Alcohol: కుర్రాళ్లం కదా.. మనకేం అవుద్దని.. తెగ తాగుతున్నారా.. ఇది తెలిస్తే మందు వాసన కూడా చూడరు..

ప్రతీకాత్మక చిత్రం

మన శరీరంలో ఉండే గుప్పెడంత గుండె నిరంతరాయంగా శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంటుంది. గుండె పనితీరులో సమస్యలు తలెత్తితే.. ప్రత్యక్ష నరకం అనుభవించక తప్పదు. చిన్నతనం నుంచి యుక్త వయసు వరకు మనం పాటించే అలవాట్లపై గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

  • Share this:
మన శరీరంలో ఉండే గుప్పెడంత గుండె నిరంతరాయంగా శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంటుంది. గుండె పనితీరులో సమస్యలు తలెత్తితే.. ప్రత్యక్ష నరకం అనుభవించక తప్పదు. చిన్నతనం నుంచి యుక్త వయసు వరకు మనం పాటించే అలవాట్లపై గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కౌమారదశలో ఉన్న పిల్లలు, యుక్తవయస్కులు తమ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించిన తాజా అధ్యయనం ఒకటి మద్యం ప్రియులను హెచ్చరిస్తోంది. కౌమారదశ నుంచే మద్యపానం సేవించడం ప్రారంభిస్తే హృదయ సంబంధిత రోగాలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు.

చిన్నతనం నుంచి యుక్తవయస్సు వరకు మద్యం సేవించడం వల్ల ధమనులు శరవేగంగా గట్టిపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ధమనులు గట్టిపడడం(Artery Stiffness) వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఈ వివరాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ESC)కి నివే 2021 ఈవెంట్‌లో సమర్పించారు.

యుక్తవయస్కులు ఎక్కువగా మద్యం తాగితే వేగంగా ధమనుల గోడలు మందగిస్తాయని చెప్పడానికి కొన్ని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అధ్యయన రచయిత హ్యూగో వాల్‌ఫోర్డ్ వెల్లడించారు. ఇతను యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో మెడికల్ స్టూడెంట్‌గా ఉన్నారు. యుక్తవయస్కుల్లో అనారోగ్యకరమైన ప్రవర్తన గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని హ్యూగో వివరించారు.

మందంగా తయారైన ధమనులు గుండె జబ్బులు, గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఎక్కువ. మద్యపానం సేవించడం వంటి అలవాట్లు ధమని మందంగా తయారవ్వడాన్ని వేగవంతం చేస్తాయి. ధూమపానం, మద్యపానం అనేది టీనేజర్లలో ధమనులు మందంగా తయారు కావడానికి దారితీస్తాయని గత అధ్యయనంలో కూడా వెల్లడైంది.

* అధ్యయనం ఎలా చేశారు?
మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్న 17 నుంచి 24 ఏళ్ల వయస్కులలో ఆర్టరీ స్టిఫ్ నెస్ ఎలా మారుతుందనే దానిపై అధ్యయనం దృష్టిసారించింది. ఈ అధ్యయనంలో అవాన్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్(ALSPAC)కు చెందిన 17 - 24 ఏళ్ల వయస్సు గల 1,655 మంది పాల్గొన్నారు. ఆల్కహాల్, ధూమపాన వినియోగాన్ని 17-24 ఏళ్ల వ్యక్తులలో రెండు సార్లు ఫలితాలను సేకరించారు. ఫలితాలను మిళితం చేసి ఫైనల్ రిజల్ట్ ని రూపొందించారు.

ఎన్నడూ మద్యం తాగనివారు, రోజుకి 4 డ్రింక్స్ లేదా తక్కువ తాగేవారు(మీడియం), రోజుకి 5 కంటే ఎక్కువ డ్రింక్స్ తాగేవారిని మూడు వర్గాలుగా విభజించారు. అలాగే ధూమపానం ఎప్పుడూ చేయనివారు.. రోజుకు 10 కంటే తక్కువ సిగరెట్లు తాగేవారు.. ప్రతిరోజూ 10 లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారిని మూడు వర్గాలుగా విభజించారు. కరోటిడ్-ఫెమోరల్ పల్స్ వేవ్ వెలాసిటీ అని పిలిచే నాన్-ఇన్వాసివ్ టెక్నిక్ ఉపయోగించి 17-24 ఏళ్ళ వయస్కులలో ధమని దృఢత్వాన్ని అంచనా వేశారు. యుక్తవయసు వారిలో సంభవించే గుండె రుగ్మతలను ముందస్తుగా అంచనా వేయడంలో కరోటిడ్-ఫెమోరల్ పల్స్ వేవ్ వెలాసిటీ శక్తివంతమైన ప్రిడిక్టర్ గా పేరొందింది.

ఇది కూడా చదవండి: Married Woman: ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి భార్య దొరకాలి.. కానీ ఏం లాభం.. ఆమెకిలా జరిగింది..

* పరిశోధనలో ఏం తేలింది?
పరిశోధకులు ధూమపానం, మద్యపానం అలవాట్లు, ధమనుల దృఢత్వం మధ్య మార్పులను పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్, రక్తపోటు, లోడెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్, బ్లడ్ గ్లూకోజ్, C- రియాక్టివ్ ప్రోటీన్ వంటి అంశాలతోపాటు వయస్సు, లింగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనాలు కొనసాగించారు.

పార్టిసిపెంట్లలో ఎన్నడూ మద్యం తాగిన వారు 7%.. మీడియం లెవల్లో తాగేవారు 52%.. అధికంగా తాగేవారు 41% గా ఉన్నారు. ఎన్నడూ ధూమపానం చెయ్యనివారు 37%.. గతంలో చేసినవారు 35%.. మీడియం గ్రూప్ వారు 23%.. అత్యధికంగా ధూమపానం చేసేవారు 5%గా ఉన్నారు. అయితే ఆర్టరీ స్టిఫ్నెస్ అనేది ఆడవారితో పోలిస్తే మగవారిలో సగటున 10.3% ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. అయితే ఆల్కహాల్ తాగే వారిలో ఆర్టరీ స్టిఫ్నెస్ పెరిగిందని పరిశోధనలో తేలింది. సగటు మద్యపాన స్కోర్‌తో పోల్చుకుంటే.. ఎక్కువ మద్యపానం తాగుతున్నా కొద్దీ ధమనుల మందం పెరిగిందని పరిశోధకులు గుర్తించారు.

* వారికి ప్రమాదం తక్కువ..
సగటు ధూమపాన స్కోర్‌ని పరిగణలోకి తీసుకుంటే ధమనుల దృఢత్వంలో పెరుగుదల కనిపించలేదని పరిశోధకులు తెలుసుకున్నారు. అధికంగా ధూమపానం చేసేవారిలో ధమనుల దృఢత్వం పెరిగిందని.. ముఖ్యంగా మహిళల్లో మాత్రమే ఆర్టరీ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మునుపెన్నడూ ధూమపానం చేయని వారు.. గతంలో ధూమపానం చేసినవారి ఆర్టరీ స్టిఫ్నెస్ లో ఎటువంటి మార్పు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.

* దురలవాట్లు మానేస్తే ప్రయోజనం
ఎక్కువగా ధూమపానం చేసే యువతీయువకుల్లో ధమనులు పాడైపోతాయని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వాల్‌ఫోర్డ్ తెలిపారు. చిన్నతనంలోనే ఈ అలవాట్లను మానుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వివరించారు. యుక్తవయస్కులలో ఇటువంటి అలవాట్లు గుండె జబ్బులు, పక్షవాతానికి దారి తీస్తాయని హెచ్చరించారు.
Published by:Sambasiva Reddy
First published: