Home /News /life-style /

HEALTH EAT CURRY CHUTNEY FOR HEALTHY HAIR GROWTH THIS RECIPE IS FOR YOU RNK

Chutney recipy: హెల్తీ హెయిర్ గ్రోత్ కోసం కరివేపాకు చట్నీ తినండి...మీ కోసమే ఈ రెసిపీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chutney recipy: కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకే కరివేపాకును ఆహారంలో కలుపుతారు. కానీ చాలాసార్లు తినకుండా పక్కన పెట్టేవాళ్లు చాలామందే ఉంటారు. అందుకే చట్నీలా గ్రైండ్ చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఇది ముఖ్యంగా పిల్లలకు ఇవ్వవచ్చు.

ఇంకా చదవండి ...
Chutney recipy:  ఉదయాన్నే ఏదో ఒక స్నాక్స్ (Snacks) తప్పనిసరిగా చేసుకుంటాం. దానికి చట్నీలు వగైరాకు కూడా తయారు చేయకతప్పదు. ఏదో ఒక చట్నీ బదులు వారంలో ఒకసారైనా తగిన పోషకాలు ఉన్న వస్తువులు జత చేసి హెల్తీ చట్నీ (Chutney) ని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా కరివేపాకును వంటల్లో కలిపి వండుతారు. కానీ చాలాసార్లు వాటిని తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. అందుకే చట్నీలా గ్రైండ్ చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఇది ముఖ్యంగా పిల్లలకు ఇవ్వవచ్చు.


ఇది కూడా చదవండి: గర్భధారణను సూచించే 6 ప్రారంభ లక్షణాలు ఇవే...!


కావాల్సిన పదార్థాలు:
నూనె - 1 స్పూన్
నువ్వులు - 1 స్పూన్
తురిమిన కొబ్బరి - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 3-4
కరివేపాకు - 1 పిడికెడు సైజు
కొత్తిమీర - 1/2
అల్లం - 1/2 ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
టొమాటో - చిన్నది 1

తాలింపు దినుసులు:
నెయ్యి - 1 స్పూన్
ఆవాలు - 1/2 tsp
జీలకర్ర - 1/4 tsp
కరివేపాకు - కొద్దిగా

ఇది కూడా చదవండి: 99 శాతం ఫెయిల్... మీరు కేవలం ఒక్క అగ్గిపుల్లను జరిపి లెక్కను సరిచేయగలరా..?




రెసిపీ:
ముందుగా బాణలిలో నూనె వేసి అది కాగిన తర్వాత నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి.
ఇవి వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కూడా వేసి బాగా వేయించాలి.
చివరగా టొమాటో వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత వీటిని పక్కనపెట్టి ఆరనివ్వాలి.
ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి అవసరమైనంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
దీన్ని ఒక గిన్నెలో పోసి మసాలా దినుసులతో తాలింపు వేసి చట్నీలో పోస్తే కరివేపాకు చట్నీ రెడీ.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Renuka Godugu
First published:

Tags: Hair fall, Recipes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు