Home /News /life-style /

HEALTH EXPLAINER DOES PULSE OXIMETER RECOGNIZE SKIN COLOUR WHY UK EXPERTS PROBING RACIAL BIAS IN MEDICAL DEVICE MKS

EXPLAINED: వైద్య పరికరాలకూ వర్ణ వివక్ష ఉంటుందా? pulse oximeter పనితీరుపై సంచలన రిపోర్ట్

పల్స్ ఆక్సీమీటర్లపై వివాదం

పల్స్ ఆక్సీమీటర్లపై వివాదం

శరీరంలో ఆక్సిజన్ శాతం ఎంతుందో తెలుసుకోడానికి పల్స్‌ ఆక్సీమీటర్లు వాడుతుంటాం. కరోనా సమయంలో వీటి అవసరం, వాడకం మరింత పెరిగింది. ఇప్పుడు ఆక్సీమీటర్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తికాదు. అయితే, ఆ వైద్య పరికరాలు వాడే వాళ్ల శరీరం రంగును బట్టి భిన్నమైన రీడింగ్స్ ఇస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది..

ఇంకా చదవండి ...
పల్స్‌ ఆక్సీమీటర్లు రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిని తెలియజేస్తాయనే విషయం తెలిసిందే. కరోనా (Coronavirus) సమయంలో చాలా మంది ప్రజలు తమ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకునేందుకు వీటిపైనే ఆధారపడ్డారు. అయితే పల్స్ ఆక్సీమీటర్లలో కచ్చితత్వం లోపిస్తోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పల్స్ ఆక్సీమీటర్లు ముదురు రంగు చర్మం (darker skin colour) ఉన్నవారి విషయంలో తప్పుగా రీడింగ్‌లు చూపిస్తున్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వైద్య పరికరాలపై సమీక్షను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా.. తగ్గనట్లు ఈ పల్స్ ఆక్సీమీటర్లు చూపిస్తే.. వీటిపై ఆధారపడిన వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వీటి రీడింగులను నమ్ముకుని ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారో అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య పరికరాల చుట్టూ ఉన్న భయాందోళనలు ఏంటి? వర్ణ వివక్షత లేదా ఒక జాతి పట్ల పక్షపాత వైఖరి వైద్య పరికరాల్లోకి ఎలా ప్రవేశించింది? పల్స్ ఆక్సిమీటర్లు వాడకపోవడమే ఉత్తమమా? తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

వైద్య పరికరాల చుట్టూ ఉన్న భయాలేంటి?
జ్వరం విషయంలో ధర్మామీటర్లను వినియోగించినట్లు కరోనా విషయంలో పల్స్ ఆక్సీమీటర్లు వినియోగించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే నిపుణుల ప్రకారం ముదురు రంగు చర్మం కలిగిన ప్రజలు విషయంలో ఇవి చూపించే రీడింగ్స్‌ని వాస్తవమైనవిగా పరిగణించకూడదు. వేలికి క్లిప్ గా ధరించే ఆక్సీమీటర్ రక్తంలో ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ సూచిస్తుంది. శ్వాసకోశ సమస్యలకు దారితీసే కరోనా తీవ్రతను తెలుసుకునేందుకు ఆక్సీమీటర్లను విస్తృతంగా ఉపయోగించారు. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదలని చూపిస్తుంది. అయితే అందరూ ఆక్సీమీటర్ల బాగా పనిచేస్తాయనే భావనలోనే ఉన్నారు. కానీ ఈ పరికరాలు ముదురు రంగు చర్మం ఉన్నవారి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ఎక్కువగా అంచనా వేయగలవని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆక్సీమీటర్ల రక్తం ద్వారా కాంతిని పంపడం ద్వారా పనిచేస్తాయి. అయితే చర్మ రంగు ఆధారంగా కాంతి శరీరం లోపలికి ఎక్కువగా లేదా తక్కువగా వెళ్ళొచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. కాంతిని పీల్చుకునే సామర్థ్యం చర్మం రంగుపై ఆధారపడొచ్చని నివేదికలు వివరిస్తున్నాయి. అందుకే ఆక్సీమీటర్లు నల్లజాతి రోగుల్లో (black patients) తక్కువ కచ్చితత్వంతో రీడింగ్స్ చూపిస్తున్నాయని వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. పల్స్ ఆక్సీమీటర్ల అవాస్తవమైన రీడింగ్‌లు ఒక వర్గ ప్రజల ప్రాణాలకు హానిగా మారే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వారేవా జగన్!! మూడు రాజధానుల కొత్త బిల్లులో మహా తెతివి -అంతరాత్మను టేబుల్‌పై పెట్టేసి: somuవైద్య పరికరాలలో పక్షపాతమా?
వైద్య పరికరాల్లో సిస్టమాటిక్ జాత్యహంకారం, పక్షపాతాన్ని పరిశోధించడానికి యూకే యూఎస్ అధికారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని జావిద్ చెప్పారు. ఓ జాతి లేదా జాతి మైనారిటీలకు చెందిన వ్యక్తులు, మహిళల విషయంలోనే హెల్త్ రిజల్ట్స్ ఎందుకు తప్పుగా వస్తున్నాయో తేలుస్తామని చెప్పారు. "ఉద్దేశపూర్వకంగా చేసిన పనివల్ల వైద్య పరికరాలు ఇలా పనిచేస్తున్నాయా? లేదా? అని అనుమానించడం ఇక్కడ అనవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముదురు రంగు ప్రజలు, ఆడవారి విషయంలో ఉన్నత ప్రమాణాలతో పనిచేసే వైద్య పరికరాలు తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు వైద్య పరికరాల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నాం. గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన వైద్య పరికరాలు మాత్రమే మార్కెట్లోకి విడుదల అయ్యేలా జాగ్రత్త పడటంలో కూడా ప్రస్తుత రివ్యూ దోహదపడుతుంది" అని జావిద్ వెల్లడించారు.

