Home /News /life-style /

Foods and Habits: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని భయపడుతున్నారా ?.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..

Foods and Habits: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని భయపడుతున్నారా ?.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని ఆహారాలు, మంచి అలవాట్లను డైలీ రొటీన్‌లో చేర్చుకోవడం ద్వారా ఎన్ని కరోనా వేవ్‌లనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారం, అలవాట్లు ఏంటో చూద్దాం.

భారతదేశంలో కరోనా మిగిల్చిన విషాదకర స్మృతులు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి. సెకండ్ వేవ్ విజృంభించినప్పుడు చాలా మంది రోగులు ఆస్పత్రి మెట్లుపైనే ప్రాణాలు విడిచారు. మళ్లీ అలాంటి హృదయవిదారకమైన దృశ్యాలు చూడకూడదని యావత్ భారతదేశం కోరుకుంటున్న నేపథ్యంలో ఒమిక్రాన్‌ రూపంలో మరో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ కరోనా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించగలదని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో భారతదేశంలో థర్డ్ వేవ్ వస్తుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, అన్ని జాగ్రత్తలు పాటించడం అనివార్యంగా మారింది. అయితే కొన్ని ఆహారాలు, మంచి అలవాట్లను డైలీ రొటీన్‌లో చేర్చుకోవడం ద్వారా ఎన్ని కరోనా వేవ్‌లనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారం, అలవాట్లు ఏంటో చూద్దాం.

రోగనిరోధక వ్యవస్థను ఎలా పెంచాలి?
కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించడంతో పాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని లైఫ్ లాంగ్ డైట్ గా మార్చుకోవాలి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానాన్ని కూడా జీవితాంతం పాటించేలా లక్ష్యం పెట్టుకోవాలి. జీవనశైలిని మార్చుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకేసారి అత్యంత కఠిన వర్కవుట్‌లను చేయకూడదు. వైద్యుడిని సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోడరేట్ ఎక్సర్‌సైజులు చేస్తూ రోజంతా యాక్టివ్‌‌గా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజులో వీలైనంత సమయం నడుస్తూ ఉండటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కొద్దిపాటి జీవనశైలి మార్పులతో ప్రయోజనం శూన్యం
కోవిడ్ వ్యాప్తి చెందుతున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే పూర్తి అలసత్వంతో ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రస్తుత పరిస్థితుల్లో మీ శరీరాన్ని, రోగనిరోధక వ్యవస్థను ఎలాంటి వైరస్ తోనైనా పోరాడేలా సంసిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మీరు మీ లైఫ్‌స్టైల్ మార్చుకోవాలి. మీ ఆహారంలో హెల్దీ ఫుడ్ ని చేర్చుకోవాలి. మీ రోగనిరోధక శక్తిని ఎక్కువకాలం కాపాడుకునేలా ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లను పాటించడం తప్పనిసరి.

చక్కెర, ఉప్పు తగ్గించండి
పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, విత్తనాలు వంటి ఆహారాల్లో మీ రోగనిరోధక వ్యవస్థకు పెంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆహారాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. శరీరంలో గడ్డలు, వాపుగా మారే అస్థిర సమ్మేళనాలను తొలగించడంలో పోషకాలు సమర్థవంతంగా పని చేస్తాయి. రకరకాల వ్యాధులతో ముడిపడి ఉన్న వాపులను, గడ్డలను తగ్గించగల శక్తి సంపూర్ణ ఆహార పదార్థాలలోని పోషకాలకు ఉంటుంది. అలాగే చక్కెర, ఉప్పును మితంగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తీసుకుంటే శరీరానికి విషంగా మారి ప్రమాదం ఉంది.

చక్కటి నిద్ర అవసరం
కంటి నిండా నిద్ర కరువైతే రోగ నిరోధక శక్తి అత్యంత బలహీనంగా తయారవుతుంది. అందుకే రోజూ చక్కటి నిద్ర అత్యావశ్యకం. నిద్ర, రోగనిరోధక వ్యవస్థల మధ్య సంబంధం ఉందని అనేక అధ్యయనాల్లో ఉందని తేలింది. కాబట్టి మీరు రోజూ చక్కగా నిద్రపోండి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను కలవండి.

Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

ఒత్తిడిని నియంత్రించండి
ఒత్తిడి అనేది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ఒత్తిడిని నియంత్రించడంలో విఫలమైతే.. రోగనిరోధక వ్యవస్థ పతనమవుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తికి, ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు తేల్చాయి. అందుకే, సాధ్యమైనంతవరకు ఒత్తిడికి లోనవకుండా జాగ్రత్తపడండి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Corona third wave, Immunity, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు