Home /News /life-style /

HEALTH DIFFERENCE BETWEEN MONSOON VIRAL AND CORONA UMG GH

Monsoon Viral Or Covid-19: ఒకేలా కనిపించే సీజనల్‌ వ్యాధులు, కరోనా లక్షణాలు! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి!

వైరల్ ఫీవరా..? కరోనా వైరసా..?

వైరల్ ఫీవరా..? కరోనా వైరసా..?

వర్షాకాలం మొదలవుతున్న సమయంలో కొవిడ్‌ కేసులు కూడా పెరుగుతుండటంతో.. వర్షపు వాతావరణం వల్ల వచ్చే అనారోగ్యానికి, కరోనాకు మధ్య వ్యత్యాసాన్ని నిర్ధారించలేకపోవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి అప్రమత్తమవడానికి నిపుణులు చేసిన సూచనలు ఇవే..

ఇంకా చదవండి ...
వేసవి కాలం (Summer) ఉక్కపోతల నుంచి వర్షాకాలం (Monsoon) ఉపశమనం కలిగిస్తుంది. భయంకరమైన వేడిని వాన జల్లులు మాయం చేస్తాయి. అయితే ఇది వరుస ఇన్ఫెక్షన్లను కూడా తెస్తుంది. ప్రధానంగా ఉష్ణోగ్రత (Temperature) తగ్గుదల డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర వ్యాధులకు దారితీస్తుంది. వీటి లక్షణాలు దాదాపుగా కరోనా లక్షణాలు ఒకేలా ఉండటంతో రెండింటి మధ్య తేడాను గుర్తించలేకపోతే ప్రమాదం. ఇప్పుడు ఇండియాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం మొదలవుతున్న సమయంలో కొవిడ్‌ కేసులు కూడా పెరుగుతుండటంతో.. వర్షపు వాతావరణం వల్ల వచ్చే అనారోగ్యానికి, కరోనాకు మధ్య వ్యత్యాసాన్ని నిర్ధారించలేకపోవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి అప్రమత్తమవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేశారు.

* కరోనా, వర్షాకాలం వైరల్ ఇన్‌ఫెక్షన్‌ మధ్య వ్యత్యాసం:
* కరోనా(Carona)
SARs-COV-2 వైరస్ వల్ల శ్వాసకోశ వ్యవస్థలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని తెలిసింది. వైరస్ రూపం ఇతర రకాలుగా పరివర్తన చెందుతుంది. రోగులు సాధారణంగా వారి శ్వాసకోశంలో అసౌకర్యాన్ని అనుభవిస్తారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్య, వాసన, రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కరోనా ఎక్కువ కాలం కొనసాగుతుంది. కొన్ని కొవిడ్‌ లక్షణాలు కొన్ని నెలల పాటు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. టీకాలు వేసుకున్నా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతున్నందున.. వీలైనంత తక్కువగా బయట తిరగాలి. కరోనా నిబంధనలను పాటించాలి.



* వర్షాకాలం అనారోగ్యం(Monsoon Illness)
వర్షాకాలంలో జలుబు, జ్వరాలు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. అపరిశుభ్రంగా ఉన్న సరిసరాల ద్వారా ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌లు వ్యాపిస్తాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నుంచి బ్యాక్టీరియా చేతులు, నోరు, ముక్కు ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. రుతుపవనాలతో సంబంధం ఉన్న వ్యాధులలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణం అయితే, వర్షాకాలంలో వెక్టార్ ద్వారా సంక్రమించే పరిస్థితులు పెరుగుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇంట్లో టైర్లు, పాత కూలర్లలో మంచినీరు పేరుకుపోకుండా చూసుకోండి. ముఖ్యంగా పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు దోమల నివారణ క్రీములు లేదా స్ప్రేలను ఉపయోగించడం మేలు. సీజనల్‌ వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి శుభ్రతను పాటించడం ప్రధానం. డెంగ్యూ వంటి వాటి నుంచి రక్షణ పొందడానికి వీలైనంత ఎక్కువగా చేతులను, కాళ్లను కంపి ఉంచే దుస్తులు ధరించాలి.

వర్షాకాలంలో ఏదైనా అనారోగ్యం సమస్య తలెత్తితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. రాబోయే నెలల్లో రుతుపవనాలు మరింత ఉధృతంగా మారే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.
Published by:Mahesh
First published:

Tags: Covid, Dengue fever, Health, Viral infection

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు