మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కొరవడుతున్న నాణ్యత వంటి కారణాలతో అన్ని రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్, అసమగ్ర పని వేళలు, ఒత్తిడి వంటివాటితో పురుషుల్లో సెక్స్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది సెక్స్ సమస్యల బారిన పడి సంతృప్తికర జీవితాన్ని గడపలేక పోతున్నారు. సెక్స్ సమస్యల్లో ప్రధానమైనది అంగస్తంభన సమస్య (Erectile dysfunction (ED)). ఈ సమస్యకు చెక్ పెట్టడానికి నిపుణులు కొన్ని న్యాచురల్ టిప్స్ సూచించారు. అవేంటో తెలుసుకోండి.
వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం
అంగస్తంభన లోపం అంటే పార్టనర్‌తో సెక్స్ చేసే సమయంలో పురుషుడి అంగం గట్టిపడదు. అంగస్తంభన సమస్య కారణంగా చాలా మంది సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఈ సందర్భంలో పురుషుడి పార్టనర్ తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. ఇది వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి వెంటనే ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇది ఏ వయసులోనై రావచ్చు. సెక్స్ చేయాలనే కోరిక లేకపోవడం, ఉద్వేగం, స్కలనం వంటి ఇతర సమస్యలు కారణంగా కూడా అంగస్తంభన లోపం తలెత్తవచ్చు.
రక్త నాళాల్లో సక్రమంగా రక్త ప్రసరణ లేక
సాధారణంగా చాలా మంది సెక్స్ సమస్యలపై ఇతరులతో చర్చించడానికి, డాక్టర్‌ను సంప్రదించడానికి వెనుకడతారు. ఇతరులు ఎగతాళి చేస్తారన్న భయం కారణంగా బయటకు చెప్పుకోకపోవచ్చు. ప్రధానంగా అంగం రక్త నాళాల్లో రక్త ప్రసరణ సరిగా లేకుంటే అంగస్తంభన సమస్య ఉత్పన్నమవుతుంది. డాక్టర్‌ను సంప్రదించడంతో పాటు, కొన్ని ఆరోగ్యకర జీవనశైలి మార్పుల కారణంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
* సమతుల ఆహారం
తినే ఆహారంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, కాయలు, గింజలు, కొవ్వు చేపలు (ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు) డైట్‌లో చేర్చుకుంటే త్వరలోనే మార్పు మీరు గమనించవచ్చు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి. ఫలితంగా శరీరం ఎనర్జీగా ఉంటుంది. దీంతో సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.
* మద్యం, ధూమపానానికి స్వస్తి
తరచూ మద్యం, సిగరేట్ తాగడం వల్ల అంగస్తంభన సమస్య మరింత తీవ్రమవుతుంది. దీంతో వైవాహిక జీవితంలో అనేక సమస్యలు రావచ్చు. మద్యపానం వల్ల కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు. కాబట్టి మద్యం, పొగ తాగడం ఎంత త్వరగా మానేస్తే ఫలితం అంత త్వరగా ఉంటుంది.
* బరువు తగ్గడం
ఊబకాయం లేదా బరువు పెరగడం అంగస్తంభన సమస్యకు ప్రమాద కారకాలుగా గుర్తించారు. అధిక శరీర కొవ్వు అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన బరువు BMI (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్ టెయిన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. దీంతో అంగస్తంభన లోపం లక్షణాలు క్రమంగా తగ్గుతాయి.
* వ్యాయామం
మనస్సు, శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరిగా అవసరం. ఆరు నెలల పాటు, వారానికి నాలుగు రోజులు కనీసం 40 నిమిషాల చొప్పున ఏరోబిక్ ఎక్స్‌సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. దీంతో అంగస్తంభన లోపం మెల్లిమెల్లిగా తగ్గుతుంది. వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్, నడక, సైక్లింగ్, రన్నింగ్ వంటి ప్రాక్టీస్ చేయడం వల్ల అంగస్తంభన సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
* కంటినిండా నిద్ర
తగినంత నిద్ర లేకపోతే మరిసటి రోజు ఉల్లాసంగా ఉండలేరు. ఏ పని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. కంటికి సరిపడ నిద్ర లేకపోతే టెస్టోస్టెరాన్ లెవల్స్ పడిపోతాయి. ఇది చివరకు అంగస్తంభన సమస్యకు దారితీయవచ్చు. కాబట్టి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోండి. దీంతో టెస్టోస్టిరాన్ లెవల్స్ పెరిగి అంగస్తంభన సమస్య సమసిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda tips for healthy lifestyle, Lifestyle, Natural tips