HEALTH FINANCIALLY INDEPENDENT WHY DO WOMEN NEED FINANCIAL INDEPENDENCE WHAT TO DO FOR IT FULL DETAILS HERE GH VB
Financially Independent: మహిళలకు ఆర్థికంగా స్వాతంత్య్రం ఎందుకు అవసరం..? దాని కోసం ఏమి చేయాలి..? తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
పురుషులతో పాటు మహిళలకు కూడా ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందో అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఒక స్త్రీకి ఆర్థిక ఎందుకు అవసరమో తెలుసుకుందాం.
నేటి ఆధునిక కాలంలో పురుషులతో పాటుగా స్త్రీలు(women's) కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే, భారత్లో(Bharath) మాత్రం పురుషులతో పోలిస్తే స్త్రీలు ఉద్యోగాలు(Jobs), వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా పురుషుల ఆధిపత్యం కారణంగా ఇక్కడి స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనుకబడి ఉన్నారు. భారతదేశంలోని మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం విషయంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు(Business) చేసే అవకాశాలు లభించడం లేదు. కొంతమంది స్త్రీలు వివాహం(Marriage) లేదా తల్లి(Mother) అయిన తర్వాత తమ వృత్తిని త్యాగం చేస్తున్నారు. మరికొందరు మహిళలు చదువుకుని బాగా సంపాదించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కుటుంబం, సమాజం నుండి ఎదురయ్యే ఒత్తిడి కారణంగా ఉద్యోగాలు వదిలివేస్తున్నారు. వారి కుటుంబం కోసం లేదా వారి పిల్లలను పెంచడం కోసం తమ వృత్తిని త్యాగం చేయాల్సి వస్తుంది.
అయితే, ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్య్రం అనేది చాలా అవసరం. మనిషి తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదంటే కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. ఇలా కాకుండా పురుషులతో పాటు మహిళలకు కూడా ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందో అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఒక స్త్రీకి ఆర్థిక ఎందుకు అవసరమో తెలుసుకుందాం.
ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎటువంటి లోటు లేకుండా సంరక్షించగలదు. విపరీతమైన ద్రవ్యోల్బణంతో, కేవలం ఒక వ్యక్తి సంపాదనతో మంచి జీవితాన్ని గడపడం అసాధ్యంగా మారింది. అందువల్ల, భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయడంతో పిల్లల కోసం ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా, వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.
స్వీయ గౌరవం లభిస్తుంది
భారతదేశంలో అనేక మంది స్త్రీల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతోంది. అందువల్ల, ఎప్పుడైతే స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందో అప్పుడు తన భర్తపైన ఆధారపడకుండా జీవించగలదు. ఆమె తన ఖర్చుల కోసం తన భర్తను డబ్బు అడగవలసిన అవసరం ఉండదు. తద్వారా వారిలో ఆత్మ గౌరవం పెరుగుతుంది.
కుటుంబ సభ్యుల నుండి గౌరవం లభిస్తుంది
ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే స్త్రీలు కుటుంబంలోని ప్రతి సభ్యుడి నుండి గౌరవాన్ని పొందుతారు. తమ కుటుంబాలపై ఆర్థికంగా ఆధారపడిన మహిళలు తరచుగా అవమానాలను ఎదుర్కొంటారు. బంధువులు, ఇరుగుపొరుగు వారు కూడా ఉద్యోగం లేదా వ్యాపారం చేసే స్త్రీలను గౌరవిస్తారు.
అన్యాయాలను ప్రశ్నించగలరు
ఆర్థిక స్వాతంత్య్రం లేని స్త్రీలు తమ కోసం లేదా సమాజంలోని అణగారిన వ్యక్తి కోసం నిలబడలేరు. భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల సంపాదన మీద జీవించే స్త్రీలకు అన్యాయం ఎదురైనప్పుడు వారు గట్టిగా ప్రశ్నించలేరు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్య్రం అనేది ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ఉంటే, ఆమె తన కుటుంబం కోసం మంచి నిర్ణయాలు తీసుకోగలదు. తద్వారా, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురాగలదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.