• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH FITNESS TIPS HOW CYCLING EVERY WEEK SHAPE UP YOUR BODY HERE ARE DETAILS BA GH

Weight Loss: ఫుల్లుగా తింటూ కూడా ఫిట్‌గా ఉండొచ్చు ఇలా.. సూపర్ బాడీ షేప్ సొంతం

Weight Loss: ఫుల్లుగా తింటూ కూడా ఫిట్‌గా ఉండొచ్చు ఇలా..  సూపర్ బాడీ షేప్ సొంతం

ప్రతీకాత్మక చిత్రం

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆహార నియంత్రణ లేకుండానే బరువులో మార్పు కావాలనుకుంటున్నారా? మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే సైక్లింగ్ సరైన ఎంపిక. ఇది విశ్రాంతి కోసం చేసే కార్యకలాపం మాత్రమే కాదు.

  • Share this:
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆహార నియంత్రణ లేకుండానే బరువులో మార్పు కావాలనుకుంటున్నారా? మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే సైక్లింగ్ సరైన ఎంపిక. ఇది విశ్రాంతి కోసం చేసే కార్యకలాపం మాత్రమే కాదు. ఏరోబిక్ (Aerobics) వ్యాయామానికి అద్భుతమైన రూపం. సైక్లింగ్ అనేది మీ మానసిక స్థితిని సరైన క్రమంలో ఉంచుతుంది. అంతేకాకుండా మీకు శక్తిని ఇస్తుంది. వాస్తవానికి మీరు ఫిట్ గా ఉండాలంటే సైక్లింగ్ (Cycling) సరైన మార్గం. అంతేకాకుండా శరీరాకృతిని సరైన క్రమంలో ఉంటుంది. ఇందుకోసం మీరు స్థిరంగా ఉండాలి. అంతేకాకుండా మంచి దూరాన్ని మెయింన్టెయిన్ చేయాలి. వారానికి ఎంత దూరం వెళ్లాలో లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది మీ ఫోకస్ ను మరింత శక్తిమంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.
మీ లక్ష్యం ఆరోగ్యంగా ఉండటమే అయితే మీరు ప్రతిరోజూ సైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. దూరం చిన్నదే అయినా క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడమనేది ప్రాథమిక నియమం. అరుదైన సూదీర్ఘ సెషన్ల కంటే తరచు చేసే చిన్న చిన్న దూరాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

టైమింగ్
18 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సున్న పెద్దలు ఆరోగ్యంగా ఉండాలంటే రెండున్నరేళ్లకోసారి ప్రతి వారం శారీరక శ్రమలో మార్పులు తీసుకురావాలి. ఈ వయస్సు వారా ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు సైక్లింగ్ చేయాలి. వారానికి కనీసం మూడు సైక్లింగ్ ట్రైనింగ్ సెషన్లు (Cycling sessions) నిర్వహించినట్లయితే ఫిట్ గా ఉంటారు.

60 నిమిషాల కంటే ఎక్కువసేపు లాంగ్ రైడ్ చేయడం
సైకిల్ పై సాధారణ వేగంతో 60 నిమిషాల సుదీర్ఘ ప్రయాణాన్ని చేయండి. ఇది మీ ఓర్పును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ శ్వాసను లయబద్ధంగా క్రమంగా ఉండే విధంగా ప్రయాణించండి. ఈ సెషన్ కోసం ఎల్లప్పుడూ చదునైనా భూభాగాలను ఎంచుకోండి. రైడ్ చేయడంపై దృష్టి పెట్టండి. అంతేకాకుండా తాగడానికి, తినడానికి మధ్యలో కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఈ రైడ్ మీ ఇంధనాన్ని సమర్థవంతంగా ఉంచడానికి శిక్షణ ఇస్తుంది. అంతేకాకుండా శరీరాకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

30 నుంచి 60 నిమిషాల పాటు కొండలపై సవారీ
కొండ ప్రాంతాలు లేదా ఎత్తైనా ప్రదేశాల్లో రైడ్ చేయడం కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా వెళ్లండి. పది నిమిషాలు సాధారణ వేగం సైక్లింగ్ చేసి ఆపై ఐదు నిమిషాలు వేగవంతమైన రైడ్ చేయండి. ఈ సెషన్ చేస్తున్నప్పుడు మీరు గాఢమైన శ్వాసను తీసుకోవాలి. అంతేకాకుండా ఒకటి లేదా రెండు పదాలు మాత్రమే చెప్పగలుగుతారు. ఇదే విధంగా నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉండి మళ్లీ పునరావృతం చేయాలి. కనీసం ఈ విధంగా 20 నిమిషాలు వేగంగా సైక్లింగ్ చేసినట్లయితే కండరాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

30 నుంచి 60 నిమిషాల హార్డ్ రైడ్
వేగవంతమైన సైక్లింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ గుండెకు కూడా మంచిది. అయితే తక్కువ వ్యవధిలో పది నిమిషాల ప్రాక్టిస్ సెషన్ ప్రారంభించి ఆపైనా ఐదు నిమిషాలు వేగంగా సైక్లింగ్ చేయాలి. అనంతరం 30 సెకన్ల రికవరీ టైమింగ్(Recovery Timing) ఉంటుంది. ఐదు నిమిషాలు సులభంగా సైక్లింగ్ చేసి ఆపై మళ్లీ పునరావృతం చేయండి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు