Home /News /life-style /

HEALTH EXPERT APPROVED WAYS TO IMPROVE YOUR MENTAL STRENGTH DETAILS HERE GH VB

Mental Strength: ఈ రకంగా చేస్తే.. మీ మానసిక శక్తి పెరుగుతుంది..! ఎలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో కష్టాలు రావడం ఎంతో సహజం. కెరీర్, వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అంత మాత్రాన హైరానా పడిపోకుండా నిశ్చలంగా ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు మన మానసిక స్థితి(Mental Status), ఆలోచన ఏ విధంగా ఉంటుందనే ముఖ్యం.

జీవితంలో కష్టాలు రావడం ఎంతో సహజం. కెరీర్, వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అంత మాత్రాన హైరానా పడిపోకుండా నిశ్చలంగా ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు మన మానసిక స్థితి(Mental Status), ఆలోచన ఏ విధంగా ఉంటుందనే ముఖ్యం. కెరీర్‌ను మీరు అనుకున్న విధంగా విస్తృతంగా ప్లాన్ చేసుకోవచ్చు, అన్ని పకడ్భందీగా ఉన్నాయని మీరనుకోవచ్చు. కానీ అనుకోని రీతిలో ఎదురయ్యే అవాంతరాలను(Obstacles) చూసి ఆగిపోకూడదు. జీవితం మీపై ఎలాంటి సవాళ్లను(Challenges) విసిరినా మీ మానసిక శక్తిని పెంపొందించుకోవాలి. మరి మానసిక శక్తిని మెరుగుపరుచుకోవడానికి నిపుణులు చూపిన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.

మానసిక శక్తి అంటే ఏంటి?
ఎవరికైనా కష్టాలు ఎదురైతే, ఆ సమయంలో నిర్దిష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారు. ఈ వైఖరినే మానసిక శక్తి అని అంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. జీవితంలో వచ్చే ప్రతికూల మలుపులు, సంక్షోభం, ఆర్థిక సమస్యలు, పర్యావరణ కారకాల, ప్రతి మనిషి ఎదుర్కొనే కొన్ని అనివార్యమైన అవరోధాలు. అయితే ఇవి ప్రభావితం చేసే స్థాయి వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. వారి ప్రతిస్పందించే విధానం బట్టి మానసిక బలం ఆధారపడి ఉంటుంది.

Weight Loss-Different Coffees: బరువు తగ్గాలంటే.. కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే.. ఈ డ్రింక్స్ తీసుకోండి..


మానసిక శక్తిని(Mental Strength) ఎలా పెంచుకోవాలి?
మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి ఓ కఠినమైన వ్యాయామ నియమాన్ని పాటించాలి. ఇందులో ప్రధాన నమ్మకాలను అర్థం చేసుకోవాలి. బలాలు, బలహీనతలను గుర్తించడంం, సానుకూల ఆలోచనల కోసం అదనపు స్థలాన్ని సృష్టించడం, భావోద్వేగాలను ప్రసారం చేయడానికి సరైన మార్గాన్ని తెలుసుకోవడం, రోజువారీ కార్యకలాపాలను గమనించడం లాంటివి ఇందులో ఉంటాయి. మానసిక బలాన్ని పెంపొందించడానికి మీ శక్తిని ఎల్లప్పుడూ తెలివిగా ఉపయోగించాలి.

మెదడు శక్తిని వృథా చేయడం వల్ల మీరు నియంత్రించలేని విషయాల గురించి మాట్లాడటం వల్ల మానసిక శక్తి త్వరగా హరించుకుపోతుంది. మీరు పరిష్కరించలేని ప్రతికూల సమస్యల గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, సృజనాత్మక ప్రయత్నాలకు అంత తక్కువ శక్తి మిగులుతుంది. ఉదాహరణకు పెను తుపాను వస్తుందనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఆ సంఘటనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ నియంత్రణలో ఉన్న వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి.

మానసిక శక్తిని ఎలా ఉపయోగించాలి?
ప్రొడక్టివ్ వర్క్స్ కోసం మాత్రమే మీ మానసిక శక్తిని ఉపయోగించాలి. ఉదాహరణకు పాఠశాల రోజుల్లో మీకు ఆసక్తిగా ఉన్న అభిరుచి లేదా చాలా రోజుల క్రితమే మీరు మర్చిపోయిన ఆసక్తిని కనుగొని ఆ కార్యకలాపాలను కనుగొనడానికి ప్రయత్నించాలి. మీ ఆలోచనలు ఉత్పాదకంగా లేనప్పుడు, దాన్ని అభిరుచి వైపు మరల్చడానికి ప్రయత్నించాలి. ఇష్టమైన అభిరుచులు మీరు ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ మీ మనస్సును నిమగ్నం చేస్తుంది. ఎందుకంటే అది మీరు ఇష్టపడే పని కాబట్టి.

Viral Video: కొండ అంచున కారు.. యూ-టర్న్‌ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా

చదువుతూనే ఉండండి..
ఏకాగ్రత పెరగాలంటే ఎంత కష్టమైనా చదవడం మాత్రం ఆపవద్దు. స్వీయ అభివృద్ధిపై పుస్తకాలు చదవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవడంపై మీ అంతర్దృష్టులు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ఉత్పాదకంగా పెంచే వాస్తవాల గురించి మీకు తెలియజేస్తుంది. పఠనంలో నిమగ్నమైన సమయం ఎప్పటికీ వృథా కాదు.

ఇంటరాక్ట్ అవ్వండి.. ఐసోలేషన్‌లో ఉండొద్దు..
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా చాలా మంది ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. అయితే ఇది ఒంటరితనం కాదు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఒకరు నాలుగు గోడల మధ్య పరిమితమైనప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించుకోండి. కమ్యూనిటీ యాక్షన్లలో పాల్గొనండి. మీ ఆలోచనలను పంచుకోండి. విభిన్న అంశాలపై సానుకూలంగా వ్యవహరించండి.
Published by:Veera Babu
First published:

Tags: Health, Health benefits, Life Style, Mental strength

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు