హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Garlic Milk: గ్యాస్‌, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? ఇలా మీ సమస్యలకు చెక్ పెట్టండి..

Garlic Milk: గ్యాస్‌, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? ఇలా మీ సమస్యలకు చెక్ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తీసుకునే ఆహారం కారణంగా కొందరిలో ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గార్లిక్‌ మిల్క్‌ మేలు చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకోగల ఈ డ్రింక్‌తో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.

తీరికలేని జీవనశైలి మీకు వృత్తిపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగించినా.. కచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు వేళకాని వేళల్లో ఎక్కువగా తినేయడం వంటివి చేస్తుంటారు. ఈ కారణాలతో ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గార్లిక్‌ మిల్క్‌ మేలు చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకోగల ఈ డ్రింక్‌తో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.

గార్లిక్‌ మిల్క్‌లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ ఎక్కువగా ఉంటాయి. గ్యాస్‌ సమస్యలు, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఆయుర్వేద వైద్యులు కూడా రోగులకు గార్లిక్‌ మిల్క్‌ను సూచిస్తున్నారు. గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రరోగులకు గార్లిక్‌ మిల్క్‌ మంచి చేస్తుంది. ననిద్రపోయే ముందు తీసుకొంటే కొలెస్ట్రాల్‌ సమస్యను తీరుస్తుంది. తల్లులలో రొమ్ము పాలను వృద్ధి చేస్తుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

ఎసిడిటి సమస్యకు వెల్లుల్లి పాలు

* ఇంట్లో గార్లిక్‌ మిల్క్‌ తయారు చేసుకోనే విధానం

ఎసిడిటీని దూరం చేసే ఈ హోం రెమెడీ చరక సంహిత చికిత్స స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

- కావాల్సిన పదార్థాలు

5 గ్రాముల వెల్లుల్లి

50 ఎంఎల్‌ నీళ్లు

50 ఎంఎల్‌ మిల్క్‌

- తయారు చేసే విధానం

వెల్లుల్లిని పేస్ట్‌ చేసి పాలు, నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమం 50 ఎంఎల్‌ వరకు చేరేంత వరకు బాయిల్‌ చేయాలి. చల్లారిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. రోజూ భోజనం చేశాక రెండు సార్లు 10 ఎంఎల్‌ చొప్పున తాగాలి.

* వెల్లుల్లి ఇతర ప్రయోజనాలు ఏంటి?

భారతీయులు వెల్లుల్లిని దాదాపు అన్ని వంటలలో ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలను, రుచిని అందిస్తుంది. ఇందులో అల్లిసిన్‌ అనే పదార్థం ఉండటంతో ఆయుర్వేధంలో గార్లిక్‌ను ఒక ఔషధంగా పరిగణిస్తారు. తాజా గార్లిక్‌, లేదా నలిగిన దానిలో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో డయాలిల్ డైసల్ఫైడ్, ఎస్-అల్లిల్ సిస్టీన్ వంటి ఇతర కకాంపౌండ్స్‌ కూడా ఉంటాయి. గార్లిక్‌లో ఉండే సల్ఫర్ కాంపౌండ్‌తో ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

* జలుబు తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

12 వారాల అధ్యయనం ప్రకారం రోజూ గార్లిక్‌ తింటే జలుబు వచ్చే అవకాశాలు 63 శాతం తగ్గినట్లు గుర్తించారు. ఏజ్డ్‌ గార్లిక్‌ను ఎక్కువ మోతాదులో తీసుకొంటే జలుబు లేదా ఫ్లూతో బాధపడే రోజుల సంఖ్య 61 శాతం తగ్గించిందని మరొక అధ్యయనం ధృవీకరించింది.

* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం

ఇప్పటి జీవనశైలిలో ఎక్కువ మందికి గుండెపోటు, స్ట్రోక్‌లు వస్తున్నాయని ఇప్పటికే తెలుసు. ఈ సమస్యలు నియంత్రణ లేని రక్తపోటు కారణంగా వస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో గార్లిక్‌ సమర్థంగా పని చేస్తుందని చాలా సర్వేలు స్పష్టం చేశాయి. రక్తపోటు ససమస్య ఉన్నవారు తరచూ గార్లిక్‌ తీసుకొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

* కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది:

గగార్లిక్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. నిద్రపోయే ముందు గార్లిక్‌ తింటే కొలెస్ట్రాల్‌ సమస్య త్వరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఏజింగ్‌ సమస్య దూరం

ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కారణంగా వృద్ధాప్యం వస్తుందని దాదాపు అందరికీ తెలుసు. గార్లిక్‌ సాయంతో ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌కు వ్యతిరేకంగా శరీరం పని చేస్తుందని నిపుణులు తెలిపారు.

First published:

Tags: Gas, Health Tips

ఉత్తమ కథలు