Home /News /life-style /

Digestive Problems: మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా?.. ఈ లక్షణాలతో తెలుసుకోండి..

Digestive Problems: మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా?.. ఈ లక్షణాలతో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకరమైన, సమతులాహారం తీసుకున్నప్పటికీ.. జీర్ణ టాక్సిన్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ డైట్ తో పాటు మంచి అలవాట్లను అలవరచుకోవడం వల్ల డైజెస్టివ్ టాక్సిన్ల బారి నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

ప్రస్తుతం చాలామంది బద్దకపు జీవనశైలిని పాటిస్తున్నారు. ఎటూ కదలకుండా రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. కొందరు ఆలస్యంగా పడుకోవడం, జంక్ ఫుడ్ విపరీతంగా ఆరగించడం వంటివి చేస్తుంటారు. అటువంటి వారిలో ఎక్కువగా ఛాతీలో మంట, కడుపునొప్పి(Abdominal pain), మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు(Digestive Problems) వస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల జీర్ణ విషతుల్యాలు (Digestive Toxins) కూడా పెరిగిపోతాయి. వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఈ టాక్సిన్‌లు జీవక్రియతో పాటు మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తాయని వివరిస్తున్నారు.

ఆరోగ్యకరమైన, సమతులాహారం తీసుకున్నప్పటికీ.. జీర్ణ టాక్సిన్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ డైట్ తో పాటు మంచి అలవాట్లను అలవరచుకోవడం వల్ల డైజెస్టివ్ టాక్సిన్ల బారి నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

జీర్ణవ్యవస్థ(Digestive system) అనారోగ్యానికి దారితీసే కారణాలు:

1. ఆకలి వేయకపోవడం:
మీకు ఆకలి వేయడం లేదా..? అయితే మీ జీర్ణ వ్యవస్థ అనారోగ్యంగా ఉన్నట్లే పరిగణించాలి. ఆకలి వేస్తున్నట్లు ఫీలింగ్ రాకపోతే.. కడుపులోని ఆహారం సరిగా జీర్ణం కావట్లేదని గమనించాలి. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ.. డైజెస్టివ్ టాక్సిన్లు పెరిగిపోతాయి.

2. పచ్చి, చల్లని ఆహార పదార్థాలు:
తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావాలంటే కడుపులోని యాసిడ్లతో సహా జీర్ణ ఎంజైమ్‌లు సక్రమంగా ఉండాలి. మన జీర్ణశక్తి బలహీనంగా ఉంటే పచ్చి, చల్లని ఆహారాలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

3. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగడం:
మనం తిన్న భోజనాన్ని అరిగించాలంటే మన జీర్ణశక్తి బలంగా ఉండాలి. కడుపు లోపల జీర్ణవ్యవస్థ వేడిగా ఉండాలి. అప్పుడే మనం తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ భోజనం చేసే సమయంలో ఎక్కువ నీరు.. ముఖ్యంగా కోల్డ్ వాటర్ తాగితే ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఆహారంలోని పోషకాలు కూడా సరిగా ఒంటికి పట్టవు.

4. అజీర్ణం:
అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం అత్యంత ముఖ్యం. వ్యాయామం చేయడం, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి. నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎక్కువగా తినకూడదు.

5. ఒత్తిడి:
మనం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఆహారం తినలేకపోతుంటాం. ఇటువంటి సందర్భాల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. మనసు కుదుట పడిన తర్వాతనే ఆహారం స్వీకరించాలి.

6. ఆహారపు అలవాట్లు:
భోజనం మానేయడం, ఆకలి లేకపోయినా తినడం, ఒకేసారి అధిక మోతాదులో తినడం వంటివి చేయకూడదు. వేళాపాళా లేకుండా తినడం, నిద్రపోయే ముందు తినడం వంటివి కూడా మన జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Health Tips, Stomach Pain

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు