Home /News /life-style /

Dangerous Dish: ప్రపంచంలోనే ప్రాణాంతకమైన వంటకం ఇదే.. ప్రాణాలు పోతాయని తెలిసినా తింటారట..

Dangerous Dish: ప్రపంచంలోనే ప్రాణాంతకమైన వంటకం ఇదే.. ప్రాణాలు పోతాయని తెలిసినా తింటారట..

ఫుగు వండే విధానం

ఫుగు వండే విధానం

ఫుగూలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం తిన్నవారి బాడీలోకి వెళితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే అత్యంత రుచిగా ఉండే ఈ వంటకాన్ని తినకుండా ఉండలేకపోతున్నారు కొందరు ఆహార ప్రియులు.

దేశవిదేశాలు తిరుగుతూ అక్కడి ప్రత్యేకమైన రుచులను ఆస్వాదించాలని పర్యాటకులు ఆశపడుతుంటారు. మళ్లీ ఇంటికి వెళ్లాక అలాంటి ఫుడ్ దొరకదేమోనని వాటిని ఆవురావురుమంటూ లాగించేస్తుంటారు. భోజనప్రియులు తమ జీవితంలో ఎప్పుడూ చూడని, వినని ఆహార పదార్థాలను వదులుకోడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఇలాంటి భోజన ప్రియులు ఒక వంటకం గురించి తెలుసుకోకుండా తింటే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న వారు మాత్రమే ఈ వంటకాన్ని రుచి చూస్తారు. ఫుగూ (Fugu) అనే ఈ డెడ్లీ డిష్‌ను జపాన్‌లోని యమగుచి ప్రిఫెక్చర్‌(Yamaguchi Prefecture)లో తయారుచేస్తారు. ఇది తింటే ఎందుకు ప్రాణాలు పోతాయి? ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఈ వంటకాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విషపూరితమైన జపాన్ బ్లో ఫిష్
ఫుగూ (Fugu) లేదా బ్లో ఫిష్ అనేది జపాన్‌లోనే అత్యంత ప్రమాదకరమైన వంటకం. ఇది షిమోనోసెకి(Shimonoseki) సిటీలో బాగా పాపులర్ అయిన వంటకం. దీన్ని ఏమాత్రం తప్పుగా వండినా.. తిన్న వారి ప్రాణాలు గాల్లో కలిసి పోయే ప్రమాదం ఉంది. అత్యంత విషపూరితమైన ఈ వంటకాన్ని ప్రత్యేక లైసెన్స్‌లు కలిగిన రిజిస్టర్డ్ చెఫ్‌లు మాత్రమే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఫుగూ తినడం మృత్యువుతో చెలగాటం ఆడటమేనని చెప్పుకోవచ్చు. ఈ వంటకాన్ని 16వ శతాబ్దంలో నిషేధించారు. అయినప్పటికీ చాలామంది రహస్యంగా దీన్ని తయారు చేస్తూనే ఉన్నారు.

So Sad: వాళ్ల విలువ దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు.. తెలుసుకునే సమయానికి ఊహించని విధంగా..


జపాన్‌లోని షున్‌పాన్రో ఫుగూతో వంటకాలను తయారు చేయడంలో అధికారికంగా లైసెన్స్ పొందిన మొదటి రెస్టారెంట్ అయి ఉండవచ్చు. కానీ చాలా ఇతర రెస్టారెంట్లు కూడా విషపూరితమైన పఫర్‌ ఫిష్‌తో వండిన వంటకాలను వడ్డించి ఇస్తున్నాయి. ప్రస్తుతం ఫుగూ చేపలను సన్నగా కట్ చేసి, స్ప్రింగ్ ఆనియన్స్‌తో చుట్టి, వెనిగర్, సోయా సాస్‌లో ముంచి తింటున్నారు ప్రజలు. ఇదే మోస్ట్ కామన్ తయారీ విధానంగా చెబుతుంటారు. కొన్నిసార్లు ముక్కలు చాలా సన్నగా ఉండి పారదర్శకంగా మారుతాయి. వేయించిన ఫుగూ, ఫుగూ హాట్ పాట్, ఫుగూ రైస్ గంజి(fugu rice porridge) హిరెజాకే (దానిలో కాల్చిన ఫూగు ఫిన్‌తో కూడిన హాట్ సాక్) అనే వంటకాలు కూడా అందరికీ ఫేవరెట్ డిష్ లుగా మారిపోయాయి.

అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


ఫుగూలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం తిన్నవారి బాడీలోకి వెళితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే అత్యంత రుచిగా ఉండే ఈ వంటకాన్ని తినకుండా ఉండలేకపోతున్నారు కొందరు ఆహార ప్రియులు. అందుకే వీటిని ఇప్పటికీ తయారు చేస్తూనే ఉన్నారు.

షిమోనోసెకిలో ఫుగూ డిష్ ప్రధాన ఆకర్షణగా ఉండవచ్చు. కానీ ఈ నగరం అనేక రుచికరమైన ఫుడ్ కు కూడా హోంగా నిలుస్తోంది. ఈ ప్రాంతం ప్రత్యేకంగా యాంగ్లర్‌ఫిష్ లివర్ తయారీకి ప్రసిద్ధి గాంచింది. కొన్నిసార్లు దీనిని ఫోయ్ గ్రాస్ ఆఫ్ ది సీ(foie gras of the sea), క్రీమీ సీ అర్చిన్ వంటకాలు అని పిలుస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు