హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mobile At Morning: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? భవిష్యత్తుల్లో ఏం జరుగుతుందో తెలుసా..

Mobile At Morning: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? భవిష్యత్తుల్లో ఏం జరుగుతుందో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగులకైతే రాత్రిళ్లు పని అలవాటు అయిపోయింది. నేచర్కి విరుద్ధంగా జీవితం కావడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టెక్నాలజీ (Technology) పెరిగిపోయింది. జీవితం వేగంగా పరిగెడుతోంది. వేళకూ తినడమూ (eat) మర్చిపోతున్నారు జనం. ఉద్యోగులకైతే రాత్రిళ్లు పని అలవాటు అయిపోయింది. నేచర్కి విరుద్ధంగా జీవితం కావడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక కొత్త కొత్త ఫోన్ (phones)లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు (electronic items) అందుబాటులోకి వచ్చాయి. అయితే మొబైల్ (mobile) అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన తర్వాత చూసేది మొబైల్ ఫోన్ (mobile phone)నే. మొబైల్ లేకుండా మన రోజు గడవదు. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూస్తాం, రాత్రి పడుకునే (before sleep) ముందు కూడా మొబైల్ తోనే సావాసం.. ఇలా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ మనకు సమస్తం అయిపోతుంది. అయితే ఇలా లేవగానే (after sleep) మొబైల్ చూసే అలవాటు చాలా ప్రమాదకరమట.. ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం...

కళ్లపై కాంతి ప్రమాదకరం..

ఉదయం లేవగానే (after wakeup) ఫోన్ చూడడం వల్ల ఆ వెలుగు పూర్తిగా కళ్ల పై పడుతుంది. ఎలాగైనా ఈ అలవాటు (habit)ను మానుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మొబైల్ చూడడం (mobile seeing) వల్ల దుష్ప్రభావాలేంటో మనలో చాలామందికి తెలీదు. అప్పటి వరకూ మూసుకొని ఉన్న కళ్లపై ఎక్కువ కాంతి పడడం (light up) వల్ల కళ్లు (eyes) పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోజంతా కళ్లు అంత ప్రభావవంతంగా పనిచేయలేవు. ఈ అలవాటు మానేస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేం.

యోగా.. మెడిటేషన్

మొబైల్ చూడడం అలవాటు ఉంటే ఆ తర్వాత యోగా (yoga), మెడిటేషన్ చేయడం.. ముఖం (face) కడుక్కోవడం వంటివేవి చేసినా కంటి నొప్పి తగ్గదు. అందుకే కళ్ల (eyes)ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అలవాటును దూరం చేసుకోవాల్సిందే. అయితే కళ్లు మసక మసకగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఇది అనర్థాలకూ దారి తీసే అవకాశం ఉంటుంది. వయస్సు మీరే కొద్దీ కళ్లు కనిపించకపోవడం సాధారణమే కానీ, వయసులో ఉండగా కళ్లు కనిపించకపోతే కొంచెం డేంజరే.

Diabetes-Potatoes: షుగర్ ఉన్నవాళ్లు బంగాళాదుంపలు తినడం మంచిదేనా ? వైద్యులు చెబుతున్నదేమిటి ?

Heart Attack Risk: చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేనట్టే..

తల చాలా బరువుగా..

ఉదయం మొబైల్ ని పట్టుకొని చూడడం వల్ల మొబైల్ తాలూకు లైట్ కిరణాలు (light rays) మన కళ్లపై పడి లోపలికి చొచ్చుకుపోతాయి. ఇది మన కళ్లకు అంత మంచిది కాదు. అలాగే మొబైల్ వాడకం వల్ల మన రోజంతా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. తల చాలా బరువుగా (head weight) అనిపిస్తుంది. రోజంతా తలనొప్పి (headache)గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకునే అలవాటు మీకుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే దాన్ని మార్చుకుంటే రోజంతా ఫ్రెష్ గా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Mobiles

ఉత్తమ కథలు