HEALTH DISCRIMINATION TAKES TOLL ON MENTAL HEALTH OF YOUNG ADULTS SAYS STUDY VB
Mental Health: వివక్ష ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలుసా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
ప్రతీకాత్మక చిత్రం
Mental Health: వివక్ష అనేది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఇది జాతి, రంగు, శరీరం లేదా లింగం పేరుతో ఉండవచ్చు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ఇటువంటి వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది.
వివక్ష(Discrimination) అనేది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు(Peoples) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఇది జాతి, రంగు, శరీరం లేదా లింగం పేరుతో ఉండవచ్చు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ఇటువంటి వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పుడు USలో జరిగిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. లింగం, రంగు, శరీరం లేదా జాతి ఆధారంగా వివక్షకు గురైన యువకులు ఇతరులతో పోలిస్తే ప్రవర్తనా మరియు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది. ఈ రకమైన మానసిక ఆరోగ్య సమస్యలు వారిలో ఎక్కువ కాలం కనిపించే అవకాశం ఉందని అధ్యయనం ద్వారా తెలిసింది.
1834లో, పరిశోధకులు పదేళ్ల అమెరికన్ హెల్త్ డేటాను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఈ అధ్యయనం కోసం ఎంపకి చేశారు. ఒక వ్యక్తి ఏదైనా వివక్షను అనుభవిస్తే, అది వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనలు
పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనంలో 2007 నుండి 2017 వరకు మిచిగాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్యానెల్ స్టడీ ఆఫ్ ఇన్కమ్ డైనమిక్స్ సర్వేలో భాగమైన ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ సప్లిమెంట్ నుండి సమాచారాన్ని కూడా చేర్చారు. 90 శాతానికి పైగా ప్రజలు వివిధ కారణాల వల్ల వివక్షను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.
వివక్షను ఎదుర్కొంటున్న వారిలో కారకాల్లో 26 శాతం వయస్సుపైన, 19 శాతం ప్రవర్తానా శైలిపైన, 14 శాతం లింగం (స్త్రీ లేదా పురుఫుడు లేదా నంపుసకుడు)పైనా, 13 శాతం జాతిపై ఉందని తెలియజేశారు. ఈ పరిశోధనల ఆధారంగా.. నెలలో కొన్ని సార్లు ఏదో ఒక రకమైన వివక్షతో బాధపడే వ్యక్తికి ఇతరులతో పోలిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు 25 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇలాంటి వివక్షను అనుభవించే వ్యక్తికి ఇతరులతో పోలిస్తే తీవ్రమైన మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. ఇలాంటి వివక్షను ఎదుర్కొంటున్న వారిలో 26 శాతం మంది చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిసలుగా మారతున్నారు.
అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నారని తెలియడానికి కౌమార దశ అనేది కీలక సమయం. ఎందుకంటే మొత్తం జీవితకాల మానసిక ఆరోగ్య సమస్యలలో 75 శాలం 24 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి అని అధ్యయన రచయిత వైవోన్ లీ పరిశోధనలో కనుగొన్న విషయాల గురించి మాట్లాడుతూ చెప్పారు. లీ UCLAలోని డేవిడ్ జెఫెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వైద్య విద్యార్థి కూడా ఇలాంటిదే వెల్లడించారు. కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా కూడా కొంత వివక్షకు గురైనట్లు కూడా కొత్త కూడా లీ పేర్కొన్నారు. ఇలాంటివి ఇతర రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి అని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.