హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

International Yoga Day: ఆసనాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఏ ఆసనం ఎలానో చూద్దామా..!

International Yoga Day: ఆసనాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఏ ఆసనం ఎలానో చూద్దామా..!

ఆసనాలతో మనకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది.

ఆసనాలతో మనకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది.

ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) జరుపుకుంటున్నాం. ఈ ఏడాది యోగా (Yoga) దినోత్సవానికి కొన్ని రోజులే ఉంది. ఈ సందర్భంగా మన శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తూ, ఆరోగ్యాన్ని (Health) కాపాడే యోగాసనాలు ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రాముఖ్యత పెరిగింది. శారీరక ప్రయోజనాలతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఎక్కువ మంది యోగా సాధన చేస్తుంటారు. ఒత్తిడి తగ్గించుకోవడంలోనూ యోగా కీలక పాత్ర పోషిస్తుంది. జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేయడానికి సమయం లేనివారికి యోగా బెస్ట్ ఆప్షన్. ప్రశాంతమైన ప్రదేశం, ఒక యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది.

శరీరం మొత్తం ఫిట్‌గా ఉండటానికి డైలీ యోగా సాధన చేయాలి. బరువు తగ్గడంలో, ఒత్తిడి తగ్గించుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు ఫ్లెక్సిబులిటీగా, పరిపుష్టిగా ఉంటాయి. అలాగే శరీర భంగిమను మెరుగుపర్చుతుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా శరీరానికి అంతర్గత శాంతిని అందిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది యోగా దినోత్సవానికి కొన్ని రోజులే ఉంది. ఈ సందర్భంగా మన శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తూ, ఆరోగ్యాన్ని కాపాడే యోగాసనాలు ఏవో చూద్దాం.

ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారా..? అయితే బ్లాక్ కాఫీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి


తడాసనం

1. పాదాలను కొంచెం దూరంగా ఉంచి నిల్చోవాలి.

2 ఇప్పుడు శ్వాస పీల్చుకోండి. తరువాత తల మీదుగా చేతులను పైకి ఎత్తాలి.

3 పైకి ఎదురుగా ఉన్న అరచేతులతో వేళ్లను ఇంటర్‌లాక్ చేయండి

4 శ్వాస వదులుతూ భుజాలను చెవుల వైపు పైకి లేపండి

5 మీ భుజాలను వెనుకకు రోల్ చేసి వెన్నెముక వెపు తిప్పండి

6 ఛాతీని పెద్దగా చేసి, భంగిమను బలోపేతం చేయండి

7 ముఖం, కంటి కండరాలన్నింటినీ రిలాక్స్ కోసం భంగిమను స్థిరంగా కొనసాగించండి

8. సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోండి.

ఇదీ చదవండి: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న 5G టెక్నాలజీ.. 5G ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలా?


వృక్షాసనం

1. చేతులు సాధారణ స్థితిలో ఉంచి నిటారుగా నిల్చోండి.

2. కుడి మోకాలిని వంచి, కుడి పాదాన్ని మీ ఎడమ తొడపై ఉంచండి.

3. పాదాల అడుగు భాగాన్ని ఫ్లాట్‌గా ఉంచాలి

4. ఎడమ కాలును నిటారుగా ఉంచాలి

5. ఇలా చేస్తూ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు, గట్టిగా శ్వాస తీసుకోండి. తరువాత తల మీదుగా చేతులను ముందుకు చాచి నమస్కార ముద్రలోకి తీసుకురండి.

6. నిటారుగా చూస్తు ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం బ్యాలెన్స్‌లో ఉంటుంది.

7. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, పాదాన్ని కిందికి దించి, చేతులను వదలండి.

8. ఇప్పుడు, మీ ఎడమ కాలుతో ఈ ఆసనాన్ని మరోసారి ప్రాక్టీస్ చేయండి.

వజ్రాసనం

1. చాప మీద మోకాళ్లపై కూర్చోండి

2. మోకాళ్లు, చీలమండలను వెనుకకు మడవండి

3. పాదాల అడుగు భాగాలు కాలి వేళ్లను తాకుటూ పైకి ఎదురుగా ఉండాలి

4. కాళ్ళపై కూర్చోని ఊపిరి పీల్చుకోండి

5. తొడలపై చేతులు పెట్టి విశ్రాంతి తీసుకోవాలి

6. శరీర కండరాలన్నీ నిటారుగా ఉంచండి

7. కళ్లు మూసుకొని గాలి గట్టిగా పీల్చుకోవాలి

8. సౌకర్యవంతంగా ఉండే వరకు మీ తొడలు, పొత్తి కడుపు వెనుకకు ముందుకు కదిలించండి

9. తల నిటారుగా ఉంచండి

10. మీ మోకాళ్లపై మీ చేతులను స్ట్రైట్‌గా ఉంచండి

11. గాలి పీల్చుతూ తరువాత వదలండి

12. సాధారణ స్థితికి తిరిగి రావడానికి పిరుదులు, తొడలను నెమ్మదిగా పైకి లేపండి

13. తర్వాత నెమ్మదిగా లేచి నిల్చోండి.

First published:

Tags: Health care, Yoga, Yoga day, Yoga day 2022

ఉత్తమ కథలు