Sexual Wellness: కరోనా సమయంలో శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

ప్రతీకాత్మక చిత్రం

Sexual Wellness: సాధారణంగా లైంగిక ఆరోగ్యం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఏవైనా సెక్సువల్ సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపరు. కరోనా నేపథ్యంలో అసలు ఇలాంటి అంశాల ప్రస్తావనే కరువైందని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
సాధారణంగా లైంగిక ఆరోగ్యం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఏవైనా సెక్సువల్ సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపరు. కరోనా నేపథ్యంలో అసలు ఇలాంటి అంశాల ప్రస్తావనే కరువైందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో సెక్స్ గురించి విస్తృతంగా ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ.. సరైన సమాచారాన్ని అందిస్తున్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ సరన్ష్ జైన్. కోవిడ్-19 సమయంలో సురక్షితమైన శృంగారంలో పాల్గొనేందుకు అనుసరించాల్సిన ఉత్తమ మార్గాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డా. సరన్ష్ సూచించారు. అవేంటో చూద్దాం.

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..


శృంగారానికి ముందు భౌతిక దూరం
సెక్స్ లో పాల్గొనే ముందు భార్యాభర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముందస్తుగా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇందుకు కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత బయట ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా భార్యాభర్తలు ఇంటి దగ్గరే ఉన్నట్లయితే.. వారు శృంగారంలో పాల్గొనవచ్చు. కరోనా వైరస్ సోకనప్పుడు.. సెక్స్ లో పాల్గొంటే ఎలాంటి రిస్క్ ఉండదని డా. సరన్ష్ జైన్ స్పష్టం చేశారు.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


శృంగారం ద్వారా కరోనా సోకుతుందా..?
కోవిడ్ 19 అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి (STD) కాదు. ఇప్పటివరకైతే వీర్యం లేదా వజైనల్ ఫ్లూయిడ్ (vaginal fluid) లో వైరస్ ఉన్నట్టు కనుగొనలేదు. అయితే టీకా తీసుకోకపోయినా.. సెక్సువల్ పార్ట్‌నర్‌ టీకా తీసుకున్నట్లు తెలియకపోయినా శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే కరోనా లాలాజలం లేదా శ్లేష్మం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వైరస్ ఉన్న భాగస్వామికి దగ్గరికి వెళ్తే.. కరోనా సోకే ప్రమాదం ఉంది. ముద్దులు, కౌగిలింతలతో సహా ఇతరులతో సెక్స్ చేస్తే కరోనా సోకే ప్రమాదం ఎక్కువ.

పాటించాల్సిన జాగ్రత్తలు..
కరోనా సమయంలో సెక్స్ చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించి వైరస్ బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇందుకుగాను మీరు ముద్దులు, శృంగారంలో పాల్గొనకుండా.. రొమాంటిక్ ఫోర్‌ప్లేలో పాల్గొనవచ్చు. మీతో నివసించే వారితో శృంగారంలో పాల్గొంటే ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ మీ భాగస్వామికి అనారోగ్యంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచడం మంచిది. దీని అర్థం ఈ సమయంలో సెక్స్, రొమాంటిక్ టచింగ్, ముద్దులకు దూరంగా ఉండాలి. సెక్స్ చేయడానికి ముందు.. సెక్స్ తర్వాత వ్యక్తిగత శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. కోవిడ్ 19 ఉపరితలాలపై గంటల తరబడి జీవించగలదు కాబట్టి సెక్స్ లో పాల్గొనే ముందు చేతులతో సహా ప్రతి ఒక్క భాగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముద్దులు నివారించడానికి.. అలాగే లాలాజలం, ఇతర రకాల స్రావాలను తాకకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్, రబ్బరు హ్యాండ్స్ గ్లోవ్స్, కండోమ్‌లు ఉపయోగించాలి.

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..


రిస్కీ శృంగార కార్యకలాపాలకు దూరంగా ఉండండి..
కరోనా సమయంలో టిండర్ డేట్ (Tinder date) కి వెళ్లడం లేదా అసురక్షిత శృంగారం వంటివి చేయకూడదు. సెక్సువల్ పార్ట్‌నర్‌ తొందర పెట్టినా.. సురక్షితమైన సమయం వరకు వేచి చూడండి. ఒకవేళ ఇప్పటికే శృంగారంలో పాల్గొన్నట్లయితే.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఫేస్ మాస్క్ ధరించిన సమయంలో ముద్దు పెట్టుకున్నా సరే కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కరోనా ఇంకా అంతం కాలేదు కాబట్టి మీతో పాటు మీ చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కాపాడడం మీ బాధ్యతగా గుర్తుంచుకోండి.
Published by:Veera Babu
First published: