హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఈ వ్యాయామాలతో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు... ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

ఈ వ్యాయామాలతో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు... ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వ్యాయామాలు అంటారు. ఈ రకమైన వ్యాయామాలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అధిక తీవ్రత ఉండే వ్యాయామాలను ఎక్కువగా చేసేవారిలో జీవక్రియల రేటు తగ్గిపోయే అవకాశం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది.

వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని గత పరిశోధనలు వెల్లడించాయి. కండలు పెంచుకోవడానికి, బరువు తగ్గడానికి కొంతమంది ఎక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలు చేస్తారు. వీటిని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వ్యాయామాలు అంటారు. ఈ రకమైన వ్యాయామాలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అధిక తీవ్రత ఉండే వ్యాయామాలను ఎక్కువగా చేసేవారిలో జీవక్రియల రేటు తగ్గిపోయే అవకాశం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. స్వీడిష్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్సెస్ సంస్థకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మార్చి 18న సెల్ మెటబాలిజం అనే జర్నల్‌లో ప్రచురించారు.

మధ్యస్థంగా చేసే HIIT వ్యాయామాలతో ఎలాంటి సమస్యా ఉండదు. కానీ అదేపనిగా, గంటల తరబడి అధిక తీవ్రత వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల జీవక్రియల రేటు (మెటబాలిజం) తగ్గిపోతుందని పరిశోధకులు తేల్చారు. మొత్తం 11 మందిపై (ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు) ఈ సర్వే చేశారు. వీరితో ప్రతిరోజూ ఎక్ససైజ్ బైక్‌పై అధిక తీవ్రత ఉండే వ్యాయామాలు చేయించారు. ముందు కొన్ని నిమిషాలు వ్యాయామం చేసిన తరువాత విశ్రాంతి ఇచ్చారు. ఇలా క్రమంగా వ్యాయామ సమయం పెంచారు. ప్రతి దశలోనూ వీరి ఆరోగ్యాన్ని, వ్యాయామ ఫలితాలను విశ్లేషించారు.

అదేపనిగా చేస్తే ఇబ్బందులు

ఒక మాదిరి HIIT వర్కవుట్ల వల్ల మంచి వ్యాయామ ఫలితాలు కనిపించాయని పరిశోధనలో కనుగొన్నారు. కానీ ప్రతిరోజూ సుదీర్ఘంగా చేసే HIIT వర్కవుట్ల వల్ల ఆరోగ్యం క్షీణిస్తో౦దని గుర్తించారు. ఒక వారంలో 90 నిమిషాల వరకు చేసే HIIT వర్కవుట్లతో మంచి ఫలితం ఉంటుంది. మధ్యలో విరామం ఇస్తే ఇంకా మంచిదని పరిశోధన తేల్చింది. అయితే ఎక్కువ శక్తిని ఖర్చుచేస్తూ, ప్రతిరోజూ సుదీర్ఘంగా చేసే HIIT వ్యాయామాలు అనారోగ్యాలకు కారణమవుతున్నాయని అధ్యయనం గుర్తించింది. ఒక వారంలో సగటున 152 నిమిషాలకు మించి అధిక తీవ్రత వ్యాయామాలు చేసేవారి రక్తంలో చక్కెర స్థాయులు దెబ్బతినడం, మైటోకాండ్రియా పనిచేయకపోవడం, మెటబాలిజం తగ్గిపోవడం.. వంటి సమస్యలు ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది.

అవసరాన్ని గుర్తించాలి

వీరిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల శరీర కణాల ఆరోగ్యం దెబ్బతిని.. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. వీరందరూ వ్యాయామం చేసే సమయాన్ని తగ్గించిన వెంటనే వారి ఆరోగ్యం మెరుగుపడినట్టు చెప్పారు.


అందువల్ల శరీర తత్వాన్ని, అవసరాన్ని బట్టి అధిక తీవ్రత ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యస్థంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవడం, సుదీర్ఘంగా వ్యాయామం చేయకుండా మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని సూచిస్తున్నారు.

First published:

Tags: Life Style

ఉత్తమ కథలు