Sex Education | రోజులో ఏ టైంలో సెక్స్ చేస్తే ఏయే ఫలితాలు ఉంటాయంటే..

Sex Education : ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో సెక్స్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని, అన్ని వేళలా ఒకేలా ఫలితాలు ఉండవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

news18-telugu
Updated: September 13, 2019, 7:03 PM IST
Sex Education | రోజులో ఏ టైంలో సెక్స్ చేస్తే ఏయే ఫలితాలు ఉంటాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ జీవితాన్ని రాత్రి మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారా? లేక డే టైంలో ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు చేస్తే ఏంటి? పని పూర్తి చేశామా.. లేదా.. అనేదే కదా ముఖ్యం అని అనుకుంటున్నారా.. అయితే, మీరు శృంగార జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో సెక్స్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని, అన్ని వేళలా ఒకేలా ఫలితాలు ఉండవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భం దాల్చడానికి ఒక సమయం.. ఆరోగ్యానికి ఒక సమయం.. ఒత్తిడిని తగ్గించేందుకు ఒక సమయం.. ఉంటుందని సవివరంగా చెబుతున్నారు. 90 శాతం మంది భాగస్వాములకు సెక్స్ గురించి పూర్తి అవగాహన ఉండదని, శృంగారం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ సంతృప్తిని, భావప్రాప్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. 50 ఏళ్లు పైబడిన వాళ్లు సెక్స్ చేయకపోతే అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఏ సమయంలో సెక్స్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం 6 గంటలకు.. గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ


పిల్లల్ని కనాలని అనుకుంటున్నారా? అయితే, ఉదయం 6 గంటలకే సెక్స్ చేసేలా అలారం పెట్టుకోండి. ఇంగ్లండ్‌లోని అంగిలా రస్కిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం పూట స్పెర్మ్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజు గడిచిన కొద్దీ వీర్యం నాణ్యతలో తగ్గుదల కనిపిస్తుంది. అందుకే వీలైనంతలో ఉదయం పూట సెక్స్ చేయడం ఉత్తమం. అంత పొద్దున సెక్స్ చేయడమా? అని అనుకుంటున్నారా.. అయితే, రాత్రి 10 గంటల వరకు ఆగాల్సిందే. ఆ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి.

ఉదయం 7:30 గంటలకు.. పురుషుల లైంగిక సామర్థ్యం అనంతం

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది పురుషుల పురుషాంగం నిటారుగా ఉంటుంది. ఉదయం 8 గంటల కంటే ముందు పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆ సమయంలో భాగస్వామిని ప్రేరేపిస్తే మీ సెక్స్ జీవితం మరింత సుఖంగా ఉంటుంది. అంతేకాదు.. ఉదయం పూట పురుషుల కండరాలు గట్టిగా ఉంటాయి. అంటే.. అతడిలో స్టామినా ఎక్కువగా ఉంటుందని అర్థం. అలాంటప్పుడు శృంగారం చేస్తే పడక మంచం విరిగిపోవాల్సిందే.ఉదయం 8:30 గంటలకు.. రోగ నిరోధక శక్తి పెరుగుదల

ఈ సమయంలో ఎలాంటి సెక్స్ చేసినా స్త్రీ, పురుషులిద్దరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్ చేయాలన్న కోరిక లేకపోతే మీ భాగస్వామిని హస్త ప్రయోగం ద్వారా సంతృప్తి పర్చవచ్చు లేక మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఇలా క్రమంగా చేస్తే ఇమ్యునోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి. అది ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట స్నానం చేసేప్పుడు చేసినా మంచిదే.

మధ్యాహ్నం 12:00 గంటలకు.. ఒత్తిడి దూరం

పని ఒత్తిడి తీవ్రమైందా.. మధ్యాహ్న సమయంలో మీ సెక్స్ కోరికలను పెంచుకోవడం మంచిది. మధ్యాహ్న సమయంలో క్రమం తప్పకుండా సెక్స్ చేస్తే రక్త పోటు తగ్గుతుంది. అంతేకాదు.. ఏదైనా భయం కలిగే పనులు చేసేముందు సెక్స్ చేసినా ఆ భయం తగ్గిపోతుంది. ఆ సమయంలో వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేస్తే మెదడు మరింత ఉత్తేజితం అవుతుంది. మెదడులో డొపమైన్ స్థాయులు పెరుగుతాయి.

మధ్యాహ్నం 3:00 గంటలకు.. గుండెకు మంచిది

మధ్యా్హ్నం 3 గంటల సమయంలో సెక్స్ చేయడం స్త్రీ, పురుషులిద్దరికీ మంచిదే. ఇద్దరిలోనూ హార్మోన్ల స్థాయి సమానంగా ఉంటుంది. ఇద్దరి హార్మోన్ల స్థాయికి, సెక్స్‌కు ఆ సమయం సరిగ్గా సరిపోతుంది. భాగస్వాముల మధ్య ఎఫెక్షన్, నమ్మకం పెరుగుతాయి. అది ఆరోగ్యానికి ఆనందదాయకం. ఆ సమయంలో శృంగారం చేస్తే హృద్రోగాలకు కారణమయ్యే కార్టిసాల్ స్థాయులు తగ్గిపోతాయి.

సాయంత్రం 7:00 గంటలకు.. అంతులేని భావప్రాప్తి

సాయంత్రం ఖాళీగా కూర్చోవద్దు. ఈ సమయంలో కొంత ప్రైవసీ తీసుకొని, భాగస్వామితో కలిసి పడక మంచం ఎక్కేయండి. ఒక్కరే ఉంటే.. మీరే స్వంతంగా మీ సెక్స్ కోరికలకు పని చెప్పుకోండి. టెక్సస్‌ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. సాయంత్రం జిమ్‌కు వెళ్లొచ్చాక జననాంగం వద్ద 169 శాతం ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. ఆ సమయంలో సెక్స్ చేస్తే వేగంగా, అంతులేని భావప్రాప్తిని పొందవచ్చు.

రాత్రి 8:00 గంటలకు.. తెలివి పెరుగుదల

యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం.. రాత్రి 8 గంటలకు సెక్స్ చేస్తే మీలో తెలివి తేటలు పెరుగుతాయి. అభిజ్ఞా శక్తి అమితం అవుతుంది. ఆ సమయంలో రెగ్యులర్‌గా శృంగారం చేస్తే మెదడులోని హిప్పోకాంపస్‌ భాగంలో ఎక్కువ కణాలు పుడతాయి. అది ఐక్యూ పెంచేందుకు దోహదం చేస్తుంది. ఆ సమయం దాటిన తర్వాత సెక్స్ కంటే నిద్ర పోవడమే ఉత్తమం.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading