గుడ్డు ఫుల్‌గా తినడం గుండెపై చెడు ప్రభావాన్ని చూపెడుతుందా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

శరీరంలో అనారోగ్య కొలెస్ట్రాల స్థాయి పెరిగితే అది గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రక్త నాళాలలో అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ చేరితే.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ప్రవహించడం కష్టమవుతుంది.

  • Share this:
    శరీరంలో అనారోగ్య కొలెస్ట్రాల స్థాయి పెరిగితే అది గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రక్త నాళాలలో అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ చేరితే.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. నియంత్రణ లేకుండా అనారోగ్య కొలెస్ట్రాలు కలిగిన పదార్థాలు తీసుకోవడం గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. మనం పాటించే డైట్ అనేది మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావాన్ని చూపుతోంది. అందుకే కొలెస్ట్రాల్ పెద్ద మొత్తంలో పెరగకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహాలు ఇస్తారు. అయితే చాలా మంది గుడ్లు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయని భావిస్తున్నారు. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి గుడ్లు తినడం మానేస్తారు. అయితే గుడ్డు తినడం నిజంగానే గుండెకు అనారోగ్యం చేకూరుస్తుందా? లేదా? అనేది తెలుసుకుందాం.

    ఇలాంటి ప్రశ్నలపై సమాధానంగా న్యూట్రిషనిస్ట్ మున్మున్ గణేరివాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. గుడ్డు తినేటప్పుడు చాలా మందికి సొన తినాలా? వద్దా అనే సందేహం ఉంటుంది. అది తినడం వల్ల ఎక్కువగా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతాయని భావిస్తుంటారు. అయితే ఫుల్‌గా గుడ్డు మొత్తం తినేయొచ్చు. లోపలి సొన కూడా తీయక్కర్లేదు. కొలెస్ట్రాల్ ఉంటాయని భావించే గుడ్డు సొన.. ఫాస్పర్ లిపిడ్లకు మంచి సోర్స్. ఇవి బయోక్టివ్ లిపిడ్స్. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ పనితీరుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపెడుతుంది" అని ఆమె పేర్కొన్నారు.






    ఇక, కోడి గుడ్డు.. బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలైన్ల సమాహారం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. అయితే, మితంగా ఇంటేనే అది ఆరోగ్యానికి మంచిది. పరిశోధనల వెల్లడైన వివరాల ప్రకారం రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచింది.
    Published by:Sumanth Kanukula
    First published: