Fructose: పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా..? ఫ్రక్టోజ్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమేనట..

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉండే వస్తువులతో పోల్చితే పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చాలామంది భావిస్తారు. ఇది నిజమే అయినా.. ఫ్రక్టోజ్ ను ఎక్కువగా తీసుకుంటే అనార్థాలే ఎక్కువని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

  • News18
  • Last Updated :
  • Share this:
సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉండే వస్తువులతో పోల్చితే పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చాలామంది భావిస్తారు. ఇది నిజమే అయినా ఎక్కువ మోతాదులో పండ్ల రసాలు తాగడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. దీనికి ఇందులో ఎక్కువగా ఉండే ఫ్రక్టోస్ కారణం. పండ్లు, తేనె వంటివాటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉన్న పదార్థాలంటే షుగరీ డ్రింక్స్, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఫ్రక్టోస్ అతిగా ఉన్న ఇలాంటి ఆహారాలు తినడం వల్ల ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలు ఈ సమస్యలకు బలవ్వటానికి ప్రధాన కారణం అసలు షుగర్, ఫ్రక్టోస్ వంటివి ఏమిటో కూడా తెలియకుండా తమకు నచ్చిన పదార్థాలు లొట్టలేసుకుని అతిగా తినేస్తుండటమే. అసలు మనం ఏంతింటున్నాం.. అందులో ఉన్న ఫైబర్ ఎంత, విటమిన్లు, మినరల్స్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేకుండా నోటి రుచికి తగ్గట్టు లాగించేస్తున్నాం.

వీటిలో ఎక్కువగా ఉండే ఫ్రక్టోస్ రిచ్ ఫుడ్ వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతిని తరచూ అనారోగ్యాల పాలవుతున్నారట. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ కు కూడా ఇది దారితీస్తుంది. ఇలా తరచూ ఇన్ఫ్లమేషన్ బారిన పడితే పలు శరీర అవయవాల్లోని కణాలు దెబ్బతిని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులైపోతాం. మధుమేహం, ఊబకాయానికి ఫ్రక్టోస్ లెవెల్స్ తో ప్రత్యక్ష సంబంధముందంటూ బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ తాజాగా తన పరిశోధనలో గుర్తించింది. అసలు కొన్ని ఆహారపదార్థాలు తింటే అనారోగ్యం ఎందుకు వస్తుందన్న రహస్యం వీడేలా ఫ్రక్టోస్ దుష్ప్రభావాన్ని శాస్త్త్రవేత్తలు గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం


HFCS అంటే ఏమిటో తెలుసుకోండి..

హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (HFCS)ని సోడాలు, క్యాడీలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో HFCS స్థాయిలు తగ్గించేలా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు తేకపోతే ప్రజారోగ్యం భవిష్యత్తులో మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవటానికే మొగ్గుచూపాలని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు. బాక్స్డ్ ఫుడ్ కు దూరంగా మీరే మీకు నచ్చిన కూరగాయలు, పళ్లు తెచ్చుకుని వాటితో మీకు నచ్చిన వంటలను వండుకు తింటే ఈ సమస్యకు చెక్ పెట్టినట్టే. మన శరీరంలో చక్కెర స్థాయిలను అసాధారణంగా పెంచే ఆహారంతో గుండె జబ్బులు వస్తాయి, హై షుగర్ లెవెల్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, అధిక సోడియం, జంకీ అడిటివ్స్ అయిన ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ విపరీతంగా పెరిగి మన శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ కుప్పకూలుతుంది. దీంతో మనపై రోగాలు దాడి చేస్తాయి.

ప్రత్యామ్నాయాలతో కొంప మునుగుతుంది..

కొందరు చక్కెరకు బదులు బెల్లం, కండ చక్కెర, తేనె వంటివి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ తేనె, బెల్లం కూడా సహజసిద్ధంగా తయారైనవై ఉండాలి కానీ వీటిని కృత్రిమంగా, రసాయనాలతో తయారు చేసినవిగా ఉండరాదు. పైపెచ్చు వీటిలో కూడా ఫ్రక్టోస్ నిల్వలు ఉంటాయి అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి మంచిదంటూ ఫుల్ గా లాగించేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రత్యామ్నాయాలను కూడా అతిగా తినకుండా పరిమితంగా తిన్నప్పుడే మంచి జరుగుతుందనే విషయాన్ని విస్మరించరాదు. ఉదాహరణకు షుగర్ పేషంట్లు బెల్లం తినచ్చని, తేనె తీసుకోవచ్చని అతిగా తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదు.
Published by:Srinivas Munigala
First published: