అసలే కరోనా వైరస్ భయాలు...ఇప్పుడు వర్షాకాల సీజన్ మొదలయ్యింది. ఈ కాలంలోనే జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటి సమస్యలే కాక ఇన్ఫెక్షన్స్ చుట్టుముడతాయి. వీటిని అధిగమించాలంటే.. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగ నిరోధక శక్తి కోసం ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుని సీజనల్ వ్యాధులను జయించేందుకు కొన్ని ఆహారపదార్థాలు సూచిస్తున్నాం. అవేంటంటే.. పసుపు, గ్రీన్ టీ, బొప్పాయిపండు, కివీలు, చికెన్ సూప్, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు విటిమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉండే బాదంపప్పులు కూడా తీసుకోవాలి.
అంతేకాక.. అల్లం, వెల్లులిని పచ్చిగా తీసుకుంటుండాలి. వీటితో పాటు.. పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండే గ్రేప్స్, నారింజ, నిమ్మకాయలు, కివీలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ కాస్తాంత వ్యాయామం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
సరైన ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవడం ద్వారా అటు కరోనా మహమ్మారిని ఇటు సీజనల్ వ్యాధులను మనం జయించొచ్చు.
ఈ వీడియో కూడా చూడండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, HOME REMEDIES, Monsoon rains