్బంది కలిగించగలదు.
* బరువు, గుండె సమస్యలకు కారణంగా మారుతుందా?
అధిక మోతాదులో శాచురేటెడ్ కొవ్వును తీసుకోవడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సంతృప్త కొవ్వులు లేదా శాచురేటెడ్ ఫ్యాట్ మీ ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె పోటు సమస్యకు దారి తీయవచ్చు.
కొన్ని అధ్యయనాల ప్రకారం, షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే లాంగ్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. నెయ్యిలో ఎక్కువగా లాంగ్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యే ఉంటాయి. అందువల్ల ఇది ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : శరీరంలో ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే.. శృంగారంలో రెచ్చిపోతారట..!
మీరు పేలవమైన జీవనశైలిని ఫాలో అవుతూ.. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే డేంజర్‌లో పడ్డట్టే! శారీరక శ్రమ లేని వారి శరీరంలో ఇన్సులిన్ అధికంగా ఉండటం వల్ల వారిలో కొవ్వు నిరంతరం పేరుకుపోతుంది. ఒకేచోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చునే వారు శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. కొంతమందిలో ఇది అధిక బరువుకి కూడా దారి తీస్తుంది. జన్యుపరమైన కారణాల వల్ల కొందరిలో శాచురేటెడ్ ఫ్యాట్ బరువు పెరిగేలా చేస్తుంది.
శాచురేటెడ్ ఫ్యాట్ అనేది అధిక శక్తి కేలరీల ఉన్న కొవ్వు. కాబట్టి ఇది శరీరంలో పేరుకుపోకుండా సంపూర్ణంగా అరగాలంటే ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. వైద్యుల ప్రకారం ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి నెయ్యి చాలా ఆరోగ్యకరమైనదైతే.. ఎప్పుడూ ఫిజికల్ వర్క్ చేయని వారికి ఇది అత్యంత అనారోగ్యకరమైనది. మంచి జీర్ణక్రియ శక్తి ఉన్నవారు కూడా నెయ్యిని ప్రతిరోజూ తినొచ్చు.
ఇది కూడా చదవండి : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు..!
* నెయ్యి ఎవరు తినకూడదు?
ఎన్నో విటమిన్లు గల నెయ్యి అనారోగ్యకరమైనది చెప్పడం అవివేకమే అవుతుంది. కాకపోతే పైన చెప్పినట్లుగా కొందరు నెయ్యిని కాస్త జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. హెల్తీ వెయిట్ ఉండి రోజూ శారీరక పనులు చేసేవారు మాత్రమే నిర్భయంగా నెయ్యిని వాడొచ్చు. ఒకవేళ రోజంతా ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా గడిపేవారు నెయ్యికి దూరంగా ఉండటమే మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ghee, Health Tips, Heart Attack, Life Style, Weight gain, Weight loss