Home /News /life-style /

HEALTH DO THESE SLEEP EXERCISES GOING BEFORE TO BED AND WILL HAVE THE GOOD RESULTS AK GH

Sleep Exercises: రాత్రి పడుకునే ముందు ఈ వ్యాయామాలు చేయండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Sleep Exercises: చక్కటి స్ట్రెచింగ్ వ్యాయామాలు వీటన్నింటికంటే బాగా పనిచేస్తాయట. దీని వల్ల శరీరంపై ఉన్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుందట. మరి, కంటి నిండా నిద్రపోవడానికి ఏయే స్ట్రెచింగ్స్ చేయాలంటే..

సాధారణంగా చిన్న పిల్లలు ఎంతో హాయిగా నిద్రపోతారు.. వారికి ఎలాంటి ఒత్తిడీ లేకపోవడం, పగలంతా ఆటలతో అలసిపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. కానీ వయసు పెరిగే కొద్దీ నిద్ర సమయం తగ్గుతూ వస్తుంది. కుటుంబం, ఉద్యోగం వంటి చోట్ల ఒత్తిళ్లు, ఇతర సమస్యలు, అనారోగ్యం వంటివి కూడా నిద్ర పట్టకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే నిద్రకు ఉపక్రమించే ముందు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే హాయిగా పిల్లల్లా నిద్రపోవచ్చు అంటున్నారు డాక్టర్లు.. దీనికోసం రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే స్నానం చేసి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, భోజనం చేయడం, రెండు గంటల ముందు నుంచి ఫోన్, టీవీ వంటివాటికి దూరంగా ఉండడం వంటివి చేయాలి. దీంతో పాటు రాత్రి హాయైన నిద్ర కోసం ఛామొమైల్ టీ వంటివి కూడా ఉపయోగపడతాయి. అయితే చక్కటి స్ట్రెచింగ్ వ్యాయామాలు వీటన్నింటికంటే బాగా పనిచేస్తాయట. దీని వల్ల శరీరంపై ఉన్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుందట. మరి, కంటి నిండా నిద్రపోవడానికి ఏయే స్ట్రెచింగ్స్ చేయాలంటే..

శవాసనం
శవాసనం వేయడం వల్ల శరీరంతో పాటు మెదడు కూడా రిలాక్స్ అవుతుంది. అలసట, డిప్రెషన్, ఇతర టెన్షన్లు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ. ఇది నిద్రలేమి వంటి సమస్యలను కూడా దూరంగా ఉంచి మంచి నిద్రను అందిస్తుంది. దీనికోసం కాళ్లు, చేతులు చాపి కింద పడుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి దీర్ఘంగా గాలి పీల్చడం, వదలడం చేస్తుండాలి.

విల్లులా వంచండి..
ఉదయమంతా కూర్చొని ఉండడం లేదా నిలబడే ఉండడం వల్ల మీ నడుము, వెన్నముక అలసిపోయి ఉంటాయి. అందుకే పడుకొని శరీరాన్ని చేతులపై భారం వేస్తూ లేపి వెనక్కి విల్లులా వంచి కొన్ని సెకన్ల పాటు ఉంచి ఆ తర్వాత తిరిగి మామూలుగా పడుకోండి. ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల ఒత్తిడి, అలసట తగ్గుతాయి. ఇది మీ మెదడును కూడా రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి నిద్ర సులువుగా పట్టేలా చేస్తుంది.

ముందుకు వంగండి
కాళ్లు చాపుకొని కూర్చొండి. చేతులతో పాదాలను పట్టుకొని ముందుకు వంగి తలను కూడా పాదాలకు ఆనించండి. ఇలా చేయడం వల్ల నడుము, వెన్నుముక, పొట్ట, ఛాతి భాగాల్లో ఏదైనా సమస్య ఉంటే తగ్గుతుంది. ఒత్తిడి, యాంగ్లైటీ వంటివి కూడా తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది కాబట్టి దీనివల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోయే వీలుంటుంది.

కౌగిలింత కూడా..
ఎప్పుడైనా మిమ్మల్ని మీరు కౌగిలించుకున్నారా? ఏదైనా మంచి పని చేసినప్పుడైనా చేయలేదు కదూ.. కానీ ఇప్పుడు చేయండి. దీనివల్ల మీకు హాయిగా నిద్ర పడుతుంది. ఎడమ చేతిని కుడి వైపు, కుడి చేతిని ఎడమ వైపు ఉంచి మిమ్మల్ని మీరు గట్టిగా హత్తుకోండి. దీనివల్ల రోజంతా కూర్చోవడం, పనులు చేయడం వల్ల భుజాలు, చేతులకు వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది.

చిన్న పిల్లల్లా
కాళ్లు వెనక్కి ఉంచి పద్మాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత చేతులు ముందుకు చాపి నేలను తాకించాలి. తలను కూడా ముందు వంచి కింద ఆనించాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల ఛాతి, వెన్నుముక, భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ కూడా చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి నిద్ర హాయిగా పడుతుంది.

మెడకి వ్యాయామం
సాధారణంగా రోజంతా మనం మెడను రకరకాలుగా వంచుతూ.. వివిధ దిక్కుల్లో తిప్పుతూ ఉంటాం. దీంతో మెడ, తలపై చాలా ఒత్తిడి పడుతుంది. మెడను ఒకవైపు తిప్పి మరో వైపున అరచేతులు ఉంచి భుజాలకు అనించేలా వంచడం వల్ల మెడ నొప్పి తగ్గుతుంది. దీనివల్ల మెడ, తల, భుజాల దగ్గర ఏదైనా నొప్పి ఉన్నా తగ్గుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Sleep

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు