Mushrooms: పుట్టగొడుగుల్ని ఆహారంలో తీసుకుంటే ఇంత లాభమా..? తెలిస్తే అస్సలు వదలరు..!

ప్రతీకాత్మక చిత్రం

Mushrooms: ఎన్నో రకాల పోషక విలువలు ఉండే పుట్టగొడుగుల (Mushrooms)కు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. వీటి ఆరోగ్య ప్రయోజనాల్లో మరొకటి చేరింది.

  • Share this:
ఎన్నో రకాల పోషక విలువలు ఉండే పుట్టగొడుగుల (Mushrooms)కు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. వీటి ఆరోగ్య ప్రయోజనాల్లో మరొకటి చేరింది. ప్రతిరోజూ పుట్టగొడుగులను మితంగా తినడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Penn State College of Medicine) సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని, అకాల మరణం ప్రమాదాన్ని తగ్గిస్తాయని వారు ముందుగా కనుగొన్నారు. తాజా విశ్లేషణలో ఇవి డిప్రెషన్‌ను సైతం దూరం చేస్తాయని గుర్తించారు.

పుట్టగొడుగులను మితంగా ఆహారంలో తీసుకుంటే డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించారు. మొత్తం 24,000 మంది అమెరికన్లపై ఈ పరిశోధన నిర్వహించారు. 2005 నుంచి 2016 మధ్య వీరి ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డేటాను పరిశీలించారు.

సేకరించిన డేటా ఆధారంగా.. రోజుకు సుమారు 4.9 గ్రాముల పుట్టగొడుగులను ఒక మోస్తరు మొత్తంలో తినేవారిలో డిప్రెషన్ రేటు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇందులో పుట్టగొడుగుల మధ్యస్థ వినియోగం అనేది కీలకంగా నిలిచింది. ఎందుకంటే మితమైన వినియోగం (ప్రతిరోజు కనీసం 19.6 గ్రాములు) మించి వీటిని తీసుకునే వారిలో డిప్రెషన్‌ తగ్గుదల లేదని నిర్ధారణకు వచ్చారు.

ఇది కూడా చదవండి : ఈ కొలతల ప్రకారం అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..!

* పుట్టగొడుగుల ప్రత్యేకత ఏంటి?
పుట్టగొగుల శిలీంధ్రాల్లో ఉండే యాంటీ డిప్రెసెంట్‌ లక్షణాలు డిప్రెషన్‌ను దూరం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు అధ్యయన బృంద సభ్యులు, ప్రధాన రచయిత డాక్టర్ జిబ్రిల్ బా (Dr. Djibril Ba). వీటిలో సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ అయిన ఎర్గోథియోనిన్ అనే ఎమినో యాసిడ్ అధిక సాంద్రతలో ఉంటుంటుందన్నారు. ఈ యాసిడ్ స్థాయిలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని (oxidative stress) తగ్గించడంలో సహాయపడవచ్చని తెలిపారు. ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందని డాక్టర్ బా వివరించారు.

ఇది కూడా చదవండి : దీపావళికి ఏ లెహంగా కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ కలర్‌ కాంబినేషన్‌..!

పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియంకు సైతం డిప్రెషన్‌ను నివారించే లక్షణాలు ఉంటాయి. పుట్టగొడుగులు మానవుల్లో డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడే కొన్ని సహజ ప్రక్రియలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఈ సమస్య బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
Published by:Sridhar Reddy
First published: