• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • HEALTH FIRST SEXUALLY TRANSMITTED DENGUE FEVER CASE CONFIRMED IN SPAIN BS

షాకింగ్.. సెక్స్ ద్వారా డెంగీ.. తొలి కేసు నమోదు..

షాకింగ్.. సెక్స్ ద్వారా డెంగీ.. తొలి కేసు నమోదు..

ప్రతీకాత్మక చిత్రం

సెక్స్ ద్వారా ఓ వ్యక్తి డెంగీని వ్యాప్తి చేస్తున్నట్లు తేల్చారు. దీని ప్రకారం.. దోమల ద్వారానే కాదు.. సెక్స్ ద్వారా కూడా డెంగీ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు.

 • Share this:
  దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి.. డెంగీ. ఈ ఏడాది అక్టోబరు నాటికి దేశవ్యాప్తంగా 67,377 కేసులు నమోదు కాగా.. వందల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. ఒక్క తెలంగాణలోనే బోలెడు కేసులు నమోదై, పదుల సంఖ్యలో మృతిచెందారు. ఈ మరణాలపై ఇక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు కూడా పెట్టింది. ప్రభుత్వం తరఫున కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హజరు కాగా.. ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3,800 డెంగీ కేసులు నమోదైతే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతోందని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. డెంగీ చరిత్రలోనే తొలిసారి వైద్యులు ఓ అరుదైన కేసును గుర్తించారు. సెక్స్ ద్వారా ఓ వ్యక్తి డెంగీని వ్యాప్తి చేస్తున్నట్లు తేల్చారు. దీని ప్రకారం.. దోమల ద్వారానే కాదు.. సెక్స్ ద్వారా కూడా డెంగీ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. స్పెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు వెల్లడించారు. అతడు.. తన పురుష సెక్స్ పార్ట్‌నర్‌తో సెక్స్ చేశాడని, అతడికి ఉన్న డెంగీ వ్యాధి ఇతడికి సోకిందని వివరించారు. ఇద్దరి స్పెర్మ్‌ను పరిశీలించగా డెంగీ వైరస్ ఉన్నట్లు తేలిందని తెలిపారు.

  ఇదిలా ఉండగా, ఏటా ప్రపంచవ్యాప్తంగా 10వేల మంది డెంగీ వ్యాధితో మరణిస్తున్నారు. 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. రాబోయే 60 ఏళ్లలో ఈ వ్యాధి ఊహించనంత వేగంగా వృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 2080 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం మంది ఈ వ్యాధి బారిన పడతారని వెల్లడించారు.
  First published: