హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..

Weight loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..

శీతాకాలానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్‌ను మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా డైట్‌లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఐదు రకాల ఆహార పదార్థాలను ప్రముఖ న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇవి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పారు. అవేంటంటే..

శీతాకాలానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్‌ను మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా డైట్‌లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఐదు రకాల ఆహార పదార్థాలను ప్రముఖ న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇవి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పారు. అవేంటంటే..

Weight loss: మారుతున్న జీవన శైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగా కరోనాతో ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​, విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసుల కల్చర్​ పెరగడంతో ఈ సమస్య మరింత అధికమైంది. వ్యాయామం లేక చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

మారుతున్న జీవన శైలి కారణంగా వయసు(Age)తో సంబంధం లేకుండా చాలా మందిని అధిక బరువు(Weight) సమస్య వేధిస్తోంది. ప్రధానంగా కరోనాతో ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్(Work From Home) ​, విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసుల కల్చర్​ (Online Class Culture) పెరగడంతో ఈ సమస్య మరింత అధికమైంది. వ్యాయామం లేక చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది డైటింగ్, వ్యాయామాలు, జిమ్​ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే డైటింగ్​ చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బరువు తగ్గడం అటుంచితే.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెల్త్ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. డైటింగ్​ సమయంలో కొవ్వు తక్కువగా ఉండే సమతుల్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు. అంతేకాదు, మీ డైట్​లో కొన్ని మార్పులు చేయాలని సలహాలిస్తున్నారు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే ఈ తప్పిదాలు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


ఈ మిస్టేక్స్​ చేయకండి..

డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ ఆకలి నియంత్రిస్తాయి. మనలో చాలా మంది సలాడ్లకు బదులు రుచికరమైన వంటల వైపు మొగ్గుచూపుంటారు. అయితే వీటిలోని కొవ్వు పదార్థాలు బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. డైటింగ్ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోరు కాబట్టి శరీరం శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే 80 నుంచి 120 కేలరీలు గల ఆహారాన్ని తీసుకోండి. మీరు తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే కేలరీలను లెక్కించుకొని డైట్​ ప్లాన్​ చేసుకోండి.

Work From Office: హైదరాబాద్ లో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి.. ఆ తేదీ నుంచి ఆఫీస్ లకు రావాల్సిందే.. !


వేగంగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది అధిక వ్యాయామాలు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదని హెల్త్​ కేర్ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. అధిక వ్యాయామాలతో థర్మోజెనిసిస్ పెరుగుతుంది. అందుకే, ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో నడుస్తుండటం వంటివి చేయండి. డైటింగ్ సమయంలో ఎక్కువ పండ్లు తినడం మంచిది. వీటిలోని పోషకాలు మీకు అదనపు శక్తినిస్తాయి.

పండ్లలో విటమిన్లు, మినరల్స్​, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తుంది. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే ఇతర ఆహారాల కంటే పండ్లు తినేందుకు మొగ్గుచూపండి. నెమ్మదిగా తినడం, ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఆహారం తినేటప్పుడు టీవీ చూడటం, ఫోన్ మాట్లాడటం వంటి పరధ్యానాలకు దూరంగా ఉండాలి. దీంతోపాటు మీ ఆహారంలో సరైన మొతాదులో ఫైబర్, ప్రోటీన్‌ ఉండేట్లు చూసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Diet, Health benifits

ఉత్తమ కథలు