Hyderabad : సింహంతో చెలగాటం.. అడుగు జారితే అంతే -Nehru Zoo Parkలో యువకుడి అతి -viral videoపక్షపాతం వైద్య పరికరంలోకి ఎలా ప్రవేశిస్తుంది?
"టెక్నాలజీలను ప్రజలు సృష్టిస్తారు. అలాగే అభివృద్ధి కూడా చేస్తారు. కాబట్టి పక్షపాతం అనేది ఇక్కడ కూడా సమస్య కావచ్చు. వైద్య పరికరాల టెక్నాలజీ కోడ్‌ను ఎవరు రాశారు? ప్రొడక్ట్ ని ఎలా పరీక్షించారు? బోర్డ్‌రూమ్ టేబుల్ చుట్టూ ఎవరు కూర్చున్నారు? వంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనవిగా మారుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఇది మరింత సీరియస్ విషయం అవుతుంది" యూకే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ తెలిపారు. వైద్య రంగంలో పక్షపాత వైఖరి అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ కరోనా తరువాత ఇది సీరియస్ మేటర్ గా మారుతోంది.

Kuppam : చదువుల తల్లి ప్రియ.. ఎంత పని చేశావమ్మా! కష్టాలకు ప్రళయం తోడై.. కుటుంబాన్ని అలా చూడలేక..పల్స్ ఆక్సీమీటర్లు వాడకూడదా?
పల్స్ ఆక్సీమీటర్ల పనితీరు గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. పల్స్ ఆక్సీమీటర్ల పక్షపాత వైఖరి వెలుగు చూశాక నలుపు, ఆసియా, ఇతర జాతి మైనారిటీకు చెందిన రోగులకు యూకే అధికారులు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఈ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు ఆక్సీమీటర్లను వాడొచ్చు. అయితే అత్యవసర పరిస్థితులలో కేవలం వీటిపై ఆధారపడకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.ఇంగ్లండ్‌లోని ప్రభుత్వ ఆరోగ్య డేటా ప్రకారం, తెల్లవారి కంటే కోవిడ్-19 కారణంగా ముదురు రంగు ఉన్నవారు చనిపోయే అవకాశం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆసియా సంతతికి చెందిన వారు వారి తెల్లవారి కంటే 1.5 రెట్లు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉంది. దక్షిణ ఆసియా ప్రజల్లో ఉండే ఒక జన్యువు కారణంగా తీవ్రమైన కరోనా బారిన పడే ప్రమాదం అధికమవుతుందని బ్రిటిష్ పరిశోధకులు తెలిపారు.
First published:

Tags: Color discrimination, Covid, Medical test, Pulse oxygen, Uk

తదుపరి వార్తలు