Digestion Problems: వర్షాకాలంలో రెట్టింపయ్యే జీర్ణ సంబంధిత సమస్యలు.. ఈ జాగ్రత్తలతో తీసుకుంటే అంతా ఓకే

ప్రతీకాత్మక చిత్రం

Digestion Problems: సమతులాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, జంక్, స్పైసీ ఆహారాన్ని నివారించడం, గోరు వెచ్చని నీరు తాగడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ఈ సీజన్​లో అంటువ్యాధులు, అలర్జీలతో పాటు జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతిని ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రో ఎంటరైటిస్, అల్సర్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల మిగతా సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు. సమతులాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, జంక్, స్పైసీ ఆహారాన్ని నివారించడం, గోరు వెచ్చని నీరు తాగడం వంటివి పాటించాలని చెబుతున్నారు.

వర్షాకాలంలో కడుపు, ప్రేగు, కాలేయ ఇన్ఫెక్షన్‌తో బాధపడే రోగుల సంఖ్య సహజంగా పెరుగుతుంటుంది. ఆహారం, నీటి ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్ల రేటు పెరగడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల, ఈ సీజన్​లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోడ్డు ప్రక్కనే ఉండే చాట్ లేదా జ్యూస్ తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వీటి వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు, శుద్ది చేసిన నీటిని మాతరమే తాగాలి. లేదంటే వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.

వర్షాకాలంలోనే ఎందుకీ సమస్య?
వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం మొత్తం జీర్ణవ్యవస్థను నెమ్మదించేలా చేస్తుంది. ఈ సీజన్​లో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు ఆటకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు దారితీస్తుంది. తద్వారా పేగులో ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ఈ సీజన్​లోనే చాలామంది రోగులు వాంతులు, వికారం, దీర్ఘకాలిక మలబద్ధకం, పొట్టలో పుండ్లు, గట్ సెన్సిటివిటీ వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోడ్డు పక్కన అమ్మే పండ్లను తినవద్దు. ఎందుకంటే వాటిపై బ్యాక్టీరియా చేరి కలుషితమవుతాయి.
పచ్చి ఆకు కూరలను నేరుగా తీసుకోవద్దు. వాటిపై సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి.

జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడానికి మీ ఆహారంలో అల్లం, నిమ్మకాయను చేర్చండి.

పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇవి మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

మీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సరిపోయే నీరు త్రాగండి.

పచ్చి కూరగాయలకు బదులుగా ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తినండి.

రిఫైన్డ్ షుగర్ తినవద్దు. ఎందుకంటే ఇది వాపు, గట్ ఫ్లోరా బ్యాలెన్స్​ను దెబ్బతీస్తుంది.

అసిడిటీ, బ్లోటింగ్​కు కారణమయ్యే వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఆహారం తిన్న వెంటనే పడుకోకండి.

ఒత్తిడి నుంచి బయటపడేందుకు, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
Published by:Kishore Akkaladevi
First published: