నాజూకైన శరీరం కావాలా.. ఈ చిట్కాలు పాటించండి..

Best Exercises: అసలే ఉరుకులు, పరుగుల జీవితం.. తినడానికే తీరిక ఉండని వేళలు.. వ్యాయామం చేయడం సాధ్యం కాని పరిస్థితి. కాస్తైనా వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు అడ్డదిడ్డంగా పెరుగుతుంది. పొట్ట, నడుము, తొడల్లో కొవ్వు చేరిపోతుంది. అయితే, కొన్ని చిన్న వ్యాయామాలతో కొవ్వును కరిగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

news18-telugu
Updated: August 19, 2019, 5:17 PM IST
నాజూకైన శరీరం కావాలా.. ఈ చిట్కాలు పాటించండి..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అసలే ఉరుకులు, పరుగుల జీవితం.. తినడానికే తీరిక ఉండని వేళలు.. వ్యాయామం చేయడం సాధ్యం కాని పరిస్థితి. కాస్తైనా వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు అడ్డదిడ్డంగా పెరుగుతుంది. పొట్ట, నడుము, తొడల్లో కొవ్వు చేరిపోతుంది. అయితే, కొన్ని చిన్న వ్యాయామాలతో కొవ్వును కరిగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
1. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోండిలా..
నిటారుగా నిల్చొని పొట్టను లోనికి ఒత్తి పట్టి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. కాసేపయ్యాక మెల్లిగా వదులుతూ విశ్రాంతినివ్వాలి. ఇలా పలుమార్లు చేయడం వల్ల కండరాలు యాక్టివేట్ అయ్యి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించి, నాజూగ్గా మార్చేస్తాయి. అయితే, నొప్పి వచ్చినా, ఇబ్బందిగా ఉన్నా ఈ వ్యాయామం చేయకపోవడం మంచిది. తిన్న తర్వాత అస్సలు చేయకూడదు.

2. తొడలు ధ్రుడంగా మారాలంటే..
పొట్ట తర్వాత ఎక్కవగా కొవ్వు తొడల భాగంలోనే చేరిపోతుంది. దీన్ని తగ్గించుకోవడానికి కాలి వేళ్లపై, పిక్కలను సాగదీసేలా నిల్చొవాలి. అలా నాలుగైదు సెకన్ల పాటు ఉండి విశ్రాంతి తీసుకోవాలి. రోజూ 20 నుంచి 25 సార్లు ఇలా చేస్తే తొడలు, పిక్కల ప్రాంతంలో కొవ్వు కరిగిపోతుంది.
3. కండరాలు ధ్రుడంగా మారడం కోసం..


జాయింట్ల వద్ద కండరాలు బిగుతుగా మారితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, మెడను, చేతి మణికట్టును, కాళ్ల జాయింట్ల వద్ద క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్టన్‌లో తిప్పుతూ ఉండాలి. రోజుకు 15 సార్లు చేస్తూ ఉండాలి.4. ముఖం కాంతివంతంగా మారడానికి..
ఫిష్-బ్లో ఎక్సర్‌సైజ్.. నోటి ద్వారా గాలిని తీసుకొని బుగ్గలు బయటికి వచ్చేలా చేయాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. తర్వాత గాలిని వదిలి మరో 30 సెకన్ల పాటు చేయాలి. సెషన్‌కు 10 సార్లు చేస్తూ ఉండాలి. రోజుకు కనీసం రెండు సార్లు చేస్తూ ఉండాలి.
5. పిరుదులు ధ్రుడంగా ఉండటానికి..
నిటారుగా నిల్చొని పిరుదులను 5-10 సెకన్ల పాటు అదిమి పట్టాలి. ఇలా 10 సార్లు చేస్తుండాలి. దానివల్ల కండరాలు యాక్టివేట్ అయ్యి కొవ్వు త్వరగా కరిగే అవకాశాలు ఉన్నాయి.
6. శరీరమంతా ఒకేలా ఉండేందుకు..
పొట్ట, నడుము, పిరుదులు, తొడలు.. ఇలా కొవ్వు త్వరగా పెరిగే భాగాలన్నింటినీ ఒకే సారి కరిగించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడే వ్యాయామం.. మెట్లు ఎక్కి దిగడం. లిఫ్ట్, ఎస్కలేటర్‌ను ఎక్కకుండా మెట్ల మార్గం ద్వారా వెళితే, కొవ్వు కరగడమే కాదు.. శరీరం కింది నుంచి పై దాకా ఒకేలా ఉండి ఆరోగ్యంగా ఉంటారు.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>