హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Bloating: కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఈ ఆయుర్వేద టీతో చెక్ పెట్టండి..

Bloating: కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఈ ఆయుర్వేద టీతో చెక్ పెట్టండి..

6. మీరు ఏమి తింటారు అనేది ముఖ్యం కానీ మీరు ఎప్పుడు తింటారు అనేది చాలా ముఖ్యం. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగ్గా ఉంచేది స‌మ‌యానికి తిన‌డ‌మే. ఇష్ట మొచ్చిన టైం కాకుండా ఒక నిర్దిష్ట స‌మ‌యంలో తింటే క‌చ్చితంగా మెరుగైన జీర్ణ క్రియ ఉంటుంది.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. మీరు ఏమి తింటారు అనేది ముఖ్యం కానీ మీరు ఎప్పుడు తింటారు అనేది చాలా ముఖ్యం. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగ్గా ఉంచేది స‌మ‌యానికి తిన‌డ‌మే. ఇష్ట మొచ్చిన టైం కాకుండా ఒక నిర్దిష్ట స‌మ‌యంలో తింటే క‌చ్చితంగా మెరుగైన జీర్ణ క్రియ ఉంటుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి.

మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, క్రమరహిత జీవనశైలి కారణంగా కడుపు ఉబ్బరం (Bloating), కడుపులో అసౌకర్యం (stomach discomfort), గ్యాస్ వంటివి సాధారణ సమస్యలుగా మారాయి. కడుపు ఉబ్బరం అనేది జీర్ణ సంబంధ సమస్య. అధిక గ్యాస్ ఉత్పత్తి కారణంగా జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలో ఆటంకాలు ఏర్పడుతూ పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీన్నే కడుపు ఉబ్బరం అంటారు. అతిగా తినడం, వేగంగా తినడం, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మన ఇంట్లో లభించే పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు సహజంగా లభించే పదార్థాలతో చేసిన ఆయుర్వేద టీ సమర్థంగా పనిచేస్తుందట. వాము, ఉప్పు, ఇంగువ (హింగ్, అసఫోటిడా) మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే క్షణాల్లోనే ఈ సమస్య తగ్గిపోతుందట. ఇది బాధితుల పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి ఉదర సంబంధ సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆయుర్వేద టీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

Snoring Trouble: మీ పక్కన వాళ్ల గురకతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వమని చెప్పండి..

* కావాల్సిన పదార్థాలు

ఒక స్పూన్ వాము (అజ్వైన్), చిటికెడు ఇంగువ పొడి, అర స్పూన్ డ్రై అల్లం పొడి లేదా తాజా అల్లం ముక్క ఒకటి తీసుకోవాలి. దీంతోపాటు 5-7 పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి (డ్రై ఆమ్లా పౌడర్) లేదా కాస్త నిమ్మరసం తీసుకోవాలి.

Vegetarian Protein Sources: శాకాహారులకు ఎంతో శక్తినిచ్చే.. హై ప్రొటీన్ ఆహార పదార్థాలు ఇవే..


* ఎలా తయారు చేయాలి?

ఒక గ్లాసు నీటిలో వీటన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై కొన్ని నిమిషాలు మరగబెట్టాలి. ఆ తరువాత వడకట్టి దీన్ని తీసుకోవచ్చు. రాత్రివేళ పడుకునే ముందు ఈ ఆయుర్వేద టీ తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ నివారణ పద్ధతిని కేవలం ఒక చిట్కా మాదిరిగా భావించడం మంచిది. కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.

First published:

Tags: Ayurveda health tips, Health Tips, Stomach Pain

ఉత్తమ కథలు