Home /News /life-style /

HEALTH GARLIC USE IN WINTER WILL BE VERY HEALTHY AND BENEFICIAL HERE IS THE DETAILS AK GH

Garlic in Winter: శీతాకాలంలో వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు.. దీన్ని ఆహారంలో ఎందుకు చేర్చుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వంటల్లో ఉపయోగించే వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించడం మంచిది. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నట్టు ఆయుర్వేదంలో కూడా వివరించారు.

మన దేశంలో వంటింట్లో ఉపయోగించే వివిధ రకాల పదార్థాలు, మసాలా దినుసులు (Spices) ఆరోగ్యాన్ని కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. పురాతన కాలం నుంచి వంటింట్లో ఉపయోగించే జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు.. ఇవన్నీ తక్కువ మోతాదులో వాడుతూ అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వంటల్లో ఉపయోగించే వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) అన్నీ ఇన్నీ కావు. శీతాకాలంలో (Winter Season) ఆరోగ్యంగా ఉండటానికి వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించడం మంచిది. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నట్టు ఆయుర్వేదంలో కూడా వివరించారు. ఈ సీజన్‌లో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రజనాల గురించి తెలుసుకుందాం.

* జలుబుకు చెక్
వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి రోజూ వెల్లుల్లి తినే వారు జలుబు, ఇతర జ్వరాల బారిన పడే అవకాశం తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. జలుబు లక్షణాలు కూడా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. వెల్లుల్లి వాడకుండా జలుబు 5 రోజులు ఉంటే, వెల్లుల్లి వాడితే 1.5 రోజుల్లోనే తగ్గుతుందని అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

* పోషకాల సమ్మేళనం
వెల్లుల్లిలో సల్పర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే అతి ముఖ్యమైన కాంపౌండ్ ఉంటుంది. దీంతోపాటు మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, సెలీనియం, ఫైబర్ కూడా వీటి నుంచి పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ శీతాకాలంలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల సూక్ష్మపోషకాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* రక్తపోటు నివారణ
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటుకు ఇది ఒక ఔషధంలా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. వెల్లుల్లిని తేనెతో కలిపి తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు.

* మధుమేహం నియంత్రణ
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వెల్లుల్లి నియంత్రిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా ఎముకలకు జరిగే హానిని వెల్లుల్లి నివారిస్తుందని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. దంతాల ఆరోగ్యానికి, దంతక్షయాన్ని నివారించడానికి సైతం వెల్లుల్లి ఉపయోగపడుతుంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

* ఆరోగ్యకరమైన బరువు
వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తింటే ఫలితం కనిపిస్తుంది.

వెల్లుల్లిపై నిర్వహించిన వివిధ అధ్యయనాల్లో తేలిన అంశాలను కథనంలో అందించాం. ఈ చిట్కాలు వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయాలు కావని గుర్తించాలి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Health benefits

తదుపరి వార్తలు