మన కిచెన్‌లో తప్పనిసరిగా ఉండే పదార్థాల్లో సోంపు (Fennel) కూడా ఒకటి. మన ఇళ్లలో సోంపును అనేక రకాలుగా ఉపయోగిస్తాం. మసాలా దినుసుగా వంటల్లో వేసుకుంటాం. మౌత్ ఫ్రెష్‌నర్‌గానూ వాడుతారు. తీయగా ఉండే.. ఈ సోంపులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపును కషాయం లేదా సోంపు నీటిని తాగడం వల్ల.. మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సోపులో ఉండే పోషకాల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు (Health Benefits) కలుగుతాయో తెలుసుకుందాం.
సోంపు నీటితో ప్రయోజనాలు:
సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. నోటి దుర్వాసనను శాశ్వతంగా వదిలించుకునేందుకు సోంపు చక్కగా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు సోంపు కషాయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ 5 నేచురల్ మాయిశ్చరైజర్లు శీతాకాలానికి ఉత్తమం..నిమిషాల్లో చర్మం మృదువుగా మెరుస్తుంది
సోపులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా పని చేస్తాయి. ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.
ఫెన్నెల్ డికాషన్ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోంపులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. సోంపును కషాయం చేసి తాగడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
న్యూ ఇయర్ కోసం ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచిస్తున్నారా? మీ కోసం తక్కువ ధరలలో చక్కటి ప్రదేశం
సోంపు నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే జింక్, కాపర్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు.. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఫెన్నెల్ డికాక్షన్ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మలినాలన్నింటిని బయటకు పంపించి.. చర్మాన్ని కొంత కాంతినిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను పెంచి ముడతల సమస్యను దూరం చేస్తాయి.
మరి సోంపు వాటర్ ఎలా చేయాలి..?
రెండు కప్పుల నీటీలో రెండు టీ స్పూన్‌ల సోంపును వేసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత.. రుచి కోసం అందులో కొంచెం బెల్లం లేదంటే తేనె కలపాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఔషధ గుణాలతో నిండిన ఈ నీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం తాగుతుంటే.. శరీరంలో అనేక వ్యాధులు తగ్గిపోతాయి.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Lifestyle